హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: వంటలక్కపై డాక్టర్ బాబు ప్రేమ... నిజం తెలుసుకున్న మోనిత.. ఏం జరగనుందంటే?

Karthika Deepam: వంటలక్కపై డాక్టర్ బాబు ప్రేమ... నిజం తెలుసుకున్న మోనిత.. ఏం జరగనుందంటే?

Karthika Deepam

Karthika Deepam

Karthika Deepam: స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి అందరికీ తెలిసిందే.ఈ సీరియల్ ఇప్పటికే ఎంతో ఫేమ్ సంపాదించుకుంది. బుల్లితెర లో అన్ని సీరియల్స్ కంటే టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది.

Karthika Deepam: స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి అందరికీ తెలిసిందే.ఈ సీరియల్ ఇప్పటికే ఎంతో ఫేమ్ సంపాదించుకుంది. బుల్లితెర లో అన్ని సీరియల్స్ కంటే టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈ సీరియల్ మరింత ఆసక్తిగా మారడంతో ఈ సీరియల్ చూడటానికి ప్రేక్షకులు కొద్దిపాటి సమయాన్ని కూడా వదలట్లేదు. ఇక కార్తీక్ కు దీప అమ్మ తనం గురించి మొత్తం తెలిసిపోతుంది. దీంతో కార్తీక్ తప్పు చేశానంటూ, దీప ను బాధపెట్టాను అంటూ తెగ కుమిలిపోతాడు. దారిలో కార్తీక్ కు మురళీకృష్ణ కనిపించగా అతని మామయ్య అనడం తో మురళీకృష్ణ షాక్ అవుతూ ఉంటాడు. ఇక దీప గురించి చెప్పి ఎమోషనల్ అవుతాడు. ఇక అక్కడి నుంచి కారులో ఇంటికి బయలుదేరి వస్తుంటారు.

ఇక ఇంటి దగ్గర దీప ఆరోగ్య సమస్య తీవ్రంగా మారుతుంది. సౌందర్య దగ్గరికి వచ్చి మాట్లాడుతూనే కళ్ళు తిరిగి కింద పడుతుంది. ఇక సౌందర్య, పిల్లలు లేపడానికి ఎంత ప్రయత్నించినా దీప లేవదు. ఎంతో ఏడుస్తూ ఉన్న ఆ సన్నివేశం బాగా ఎమోషనల్గా కనిపిస్తుంది. ఇక మధ్యలో దీప తెరుకోగా పిల్లల్ని దగ్గరికి తీసుకొని మళ్ళీ స్పృహ కోల్పోతుంది. ఇక అంతలోనే కార్తీక్ వస్తాడు. ఇంట్లో ఏడుస్తూ ఉన్న వాళ్ళ మాటలు విని లోపలికి పరుగెత్తుకుంటూ వస్తాడు కార్తీక్. దీపని ఆ పరిస్థితిలో చూసి దీపా దీపా అని.. ఇక నోట్లో నీళ్లు పోసినా కూడా నీరు బయటికి రావడం తో భయపడి అక్కడినుంచి హాస్పిటల్ కు తీసుకెళతాడు.

హాస్పిటల్ లో దీప మాటలు కార్తీక్ ను మరింత బాధ పెడతాయి. ఇవే చివరి క్షణాలు అంటూ దీప కార్తీక్ తో చెబుతోంది. అంతేకాకుండా ఇప్పటికైనా నన్ను నమ్మారా అంటూ అడుగుతుంది. ఇక అక్కడి నుంచి దీపని చికిత్స కోసం లోపలికి తీసుకెళ్తుంటారు. కార్తీక్ బాగా ఏడుస్తూ ఉంటాడు. ఇక మౌనితకు ఈ విషయం తెలిసిన వెంటనే సంతోషంగా హాస్పిటల్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఇక పక్కనే ఉన్న ప్రియమణి.. దీపమ్మని చంపకండి అంటూ ఎమోషనల్ అవుతుంది. వెంటనే మౌనిత విలన్ గా నవ్వుతూ అక్కడి నుంచి బయలుదేరుతుంది. మురళి కృష్ణ నా కూతురికి ఏమైంది ఉంటూ బోరున ఏడుస్తాడు. అంతలోనే ఎంట్రీ ఇచ్చిన మౌనిత పై అరుస్తాడు. ఇక మౌనిత కార్తీక్ కోసం చూస్తుండగా.. కార్తీక్ దూరంగా డాక్టర్లతో టెన్షన్ గా మాట్లాడుతూ కనిపిస్తాడు. వెంటనే మౌనిత అక్కడికి వెళ్లగా.. కార్తీక్ ఎమోషనల్ ని చూసి తెగ రగిలిపోతుంది. నేను కూడా డాక్టర్ ని అని మౌనిత అనేసరికి కార్తీక్ తన వైపు చూస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో తరువాయి భాగంలో తెలుస్తుంది.

First published:

Tags: Anandh rao, Doctor babu, Hima, Karthika deepam, Monitha, Premi vishwanth, Soundarya, Sourya, Vantalakka

ఉత్తమ కథలు