Karthika Deepam: జైల్లో మోనిత... నిర్దోషిగా బయటపడ్డ డాక్టర్ బాబు.. సీరియల్‌కు శుభం కార్డు?

karthika deepam

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తిగా మారింది. ప్రేక్షకులు మాత్రం ఈ సీరియల్ ను అస్సలు మిస్ అవ్వట్లేదు. రేటింగ్ కూడా మొదటి స్థానంలో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే కార్తీక్ కు కోర్టులో విచారణ జరుగుతుంది.

  • Share this:
    Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తిగా మారింది. ప్రేక్షకులు మాత్రం ఈ సీరియల్ ను అస్సలు మిస్ అవ్వట్లేదు. రేటింగ్ కూడా మొదటి స్థానంలో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే కార్తీక్ కు కోర్టులో విచారణ జరుగుతుంది. మరోవైపు మోనిత దీప చేతిలో ఉంటుంది. కోర్టు కాసేపు వాయిదా పడటంతో సౌందర్య కార్తీక్ కు భోజనం తీసుకొస్తుంది. కార్తీక్ ను అన్నం తినమంటూ బ్రతిమాలుతారు. కార్తీక్ దీప గురించి ఆలోచన ఉండటంతో దీప ఏమైందో అని మోనిత ఏం చేస్తుందో అని భయంగా ఉందని అంటాడు. సౌందర్య భయపడొద్దు అని ధైర్యం ఇస్తూ దీపకు ఏం కాదు అని నమ్మకం ఇస్తుంది. ఆనందరావు మోనిత నిజ స్వరూపం తెలుసుకుని దీపని ఏం చేస్తుందో అని భయపడతాడు. కార్తీక్ మళ్లీ బోల్ లోకి వస్తాడు. ఇక ఓ లాయర్ కార్తీక్ కు శిక్ష పడే విధంగా మాట్లాడుతాడు. దీంతో సౌందర్య, ఆనందరావు, ఆదిత్య ఎమోషనల్ కనిపిస్తారు. ఇక కోర్టులో కార్తీక్ తన వాదనలు వినిపిస్తాడు. తన గురించి తన కుటుంబం గురించి వివరిస్తాడు. గతంలో దీపను బాధపెట్టిన విషయం నుంచి అన్ని తెలుపుతాడు.

    ఇక మరోవైపు దీప మోనితను గన్ తో చంపడానికి బెదిరిస్తున్న సమయంలో వెంటనే మోనిత ఏడుస్తూ కడుపులో బిడ్డ అన్యాయంగా చనిపోవద్దు అంటూ ఎమోషనల్ గా మాట్లాడేసరికి దీప కాస్త సైలెంట్ అయినట్టుగా ఉంటుంది. మోనిత వెంటనే మనసులో ఇంకా అసలే చంపదులే అనుకుంటూనే బయటికి ఏడుస్తున్నట్లు కనిపిస్తుంది. గతంలో నీ బిడ్డలు లాగా నా బిడ్డ ఒంటరి కావద్దు అనేసరికి దీప కాస్త ఆలోచనలో పడినట్లు కనిపిస్తుంది.

    ఇది కూడా చదవండి:వంటలక్క గెలిచింది.. మోనితను కోర్టు బోనులో నిలబెట్టిన దీప.. సీరియల్‌కు త్వరలోనే శుభం కార్డు?

    నేరుగా వచ్చి కోర్టులో లొంగిపోతాను దీప చంపద్దు అంటూ.. కార్తీక్ విడిపిస్తాను అంటూ చావు భయంతోనే ఒప్పుకుంటుంది. ఇక కార్తీక్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆశలు పెట్టుకున్నాను అంటూ కార్తీకే నన్ను మోసం చేశాడు అంటూ కాస్త ఎమోషనల్ గా మాట్లాడుతుంది. ఇదివరకే కార్తీక్ ను నన్ను పెళ్లి చేసుకుంటే లొంగిపోతాను అని అన్న కూడా వినలేదు అంటూ కుమిలిపోతుంది. వస్తాను కోర్టులో లొంగిపోతాను అని అనేసరికి దీప గన్ ను పక్కన పడేస్తుంది.

    ఇది కూడా చదవండి:మోనితకు గన్నుతో గురి పెట్టిన దీప.. త్వరలోనే కార్తీకదీపం సీరియల్ కు శుభం కార్డు?

    ఇక కార్తీక్.. మోనిత బ్రతికి ఉన్నందుకు నా దగ్గర సాక్ష్యాలు లేవు అంటూ మారు వేషాలలో తిరుగుతుంది అంటూ తను వచ్చిన గెటప్ ల గురించి మాట్లాడుతాడు. ఇక లాయర్ వచ్చి ఇదంతా తప్పించుకోవడానికి మాట్లాడుతున్న మాటలు అంటూ వాదిస్తాడు. ఇక కార్తీక్ కు సపోర్ట్ గా మాట్లాడుతున్న లాయర్ ఏసిపి రోషిణి తో మరోసారి విచారించడానికి పిలుస్తాడు. తరువాయి భాగం లో విచారణ ముగిసిన సమయంలో దీప ఎంట్రీ ఇస్తూ సాక్ష్యం ఉందని సాక్ష్యం వైపు చూపించేసరికి అందరు షాక్ అవుతారు.
    Published by:Navya Reddy
    First published: