Star Heros: భయంకరమైన అలవాటును మానేసిన స్టార్ హీరోలు.. అందులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కూడా?

Mahesh Babu, Pawan Kalyan

Star Heros:  సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ధూమపానం అలవాటు చాలా మందిలో ఉంది. ధూమపానం ను తాగితే ఆరోగ్యానికి హానికరం అని ప్రకటనలు ఇచ్చిన కూడా ఎవరు దానిని వదిలి ఉండలేక పోతున్నారు.

  • Share this:
    Star Heros:  సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ధూమపానం అలవాటు చాలా మందిలో ఉంది. ధూమపానం ను తాగితే ఆరోగ్యానికి హానికరం అని ప్రకటనలు ఇచ్చిన కూడా ఎవరు దానిని వదిలి ఉండలేక పోతున్నారు. ఇక యువత మాత్రం బాగా బానిస అయ్యారు అని చెప్పవచ్చు. ఇక సినీ ఇండస్ట్రీలో కొందరి హీరోలకు కూడా సిగరెట్ తాగే అలవాటు ఉంది. వాళ్లు సిగరెట్లకు బానిసలు కాగా అందులో కొందరు సిగరెట్లు తాగడం మానేశారు. ఇంతకు వాళ్ళు ఎవరో చూద్దాం..

    భారత సినీ నటుడు రజినీకాంత్ సినిమాలలో సిగరెట్ తాగే స్టైలే పేరు. కానీ నిజ జీవితంలో కూడా తెగ సిగరెట్లు కాల్చేవాడట. ఈయన సిగరెట్ తాగే స్టైల్ అని చూసి ఓ పెద్దాయన ఈనెల సినిమాల్లోకి తీసుకువచ్చారట. ఇక అలాంటిది ఆయన డిసెంబర్ 12న 2012లో సిగరెట్ కాల్చడం మానేస్తానని అంతే కాకుండా అభిమానులను కూడా సిగరెట్టు తాగకూడదని కోరాడట. ఈయన సిగరెట్ మానేయడానికి కారణం తన మనవడేనట‌. ఆయన సిగరెట్ తాగితే ఆ వాసనకి తన మనవడు తన దగ్గరికి రావడం లేదని మానేసాడట.

    మరో భారత సినీ నటుడు కమల్ హాసన్ కూడా నిజజీవితంలో బాగా సిగరెట్లు కాల్చే వాడట. ఆయనకు పదకొండేళ్ల వయసు ఉన్నప్పటినుండే సిగరెట్ అలవాటు ఉండేదట. ఇక ఆయన సినిమాలలో హీరోయిన్స్ కు లిప్ లాక్ లో ఎక్కువగా పెడుతున్న సమయంలో వాళ్లు ఇబ్బంది పడకూడదని సరదాగా అనడంతో సిగరెట్లు మానేసాడట‌.ఇక టాలీవుడ్ యంగ్ హీరో మహేష్ బాబు కూడా తెగ సిగరెట్లు తాగుతాడు. ఈయన తన స్నేహితుడు ఇచ్చిన ఓ పుస్తకాన్ని చదవడం వల్ల సిగరెట్ కి దూరం అయ్యాడట.

    Mahesh Babu, Pawan Kalyan smoking
    Mahesh Babu, Pawan Kalyan smoking


    ఇక మరో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నిజ జీవితంలో సిగరెట్ తాగేవాడట‌.. కానీ అలవాటును దూరం చేసుకున్నాడు.ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా సమయంలో స్మోక్ చేయగా ఆ తర్వాత ఇప్పటివరకు స్మోక్ చేయలేదట. ఇక రానా దగ్గుబాటి కూడా స్మోకింగ్ అలవాటు ఉండేదట. కానీ డాక్టర్ సలహా తో ఈయన కూడా మానేసాడట.స్టార్ హీరో మమ్ముట్టి కూడా ఏడేళ్ల కిందటే స్మోకింగ్ కు దూరం అయ్యాడట. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మధ్యలో అలవాటు చేసుకోగా వెంటనే దానికి దూరమయ్యాడట. ఇక సల్మాన్ కూడా స్మోకింగ్ వల్ల ఆరోగ్యం దెబ్బతినడంతో డాక్టర్ల మేరకు స్మోకింగ్ వదిలేశాడట. ఇక అమీర్ ఖాన్ కూడా ఈ అలవాటు ఉండగా తన పిల్లల కోసం మీ అలవాటును దూరం చేసుకున్నాడట.
    Published by:Navya Reddy
    First published: