హోమ్ /వార్తలు /సినిమా /

Most Eligible Bachelor 11 days WW Collections: ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ 11 డేస్ కలెక్షన్స్.. 40 కోట్ల దిశగా అడుగులు..!

Most Eligible Bachelor 11 days WW Collections: ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ 11 డేస్ కలెక్షన్స్.. 40 కోట్ల దిశగా అడుగులు..!

అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (most eligible bachelor)

అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (most eligible bachelor)

Most Eligible Bachelor 11 days WW Collections: అఖిల్ అక్కినేని (Akhil Akkineni), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ (Most Eligible Bachelor Collections). భారీ అంచనాలతో దసరాకు విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇప్పుడు వసూళ్లు కూడా అద్భుతంగా వస్తున్నాయి.

ఇంకా చదవండి ...

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. భారీ అంచనాలతో దసరాకు విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇప్పుడు వసూళ్లు కూడా అద్భుతంగా వస్తున్నాయి. 5 రోజుల్లోనే సినిమా 100 శాతం రికవరీ వెనక్కి తెచ్చేసింది. వీక్ డేస్ మొదలైన తర్వాత కూడా మంచి కలెక్షన్స్ రావడం తీసుకొస్తున్నాడు బ్యాచ్‌లర్. 10వ రోజు కూడా 50 లక్షలకు పైగా షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. ఇప్పటికీ చాలా చోట్ల వసూళ్లు బాగానే వస్తున్నాయి. పైగా దీనికి పోటీగా విడుదలైన మహా సముద్రం, పెళ్లి సందడి సినిమాలు పోటీ ఇవ్వకపోవడంతో అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కుమ్మేస్తుంది. బాక్సాఫీస్ దగ్గర అయ్యగారు బాగానే వసూలు చేసారు. ఆరేళ్ల కెరీర్‌లో తొలిసారి విజయం రుచి ఎలా ఉంటుందో చూసాడు అఖిల్. ఇన్నేళ్లుగా తాను వేచి చూసిన రోజు రానే వచ్చిందంటూ పండగ చేసుకుంటున్నాడు. ఈ విజయాన్ని అఖిల్ కంటే కూడా ఎక్కువగా నాగార్జున ఎంజాయ్ చేస్తున్నాడు.

కొడుకును వినాయక్, విక్రమ్ కే కుమార్, వెంకీ అట్లూరి లాంటి చాలా మంది హిట్ దర్శకుల చేతుల్లో పెట్టినా రాని విజయం.. 14 ఏళ్లుగా హిట్ లేని బొమ్మరిల్లు భాస్కర్ ఇచ్చాడు. రెండు రోజుల్లోనే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చాలా చోట్ల అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తీసుకుని.. కన్ఫ్యూజ్ అయినా కూడా కాస్త క్లారిటీగానే చెప్పాడు బొమ్మరిల్లు భాస్కర్. మరి ఈ సినిమా 11వ రోజు ఎంత వసూలు చేసింది.. 11 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం..

Nidhhi Agerwal: సెన్సేషనల్ హాట్ షోతో సెగలు పుట్టిస్తున్న నిధి అగర్వాల్..


‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ 11 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్..

నైజాం: 7.42 కోట్లు

సీడెడ్: 3.94 కోట్లు

ఉత్తరాంధ్ర: 2.31 కోట్లు

ఈస్ట్: 1.20 కోట్లు

వెస్ట్: 0.97 కోట్లు

గుంటూరు: 1.36 కోట్లు

కృష్ణా: 1.09 కోట్లు

నెల్లూరు: 0.82 కోట్లు

ఏపీ + తెలంగాణ: 19.11 కోట్లు షేర్ (32 కోట్ల గ్రాస్)

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 3.82 కోట్లు

వరల్డ్ వైడ్ 5 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 22.94 కోట్లు షేర్ (39 కోట్ల గ్రాస్)


Actors as Aghora: బాలకృష్ణ, విశ్వక్ సేన్ నుంచి చిరంజీవి వరకు.. ‘అఘోర’ పాత్రల్లో నటించిన నటులు వీళ్ళే..
 మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాకు 19.71 కోట్ల బిజినెస్ జరిగింది. 11 రోజుల్లోనే ఈ చిత్రం 22.94 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇప్పటికే అన్నిచోట్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వచ్చేసారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అయితే లాభాలు మొదలైపోయాయి. నైజాంలోనూ మంచి లాభాలు వస్తున్నాయి. వీక్ డేస్ మొదలైన తర్వాత కూడా కలెక్షన్స్ బాగానే వస్తుండటంతో ఊపిరి పీల్చుకున్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అఖిల్ సినిమా మిగిలిన వాళ్లకు బలాన్నిచ్చింది.

First published:

Tags: Akhil Akkineni, Most Eligible Bachelor, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు