Mosagallu Twitter Review: ’మోసగాళ్లు’ ట్విట్టర్ రివ్యూ.. మంచు విష్ణు హిట్ అందుకున్నాడా..

‘మోసగాళ్లు’ ట్విట్టర్ రివ్యూ (Twitter/Photo)

Mosagallu Twitter Review: లాంగ్ గ్యాప్ తర్వాత మంచు విష్ణు హీరోగా వస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’.  మంచు విష్ణుతో పాటు కాజల్ అగర్వాల్  కీలక పాత్రలో నటించింి.  బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి పోలీసు పాత్రలో, నవదీప్ కూడా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం..

  • Share this:
    Mosagallu Twitter Review: లాంగ్ గ్యాప్ తర్వాత మంచు విష్ణు హీరోగా వస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’.  మంచు విష్ణుతో పాటు కాజల్ అగర్వాల్  కీలక పాత్రలో నటించింి.  బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి పోలీసు పాత్రలో, నవదీప్ కూడా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో విష్ణు హీరోగా నటించడంతో పాటు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తుండటంతో భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా హిట్ కొట్టి మళ్లీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ఆచితూచి మరీ ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యమున్న కథను ఎంచుకున్నారు. సినిమాలో ప్రముఖులు నటించడం ఒక ఎత్తయితే.. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్, టీజర్‌తో మంచి టాక్ రావడంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. మరోవైపు ప్రమోషన్స్‌ కూడా బాగానే చేస్తున్నారు. మరి ఈ సినిమా విడుదలైన నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉందంటే.. మరోవైపు ఈ రోజు నట ప్రపూర్ణ మోహన్ బాబు పుట్టినరోజున ‘మోసగాళ్లు’ విడుదల అవ్వడంతో మంచు విష్ణు ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు.





    ఐటీ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాగుందనే టాక్ వినబడుతోంది.అంతేకాదు ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ ఇంగ్లీష్, తమిళం, మలయాళం, కన్నడలో ఒకేసారి రిలీజ్ చేసారు. అన్ని భాషల్లో కాజల్ అగర్వాల్ ప్రేక్షకులకు పరిచయం కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. ఇప్పటికే అన్ని భాషల్లో ఈ సినిమా మంచి బిజినెస్ చేసింది. అంతేకాదు ఈ సినిమాకు మంచు విష్ణు ఇన్సూరెన్స్ చేయించినట్టు
    టాక్.






    మొత్తంగా ఫస్ట్ హాఫ్ మాములుగా స్టార్ట్ అయినా.. ఎలాంటి ఆలస్యం చేయకుండా కథలో ఎంట్రీ ఇవ్వడం.. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరపోయిందని చెబుతున్నారు. ఈ సినిమాకు వెంకటేష్ వాయిస్ ఓవర్ బాగుందంటున్నారు. క్రాక్ సినిమాకు వెంకటేష్ వాయిస్ ఓవర్ కలిసోచ్చినట్టే మోసగాళ్లు సినిమాకు వెంకటేష్ వాయిస్ ఓవర్ హెల్ప్ అవుతుందని చెబుతున్నారు. మొత్తంగా మంచు విష్ణు.. కాజల్ తోడుగా హిట్ అందుకున్నాడా లేదా పూర్తి రివ్యూతో మరికాసేపట్లో కలుద్దాం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: