హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: పెళ్లి చేసుకో కార్తీక్ ఇది ప్రేమ.. ఉన్మాదం కాదంటూ రెచ్చిపోయిన మోనిత.. ఆతర్వాత ఏం జరిగిందంటే?

Karthika Deepam: పెళ్లి చేసుకో కార్తీక్ ఇది ప్రేమ.. ఉన్మాదం కాదంటూ రెచ్చిపోయిన మోనిత.. ఆతర్వాత ఏం జరిగిందంటే?

Karthika Deepam

Karthika Deepam

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో సీరియల్ దూసుకుపోతుంది.

  Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో సీరియల్ దూసుకుపోతుంది. ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ లో కార్తీక్ రోషిణి దగ్గరికి వెళ్లి మోనిత బ్రతికే ఉందని ఎంత చెప్పినా రోషిణి నమ్మక పోవడంతో కార్తీక్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మోనిత రత్న సీతకు మరో ప్లాన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ రాత్రి 11:30 నిమిషాలకు కార్తీక్ ను పెళ్లి చేసుకోవాలని రత్న సీతకు చెప్తుంది.

  అయితే ఈరోజు ఎపిసోడ్ లో.. కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబు.. నాకు ఇన్నిరోజులు పట్టింది మనుషులు అంటే ఏంటో తెలుసుకునేందుకు.. అంటూ ఎమోషనల్ అవుతాడు. అంతేకాదు వంటలక్క నువ్వు అంటే నాకు ఇష్టం అంటూ నిజాన్ని వ్యక్తం చేస్తాడు. ఇక అక్కడ నుంచి బయల్దేరిన వంటలక్కకు హాస్పిటల్ లో ఏం జరుగుతుంది.. డాక్టర్ బాబు ఎలా ఉన్నాడు ఇలా అన్ని ఆలోచిస్తూ బయల్దేరుతుంది. అంతేకాదు డాక్టర్ బాబును ఎలా కాపాడుకోవాలో అంటూ ఆలోచిస్తుంది కూడా.

  ఇది కూడా చదవండి:డాక్టర్ బాబును మంచానికి కట్టేసి మోనిత అరాచకం.. పక్కనే కూర్చొని ఛీఛీ!

  మోనిత మాత్రం రత్నసీతకు చెప్పినట్టుగానే కార్తీక్ ను పెళ్లి చేసుకునేందుకు బయల్దేరుతుంది. ఇక ఆమెకు జైల్లో సహాయం చేసినందుకు రత్నసీతను కౌగిలించుకొని థాంక్స్ చెప్తుంది. కార్తీక్ తర్వాత నాకు నువ్వే ఇష్టం రత్నసీత అంటూ ఐ లవ్ యు రత్న సీత అని చెప్తుంది. ఇక హాస్పిటల్ కు వెళ్లే సమయంలో డాక్టర్ మోనితకు శ్రద్ధాంజలి తెలియజేస్తూ అన్నదానం చెయ్యడం చూసిన మోనిత దండం పెట్టి ఆస్పత్రికి వెళుతుంది.

  ఇది కూడా చదవండి:డాక్టర్ బాబుకు కడుపునొప్పి.. మోనితతో రత్నసీత కుట్ర.. కిడ్నాప్‌కు పక్కా స్కెచ్!

  ఇక డాక్టర్ బాబు అనారోగ్యం గురించి తెలుసుకున్న సౌందర్య, ఆనంద్ రావు ఆస్పత్రికి వెళ్ళడానికి బయల్దేరుతారు. ఆ సమయంలోనే హిమ, సౌర్య మేము వస్తాం అంటూ మొండిపట్టు పడుతారు. అబద్దాలు ఎందుకు చెప్తారు అంటూ నిలదీస్తారు.. మీకు స్కూల్, ట్యూషన్, హోమ్ వర్క్ లేక ఇలాంటి ఆలోచనలతో ఇంట్లో వారిని టెన్షన్ పెడుతున్నారు అంటూ సౌందర్య నిలదీస్తుంది. డాడీ దగ్గరకు తీసుకెళ్లండి ప్లీజ్ అంటూ వారిని అడుగుతారు.. రేపు తీసుకు వెళ్తాము అంటూ చెప్పి వెళ్తారు.

  మరోవైపు డాక్టర్ బాబు వద్దకు చేరుకున్న మోనిత తాళి కట్టాలి కార్తీక్ అంటుంది.. 16 ఏళ్ళ నుంచి మంచిదానిలా నటించావ్ అని అంటే నటన కాదు కార్తీక్.. అది నీపై ఉన్న ప్రేమ.. నేను ప్రేమించా అంటుంది.. అప్పటికే హాస్పిటల్ బయట ఉన్న వంటలక్క డాక్టర్ బాబును వెతుక్కుంటూ ఆ గది దగ్గరకు వెళ్తుంది. మరి ఆ లోపు మోనిత పెళ్లి జరిగిందా లేక అది ఊహా మాత్రమేనా అని తెలుసుకోవాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Doctor babu, Karthika Deepam serial, Monitha, Nirupam paritala, Premi vishwanth, Rathna Seetha, Vantalakka

  ఉత్తమ కథలు