• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • MONITHA SATIRES ON DOCTOR BABU IN KARTHIKA DEEPAM SERIAL NR

Karthika Deepam: దీపకు ఏమైనా అయితే నువ్వు తట్టుకునేలా లేవు కార్తీక్!

Karthika Deepam: దీపకు ఏమైనా అయితే నువ్వు తట్టుకునేలా లేవు కార్తీక్!

karthika deepam

Karthika Deepam: బుల్లితెరపై వెయ్యి ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న టీఆర్పీ రేటింగ్ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది కార్తీక దీపం సీరియల్.

  • Share this:
    Karthika Deepam: బుల్లితెరపై వెయ్యి ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న టీఆర్పీ రేటింగ్ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది కార్తీక దీపం సీరియల్. అలాంటి ఈ సీరియల్ అభిమానులకు గత కొన్ని రోజులుగా మనశాంతి కరువైంది. దీప ఆరోగ్యంగా ఉంటుందా? ఉండదా? అసలు ఎన్ని రోజులు బతుకుతుంది? ఈ సీరియల్ లో దీప పాత్ర ముగుస్తోందా? అనే అనుమానంతో అభిమానులు సోషల్ మీడియాలో వంటలక్క గురించి తెగ చర్చిస్తున్నారు.

    ఇక ఈ నేపథ్యంలోనే ఈరోజు ఎపిసోడ్ లో డాక్టర్ బాబు కుటుంబం, వంటలక్క కుటుంబం ఎంతో అనందంగా ఉంటుంది. అర్ధపావు భాగ్యం వల్ల కాసేపు కామెడీ పండించారు. ఇక ఆతర్వాత కాకి మెడ మోనితతో డాక్టర్ బాబు మాట్లాడుతాడు. దీప నీకు ఎన్నో ఏళ్లుగా తెలుసు కదా.. దీప అనారోగ్యం గురించి తెలిసినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు అంటే.. నాకు బాధగానే అనిపించింది. కానీ దీప ఆరోగ్యం కోసం నువ్వు ఏకంగా ఆమె చేసిన తప్పు కూడా మర్చిపోయావు కదా అంటూ మళ్లీ అగ్గిపుల్లా గియ్యడానికి రెడీ అవుతుంది మోనిత.

    ఇక అప్పుడు కార్తీక్.. పర్లేదే నీకు కూడా దీప అంటే కాస్త జాలి ఉంది అంటూ కారు దిగి ఇంటికి వెళ్తాడు డాక్టర్ బాబు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే కుటుంబం అంత కలిసి డాక్టర్ బాబుపైనే సెటైర్లు వేస్తారు. ఆతర్వాత దీప వంట చేసింది అని తెలియగానే నా భార్యతో మీరు ఎందుకు వంట చేయించారు అంటూ ఫీల్ అవుతాడు డాక్టర్ బాబు. అంతే ఈరోజు ఎపిసోడ్ పూర్తయింది. అయితే రేపటి ఎపిసోడ్ లో పిల్లలతో డాక్టర్ బాబు, వంటలక్క మెడపై భోజనం చేసేది చూపిస్తారు. మరి ఈ చక్కటి పరిస్థి ముందుముందు ఎపిసోడ్స్ లో ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.
    Published by:Navya Reddy
    First published: