Home /News /movies /

MONITHA REVEALS SHOCKING TRUTH ABOUT PREGNANT IN TODAYS KARTHIKA DEEPAM SERIAL EPISODE NR

Karthika Deepam: నెల తప్పిన మోనిత.. బద్ధలైన వంటలక్క గుండె.. చివరి నిమిషాల్లో?

Karthika Deepam

Karthika Deepam

Karthika Deepam: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ఈ మధ్య మరింత ఆసక్తిగా మారడంతో మొత్తానికి సీరియల్ శుభం కార్డు పలుకుతుందన్న సమయంలో మరింత షాక్ ఇచ్చాడు డైరెక్టర్.

    Karthika Deepam: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ఈ మధ్య మరింత ఆసక్తిగా మారడంతో మొత్తానికి సీరియల్ శుభం కార్డు పలుకుతుందన్న సమయంలో మరింత షాక్ ఇచ్చాడు డైరెక్టర్. ఇప్పటికే దీప కార్తీక్ పూజ సమయంలో ఏం చెబుతాడో అని తెగ టెన్షన్ పడుతుంది. ఇక కార్తీక్ దీప కు ఇవ్వాల్సిన గిఫ్టు ప్యాక్ చేసి ఉంచుతాడు. ఇక కార్తీక్ ఇంటికి బయల్దేరడానికి మోనిత రెడీ అవుతుంది. ప్రియమణి కి త్వరలో పప్పన్నం పెడతాను అంటుంది. ఇక ప్రియమణి తన మనసులో ఏం కొంపలు ముంచుతుందో అనుకుంటుంది. సౌందర్య ఇంట్లోపూజ హడావిడి జరుగుతుంది. అందరూ పూజకి సిద్ధమై ఉండగా దీప ఏం చెబుతాడో అని టెన్షన్ పడుతూ ఉంది.కార్తీక్ పాత జ్ఞాపకాలు తలుచుకుంటూ కిందికి వస్తాడు. దీప ముక్కుపై కుంకుమ పడటంతో ప్రేమగా తుడిచి వేస్తాడు. ఇక పూజకు టైం అయిందని పంతులు కార్తీక్, దీప లను కూర్చోమంటాడు.

    ఇక కార్తీక్ గిఫ్ట్ గుర్తొచ్చి దీపకు ఇవ్వాలని వెనకకు తిరిగి వెళ్తుండగా వెంటనే సౌందర్య టైం అవుతుందని దేవుడికి దండం పెట్టుకొని కూర్చో అంటుంది. ఇక వెనక్కి తిరిగి దేవుడికి కాదు మమ్మీ దీపకు దండం పెట్టుకోవాలి అంటూ దీప కాళ్లపై పడతాడు. వెంటనే దీప వెనక్కి జరుగుతూ ఉండగా అందరిలో నవ్వు ముఖం కనిపిస్తుంది. ఇక గతంలో తాను చేసిన తప్పులకు ఏ శిక్ష అయినా పర్వాలేదు అంటూ క్షమాపణలు కోరుతాడు. ఇక దీప ఆనందంగా ఫీల్ అవుతుంది. సరిగ్గా సమయం చూసుకొని ఎంట్రీ ఇస్తుంది మోనిత. ఏం తప్పు చేసావ్ అంటూ అనగా వెంటనే కార్తీక్ లేచి చూస్తాడు. అందరూ మోనితను చూసి షాక్ అవుతారు. ఇన్నాళ్ళు నువ్వు పిల్లలు పుట్టారని అపోహలో ఉన్నావ్.. రిపోర్ట్ అలా వచ్చాయి.. అందుకు నువ్వేం చేస్తావ్ అంటూ మలుపుకునే మాటలు మాట్లాడుతుంది మోనిత.

    ఇక తన మాటలకు అందరికీ ఏమీ అర్థం అవ్వకపోగా వెంటనే కంగ్రాట్స్ కార్తీక్.. నీకు పిల్లలు పుట్టే యోగం ఉందని ఇవ్వాలి తెలిసింది అంటూ ఇది సంతోషించాల్సిన విషయము అంటూ.. హిమ, సౌర్య నీ కన్న బిడ్డలు అంటూ నవ్వుతుంది. ఇక కార్తీక్ అయోమయంగా ఏం మాట్లాడుతున్నావ్ అని ప్రశ్నించగా శుభవార్త మోసుకొచ్చాను కార్తీక్ అంటుంది మౌనిత. స్వీట్స్ తినిపించి చెప్పాల్సిన వార్త అంటూ కానీ మర్చిపోయాను అని అక్కడున్న అక్షింతలు తీసుకొని తనను ఆశీర్వదించాలని సౌందర్య కాలు మీద పడుతుంది. వెంటనే సౌందర్య కు అర్థం కాకుండా ఉండేసరికి ఏంటి ఇలా అని ప్రశ్నిస్తుంది.  నవ్వుతూ నెల తప్పాను ఆంటీ.. ఎస్ అయామ్ ప్రెగ్నెంట్.. నా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది అనగా అక్కడ అందరు షాక్ అవుతూ ఉండటంతో సౌందర్య గట్టిగా అరుస్తుంది. వెంటనే మోనిత మీ అబ్బాయి వల్ల నేను గర్భవతిని అయ్యాను అనగా అక్కడున్నవారంతా తెల్ల ముఖం వేస్తారు.ఇక ఈ వార్త విన్నాక దీప గుండె బద్దలవడం ఖాయం. చివరి నిమిషాలలో గట్టి షాకిచ్చింది మోనిత. ఇక తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Doctor babu, Karthika deepam, Premi vishwanth, Vantalakka

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు