MONITHA REVEALS BIT TO BIT TRUTH TO KARTHIK AND HIS FRUSTRATED IN TODAYS KARTHIKA DEEPAM SERIAL EPISODE NR
Karthika Deepam: టెస్ట్‌కి ఇచ్చిన శాంపిల్‌తో గర్బవతినయ్యాను.. డాక్టర్ బాబుకు షాక్ ఇచ్చిన మోనిత!
Karthika Deepam
Karthika Deepam: బుల్లితెరలో కార్తీకదీపం సీరియల్ మొత్తానికి ఆసక్తికరమైన కథతో సాగుతుంది. దీంతో మధ్య మధ్యలో కొన్ని ట్విస్టులు కూడా ఎదురవడంతో ఏం జరుగుతుందో అని ప్రేక్షకులు కూడా తెగ టెన్షన్ పడుతున్నారు. మోనిత వీడియోని చూసి కార్తీక్ మోనిత ఇంటికి వెళ్ళిన సంగతి తెలిసిందే.
Karthika Deepam: బుల్లితెరలో కార్తీకదీపం సీరియల్ మొత్తానికి ఆసక్తికరమైన కథతో సాగుతుంది. దీంతో మధ్య మధ్యలో కొన్ని ట్విస్టులు కూడా ఎదురవడంతో ఏం జరుగుతుందో అని ప్రేక్షకులు కూడా తెగ టెన్షన్ పడుతున్నారు. మోనిత వీడియోని చూసి కార్తీక్ మోనిత ఇంటికి వెళ్ళిన సంగతి తెలిసిందే. అక్కడ మోనితపై కోపంతో రగిలిపోతూ అనాల్సిన మాటలు అన్ని అన్నాడు. లోపలున్న భాగ్యం ఇదంతా వింటూనే ఉంటుంది. ఆ వీడియోను మోనితకు చూపిస్తూ.. నువ్వు మనిషివేనా.. హిమను ఎందుకు చంపావు. మనసు ఎలా ఒప్పింది. దారుణమైన మనస్తత్వమే నీది. కన్న తల్లి చెప్పిన, కట్టుకున్న భార్య చెప్పిన వినలేదు. నమ్మక ద్రోహం చేసావే. ఒక అడవి మృగానివి అంటూ బాగా అరుస్తాడు.
అయినా కూడా మోనితలో.. కార్తీక్ కు తన గురించి నిజం తెలిసినా కూడా ధైర్యం కనిపిస్తూనే ఉంది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ప్రేమ అంటే.. నీ ప్రేమ కోసం ఎంతో రిస్క్ చేశాను అంటూ మాట్లాడుతుంది. ప్రాణాలు తీసే స్థాయికి కూడా వెళ్ళానని.. దీప కూడా చంపించడానికి బేరం కుదుర్చుకున్నాను.. యాక్సిడెంట్ నువ్వే చేయించావని దీపతో నమ్మించాను అంటూ తను చేసిన నేరాల గురించి బయటపెడుతుంది మోనిత. పైగా దీపను, నిన్ను విడదీయడానికి విహారిని అడ్డంపెట్టుకుని అనుమానం పెంచానని అంటుంది.
పైగా నీకు యాక్సిడెంట్ జరిగినప్పుడే పిల్లలు కారని అబద్ధం చెప్పించానని నిజం చెప్పేసింది. అయినా కూడా దీప ని పెళ్లి చేసుకున్నావు అంటూ రగిలిపోతుంది. దీప గర్బవతి కాదని దీపను వదిలేసావు. డెలివరీ టైం లో స్లో పాయిజన్ ఎక్కిస్తున్న సమయంలో దుర్గా గాడు కాపాడాడని అంటుంది. ఇక నువ్వు పిల్లల కోసం పుడతారా లేదా అని ఇచ్చిన సాంపిల్స్ ను గర్భంలో ప్రవేశ పెట్టుకొని ఆర్టిఫిషియల్ ఇన్ స్టిగేషన్ తో గర్భవతి అయ్యానని.. గర్భవతి విషయం గురించి అసలు నిజం బయటపెట్టింది.
ఎలాగైతేనేమి ఆ బిడ్డకి నువ్వే తండ్రి అంటూ.. పెళ్లి చేసుకోవాలి అంటూ మాట్లాడేస్తుంది. ఆ మాటలు విన్న కార్తీక్ మొత్తం షాక్ లో ఉంటూ గట్టిగా అరుస్తాడు. దిక్కు మాలిన దానా.. నీతి మాలిన దానా అంటూ బాగా ఫైర్ అవుతాడు. నాకోసం నేరాలు చేయడానికి కూడా సిద్ధ పడ్డావు.. నేను దక్కకపోతే కూడా నన్ను చంపేస్తావు అంటూ ఆవేశ పడతాడు. నిన్ను చంపేస్తాను అంటూ గన్ తీసి చూపిస్తాడు. కానీ మోనిత మాత్రం తన మాటలతో ధైర్యంగా మాట్లాడుతూనే ఉంటుంది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.