హోమ్ /వార్తలు /సినిమా /

Most Eligible Bachelor: ‘లెహరాయి’ అంటున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అఖిల్.. పూజా హెగ్డేతో అదిరిపోయే రొమాన్స్..

Most Eligible Bachelor: ‘లెహరాయి’ అంటున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అఖిల్.. పూజా హెగ్డేతో అదిరిపోయే రొమాన్స్..

ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. సినిమా చాలా బాగా వచ్చిందని వాళ్లు ప్రశంసలు కూడా కురిపించారు. సెప్టెంబర్ 30న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ట్రైలర్ విడుదల కానుంది. ఈ సినిమాను అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్.

ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. సినిమా చాలా బాగా వచ్చిందని వాళ్లు ప్రశంసలు కూడా కురిపించారు. సెప్టెంబర్ 30న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ట్రైలర్ విడుదల కానుంది. ఈ సినిమాను అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్.

Most Eligible Bachelor: హిట్ కొట్టాలనే గట్టి పట్టుదలతో అఖిల్ (Akhil Akkineni) చేస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (Most Eligible Bachelor). బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అక్టోబర్ 8న విడుదల కానుండటంతో ప్రమోషన్‌లోనూ వేగం పెంచేసారు చిత్ర యూనిట్.

ఇంకా చదవండి ...

హిట్ కొట్టాలనే గట్టి పట్టుదలతో అఖిల్ చేస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అక్టోబర్ 8న విడుదల కానుండటంతో ప్రమోషన్‌లోనూ వేగం పెంచేసారు చిత్ర యూనిట్. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ ప్రోమో సాంగ్ విడుదలైంది. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే రొమాన్స్ ఈ పాటకు హైలైట్ అయింది. ఈ ఇద్దరూ జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం నుంచి రొమాంటిక్ లెహరాయి సాంగ్ ప్రోమో విడుదలైంది. లెహరాయి లెహరాయి గుండెలోని ఆశలన్నీ ఎగిరాయి అంటూ సాగే ఈ పాటను తనదైన శైలిలో అద్భుతంగా ఆలపించారు సిద్ శ్రీరామ్. సెప్టెంబర్ 15న ఫుల్ సాంగ్ విడుదల కానుంది.

Allu Arjun at road side tiffin center: రోడ్డు పక్కన బండి దగ్గర టిఫిన్ చేసిన అల్లు అర్జున్.. వీడియో వైరల్..ఈ మేరకు విడుదలైన ప్రోమోలో అఖిల్, పూజ హెగ్డే రొమాన్స్ అదిరిపోయింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు. ప్ర‌ముఖ మ్యూజిక్ ఛాన‌ల్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుద‌ల అవుతుంది.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Most Eligible Bachelor, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు