Karthika Deepam: నాకు నీ మొగుడు అంటే పిచ్చి దీప.. వంటలక్క కాళ్ళు పట్టుకొని మోనిత షాకింగ్ కామెంట్స్!

karthika deepam

Karthika Deepam: బుల్లితెరలో కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారింది. మోనిత ఇచ్చిన పెళ్లి సమయం దగ్గరపడుతుండటంతో మధ్య మధ్యలో ట్విస్టులు బాగా ఎదురవుతున్నాయి. దీంతో అభిమానులు కూడా ఏం జరుగుతుందో అని ఆసక్తిగా చూస్తున్నారు.

  • Share this:
    Karthika Deepam: బుల్లితెరలో కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారింది. మోనిత ఇచ్చిన పెళ్లి సమయం దగ్గరపడుతుండటంతో మధ్య మధ్యలో ట్విస్టులు బాగా ఎదురవుతున్నాయి. దీంతో అభిమానులు కూడా ఏం జరుగుతుందో అని ఆసక్తిగా చూస్తున్నారు. ఇక పిల్లలిద్దరూ తన అమ్మమ్మ గతంలో తన తల్లిని సరిగా చూడలేదని, సవతి తల్లి అని అమ్మని పట్టించుకోలేదని.. అమ్మకు ఉన్నట్టు మనకు సవతితల్లి లేదు కదా అందుకు హ్యాపీ అంటూ పిల్లలు మాట్లాడుకుంటుండగా దీపా కోపంతో మీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడండి అంటూ అరుస్తూ గతంలో తను అన్న మాటలు గుర్తుచేసుకుంటుంది. ఇక హాస్పిటల్లో ఆదిత్య, కార్తీక్ తన తండ్రి ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటారు.

    మోనిత.. అంజి గురించి ఆలోచిస్తూ గట్టిగా అరుస్తూ హిస్టీరియా వచ్చిన దానిలా మారిపోతుంది. ఇక బెదురు చూపులు చూస్తూ ఓ ప్లాన్ వచ్చినట్లు ఎస్ అనుకుంటుంది. ఇక హాస్పిటల్లో భాగ్యం.. కార్తీక్, ఆదిత్య లకు భోజనం పెట్టడానికి ప్రయత్నిస్తే కార్తీక్ ఆకలిగా లేదు అంటాడు. అప్పుడే మోనిత ఎంట్రీ ఇచ్చి నేను వడ్డిస్తే నా కాబోయే భర్త తింటాడు అంటుంది. ఇక భాగ్యం కోపంతో మోనిత పై రగులుతుంది. మోనిత మాత్రం పక్క ప్లాన్ తో రావడంతో రక్తపాతాలు సృష్టించండి అంటూ కాస్త వికృతంగా మాట్లాడుతుంది. అంతలోనే నాపై చెయ్యి పడితే ఈ బాటిల్ లో ఉన్న విషయం నీళ్ళు తాగి చనిపోతాను అని.. దానికి కారణం మీరే అవుతారని షాక్ ఇస్తోంది. ఇక అంతలో దీప రావడంతో భోజనం విషయం గురించి, బాటిల్ లో విషయం గురించి చెబుతుంది భాగ్యం.

    karthika deepam

    వెంటనే అది చస్తే మనకేంది అంటూ నీళ్లను తాగవే అని బలవంతం చేస్తుంది దీప. పోనీ నేను తాగనా అంటూ దీప ఆ నీళ్లను తాగుతుంది. ఇక అక్కడున్న వాళ్ళంతా టెన్షన్ పడుతుండగా.. ఇందులో విషం లేదు అంటూ ఎదురుగా ఉన్న మోనితలో విషం ఉందంటూ ఇంక ఎన్నాళ్ళు భయపెడతావు అని మోనితను భయపెట్టిస్తుంది. ఇక మోనిత దీప కాళ్లపై పడి నేను కార్తీక్ ను పదహారేళ్లుగా ప్రేమిస్తున్నాను..నీ పెళ్లికి ముందే ప్రేమిస్తున్నాను అని అనేసరికి వెంటనే కార్తీక్ మన మధ్య ఉంది ప్రేమ కాదు, నీపై ఎప్పుడు ప్రేమ లేదు..నేను చచ్చినా నిన్ను పెళ్లి చేసుకోను అంటాడు. ఇక మోనిత నన్ను పెళ్లి చేసుకోవా.. చూడు పెళ్లి రోజు వేసుకుంటామని సూట్ ను కొనుక్కొచ్చాను అంటూ పిచ్చిదాని లాగా ప్రవర్తిస్తోంది మోనిత.
    Published by:Navya Reddy
    First published: