హోమ్ /వార్తలు /సినిమా /

Most Eligible Bachelor Collections: ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ 2 డేస్ కలెక్షన్స్.. అఖిల్ అక్కినేని ఊచకోత..

Most Eligible Bachelor Collections: ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ 2 డేస్ కలెక్షన్స్.. అఖిల్ అక్కినేని ఊచకోత..

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కలెక్షన్స్ (most Eligible bacheor)

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కలెక్షన్స్ (most Eligible bacheor)

Most Eligible Bachelor Collections: అఖిల్ అక్కినేని (Akhil Akkineni), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ (Most Eligible Bachelor Collections). భారీ అంచనాలతో దసరాకు విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇప్పుడు వసూళ్లు కూడా అద్భుతంగా వస్తున్నాయి.

ఇంకా చదవండి ...

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. భారీ అంచనాలతో దసరాకు విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇప్పుడు వసూళ్లు కూడా అద్భుతంగా వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే రెండు రోజుల్లోనే సినిమా 70 శాతం రికవరీ వెనక్కి తెచ్చేసింది. ఆదివారం కూడా అద్భుతమైన కలెక్షన్స్ రావడం ఖాయం అయిపోయింది. ప్రతీచోట హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పైగా దీనికి పోటీగా విడుదలైన మహా సముద్రం, పెళ్లి సందడి సినిమాలు తేలిపోవడంతో అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కుమ్మేస్తుంది. బాక్సాఫీస్ దగ్గర అయ్యగారు ఊచకోత కోస్తున్నారు. ఆరేళ్ల కెరీర్‌లో తొలిసారి విజయం రుచి ఎలా ఉంటుందో చూడబోతున్నాడు అఖిల్. ఇన్నేళ్లుగా తాను వేచి చూసిన రోజు రానే వచ్చిందంటూ పండగ చేసుకుంటున్నాడు. ఈ విజయాన్ని అఖిల్ కంటే కూడా ఎక్కువగా నాగార్జున ఎంజాయ్ చేస్తున్నాడు.

కొడుకును వినాయక్, విక్రమ్ కే కుమార్, వెంకీ అట్లూరి లాంటి చాలా మంది హిట్ దర్శకుల చేతుల్లో పెట్టినా రాని విజయం.. 14 ఏళ్లుగా హిట్ లేని బొమ్మరిల్లు భాస్కర్ ఇచ్చాడు. రెండు రోజుల్లోనే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చాలా చోట్ల అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తీసుకుని.. కన్ఫ్యూజ్ అయినా కూడా కాస్త క్లారిటీగానే చెప్పాడు బొమ్మరిల్లు భాస్కర్. మరి ఈ సినిమా రెండో రోజు ఎంత వసూలు చేసింది.. రెండు రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం..

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్..

నైజాం: 4.13 కోట్లు

సీడెడ్: 2.16 కోట్లు

ఉత్తరాంధ్ర: 1.15 కోట్లు

ఈస్ట్: 0.71 కోట్లు

వెస్ట్: 0.64 కోట్లు

గుంటూరు: 0.75 కోట్లు

కృష్ణా: 0.58 కోట్లు

నెల్లూరు: 0.45 కోట్లు

ఏపీ + తెలంగాణ: 10.57 కోట్లు షేర్ 

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 3.11 కోట్లు

వరల్డ్ వైడ్ 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 13.67 కోట్లు షేర్

Mohan Babu - Shiva Balaji wife: ఏయ్ అమ్మాయి ఏంటిది.. నటుడు శివబాలాజీ భార్యపై మోహన్ బాబు సీరియస్..


Chiranjeevi: చిరంజీవి నిర్ణయాలతో అసంతృప్తిలో దర్శకులు.. మెగాస్టార్ ఎందుకిలా చేస్తున్నాడో..?
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాకు 20 కోట్ల బిజినెస్ జరిగింది. రెండు రోజుల్లోనే ఈ చిత్రం 13 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. మూడో రోజు కూడా చాలా చోట్ల హౌజ్ ఫుల్స్ కనిపిస్తున్నాయి. కచ్చితంగా మరో 5 కోట్లు షేర్ రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదే జరిగితే మూడు రోజుల్లోనే సినిమా 85 శాతానికి పైగానే పెట్టుబడి వెనక్కి తీసుకొచ్చినట్లు అవుతుంది. సోమవారం నుంచి సినిమా ఎలా పర్ఫార్మ్ చేస్తుందనే దానిపై ఈ సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అఖిల్ కచ్చితంగా పెద్ద హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు.

First published:

Tags: Akhil Akkineni, Box Office Collections, Most Eligible Bachelor, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు