Most Eligible Bachelor Twitter Review : ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ట్విట్టర్ రివ్యూ.. అఖిల్ హిట్ అందుకున్నారా..

నైజాం: 6.50 కోట్లు సీడెడ్: 2.48 కోట్లు

Most Eligible Bachelor Twitter Review  : అక్కినేని మూడో తరం రెండో నట వారసుడు అఖిల్ (Akhil Akkineni) హీరోగా, పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటించిన మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే..

  • Share this:
    Most Eligible Bachelor Twitter Review  : అక్కినేని మూడో తరం రెండో నట వారసుడు అఖిల్ (Akhil Akkineni) హీరోగా, పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటించిన మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కించిన ఈ సినిమా విజయ దశమి కానుకగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.  హీరోగా వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకంగా మారింది.అటు బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం. మరోవైపు నాగార్జున కూడా తన కుమారుడికి మంచి హిట్ ఇవ్వాలనే ఆలోచనతో ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో విడులైన ఈ సినిమాకు సామాజిక మాధ్యమాల్లో ఈ సినిమా చూసి ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు.

    ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ టైటిల్‌కు తగ్గట్టు ఆ పాత్రలో అఖిల్ సరిగ్గా సరిపోయాడని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే ఉన్న అఖిల్ .. తన గ్లామర్‌తో డామినేట్ చేసినట్టు చెబుతున్నారు. అంతేకాదు ఈ చిత్రంలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందంటున్నారు.



    Naga Chaitanya - Akhil : నాగచైతన్యకు కలిసిరాని అదృష్టం.. అఖిల్‌కు కలిసొచ్చిందిగా..

    వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ అని చెబుతున్నారు. మరి ముఖ్యంగా నిర్మాణ పరంగా గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని ఉన్నతంగా తెరకెక్కించారంటున్నారు. అంతేకాదు బొమ్మరిల్లు తర్వాత మరోసారి భాస్కర్.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో అఖిల్‌కు హిట్టు ఇచ్చాడనే చెప్పుకుంటున్నారు. ఈ సినిమాతో అఖిల్ తొలిసారి హిట్టు చూసేనట్టు అని ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు.


    అంతేకాదు పూజా హెగ్డే.. ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచిందంటున్నారు. అంతేకాదు అఖిల్, పూజ ా హెగ్డేల మధ్య పాటలు కూడా ఎంతో క్యూట్‌గా ఉన్నాయంటున్నారు. ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కించాడని చెబుతున్నారు.


    అంతేకాదు కామెడీ కూడా అదరిపోయిందంటున్నారు. సుడిగాలి సుధీర్ ఈ సినిమాలో తన కామెడీతో కితకితలు పెట్టారని చెబుతున్నారు. మరికొందరు మాత్రం యావరేజ్ మూవీ అని తేల్చేస్తున్నారు.

    మొత్తంగా అక్కినేని అఖిల్.. తొలిసారి సామాజిక మాధ్యమాల్లో చెప్పినట్టు హిట్టు అందుకుంటారా.. లేదా అనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: