Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకి బాగా ఆసక్తిగా మారింది. ఈ సీరియల్ పై బుల్లితెర ప్రేక్షకులకు మంచి అభిమానం ఉంది. రేటింగ్ కూడా మొదటి స్థానంలోనే తిరుగుతుంది. ఇక జైల్లో మోనిత తెల్ల చీర కట్టుకొని కనిపించగా ఆ జైలు లోపల గోడలపై నా కార్తీక్ అని నింపేసింది. కార్తీక్ ను ఊహించుకుంటూ నేను చీరలో అందంగా ఉన్నాను కదా మురిసిపోతుంది. ఎలా ఉన్నావు అంటూ పదేపదే గుర్తొస్తున్నావ్ అంటూ 18 నెలల వరకు చూడకుండా ఎలా ఉండాలి అంటూ మాట్లాడుకుంటుంది.అంతలోనే లేడీ కానిస్టేబుల్ వచ్చి ఎవరాయన అని ప్రశ్నిస్తుంది.
నా కాబోయే భర్త అంటూ నా బిడ్డకు తండ్రి అని చెప్పగా కానిస్టేబుల్ ఆశ్చర్యపోతూ ఈమె గురించి విన్నాను కానీ ఈమె ఇలా ఉంటుందని అనుకోలేదు అని అనుకుంటుంది. ఇక ఆ కానిస్టేబుల్ తో కాసేపు తన ప్రేమ గురించి చెప్పేసరికి ఆ కానిస్టేబుల్ సైలెంట్ గా వెళ్లిపోతుంది. పిల్లలు సౌందర్య దగ్గర కూర్చొని ఏమైనా కబుర్లు చెప్పమని కోరుకుంటారు. ఇక సౌందర్య కొన్ని విషయాల గురించి మాట్లాడుతుంది. తన గురించి పిల్లలకు చెబుతుంది. ఇక పిల్లలు ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో సౌందర్యకు కోపం వచ్చి వారి చెవులు పిండేస్తుంది. అంతేకాకుండా పిల్లలను తిడుతుంది.
ఇది కూడా చదవండి: అమెరికాకు పయనమైన వంటలక్క కుటుంబం.. మోనిత తిరిగిచ్చేలోపు మనం వెళ్లిపోవాలంటూ?
ఇక పిల్లలు అందరం కలిసి ఉంటామా లేదా అంటూ ఎప్పుడూ ఇలాగే ఉంటామా మళ్లీ అమ్మానాన్న విడిపోరు కదా అని ప్రశ్నలు వేస్తుంటారు. ఇక సౌందర్య వాటికి సమాధానం చెబుతుంది.ఇక దీప గతంలో తను ఇంట్లోకి నుంచి వెళ్లిన విషయాలను, పిల్లలతో వేరే ఇంట్లో ఉంటూ బయట వంటలు చేసుకుంటూ గడిపిన క్షణాలలో, మోనిత తనతో మాట్లాడిన విషయాలను తలుచుకుంటుంది. ఇక మోనిత ప్రెగ్నెంట్ విషయాన్ని తలుచుకుని ఆలోచనలో పడుతుంది. అప్పుడే కార్తీక్ దిగులుగా ఆలోచిస్తూ వస్తాడు. ఇక దీపతో కాస్త కొత్తగా మాట్లాడుతాడు.
ఇది కూడా చదవండి:ఇది ఇంట్రవెల్ మాత్రమే 'క్లైమాక్స్'లో చుక్కలు చూపిస్తానంటున్నా ఖైదీ మోనిత
ఇక కార్తీక్ ఇకపై సంతోషంగా ఉండాలని పిల్లలతో మంచిగా గడపాలని అని దీపతో అంటాడు. దీప అప్పుడే అంతా జరిగిపోయింది అనుకోకండి అంటూ.. 11 సంవత్సరాలు ఎలా గడిచాయో సంవత్సరన్నర కూడా అలాగే గడుస్తుంది అంటే మళ్లీ మోనిత బిడ్డతో ఈ ఇంటికి వస్తుంది అంటూ అప్పుడు సమస్య ఇంకా పెద్దదిగా అవుతుంది అని అప్పుడు పిల్లలకు అబద్ధం చెప్పినా కూడా మోనిత నిజం చెప్పేస్తుంది అని అందుకే పిల్లలకి ఇప్పుడే చెప్పేద్దాం అంటూ దీప అనడంతో కార్తీక్ వెంటనే కోపంతో రగిలిపోతాడు. అటువంటి సమస్య రాకముందే అమెరికాకు వెళ్ళిపోదాము అంటూ గట్టిగా చెప్పేస్తాడు. ఇక జైల్లో మోనిత నిద్రలోనే కార్తీక్ ని తలుచుకుంటుంది. ఇక కార్తీక్ ను మళ్లీ పలకరిస్తుంది. సంవత్సరన్నర నాకు చాలా తొందరగా అయిపోతుంది అని కానీ మీకు సమయం ఉంది అంటూ అంతలోపు ఆ దీప కార్తీక్ ను మారుస్తుందేమో అని అనుకుంటుంది. అంతలోపే ఏదైనా చెయ్యాలి అంటూ బాగా కసి పట్టుకుని ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Archana ananth, Doctor babu, Karthika deepam, Monitha, Nirupam paritala, Premi Viswanath, Shobashetty, Soundarya, Vantalakka