Karthika Deepam: డాక్టర్ బాబు ఆర్తనాదాలు.. మోనిత తెగింపు.. వంటలక్క జీవితం బుగ్గిపాలు!

karthika deepam

Karthika Deepam:  కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరింత హైలెట్ గా మారడంతో బాగా ఆసక్తిగా మారింది. కార్తీక్ తన మనసులో బాధలను దీప ముందు బయట పెట్టేస్తాడు. ఇక మోనిత.. కార్తీక్

  • Share this:
    Karthika Deepam:  కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరింత హైలెట్ గా మారడంతో బాగా ఆసక్తిగా మారింది. కార్తీక్ తన మనసులో బాధలను దీప ముందు బయట పెట్టేస్తాడు. ఇక మోనిత.. కార్తీక్ కు ఇచ్చిన గడువు గురించి తలుచుకుంటూ తెగ ఆనంద పడుతుంది. ఇక భాగ్యం.. దీపని, పిల్లల్ని తన ఇంటికి తీసుకు వచ్చే ఆలోచనలో ఉంటుంది. మోనిత.. కార్తీక్ కు పదేపదే ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ కార్తిక్ మాత్రం లిఫ్ట్ చేయడు. ఇన్ని సార్లు ఫోన్ ఎందుకు చేస్తుందా అని తల పట్టుకుంటాడు.

    అదే సమయంలో సౌర్య వచ్చి కార్తీక్ ని పిలిచినా కూడా పట్టించుకోడు. ఇక దీప కూడా మోనిత ఇదంతా కావాలనే చేసిందా అని ఆలోచిస్తుంది. కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి మోనిత కోపంతో మండిపోతూ.. తన చుట్టూ కార్తీక్ ని తిరిగేలా చేసుకుంటా అంటూ క్యాలెండర్ లో 25 వ తారీఖున మార్క్ చేస్తుంది. ఇక అది చూసిన ప్రియమణి ప్రశ్నించగా ఆ రోజు తను క్రియేట్ చేయబోయే సునామీ అంటూ.. కార్తీక్ నా కాళ్ళ దగ్గరకు రాక తప్పదు అంటూ, తన మెడలో తాళి కట్టక తప్పదు అంటూ నవ్వుతుంది.

    ఇక సౌందర్య ఆలోచిస్తూ ఉండగా మోనిత ఎంట్రీ ఇస్తుంది. కార్తీక్ గురించి తన ప్రేమ ఏంటో తెలుపుతుంది. పోరాడాల్సిన సమయం వచ్చిందని అంటుంది. సౌందర్య కూడా తగ్గకుండా నవ్వుతూ వెటకారంగా స్పందిస్తుంది. దాంతో మోనిత.. సౌందర్య మాటలకు షాక్ అవుతుంది. ఇక కార్తీక్ దీప ఎదురుగా కూర్చొని తన మనసులో మాటలను ఎంతో బాధతో మాట్లాడుతాడు. దాంతో దీప కాస్త కరిగినట్లు కనిపిస్తోంది. మోనిత.. సౌందర్యతో తనకు, కార్తీక్ కు 25న పెళ్లి అని అనేసరికి ఆ మాటలు విన్న పిల్లలు షాక్ అవుతారు.
    Published by:Navya Reddy
    First published: