హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: కార్తీకదీపంకు శుభంకార్డు.. ప్రేమలేదని తెలుసుకున్న మోనితకు చావే దిక్కు..?

Karthika Deepam: కార్తీకదీపంకు శుభంకార్డు.. ప్రేమలేదని తెలుసుకున్న మోనితకు చావే దిక్కు..?

Karthika Deepam

Karthika Deepam

Karthika Deepam: స్టార్ మాలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఈ మధ్య మరింత ఆసక్తిగా మారింది. కార్తీక్ కు దీప అమ్మ తనం గురించి నిజం తెలిసింది. ఇక దీప ప్రాణాలతో బయట పడింది.

Karthika Deepam: స్టార్ మాలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఈ మధ్య మరింత ఆసక్తిగా మారింది. కార్తీక్ కు దీప అమ్మ తనం గురించి నిజం తెలిసింది. ఇక దీప ప్రాణాలతో బయట పడింది. మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ మాత్రం బాగా ఆకట్టుకుంది. దీప పల్స్ రేటు పడిపోవడంతో కార్తీక్ వెంటనే డాక్టర్స్ ను పిలుస్తాడు. ఇక వెంటనే పరిస్థితిని పరిశీలించాక టెన్షన్ పడుతున్న కార్తీక్ కు దీప ఆరోగ్యం గురించి శుభవార్త చెబుతుంది భారతి. భారతీయ వెంటనే మనసులో మౌనిత కుట్ర గురించి ఆలోచిస్తుంది. కానీ ఈ సమయంలో కార్తీక్ ఆనందాన్ని చూసి ఈ విషయం చెప్పడం సరైనది కాదని అనుకుంటుంది. ఇక దీప పరిస్థితి బాగుందంటూ ఇంటికి తీసుకెళ్లవచ్చని కార్తీక్ కు ధైర్యం ఇస్తుంది. వెంటనే కార్తీక్ ఎంతో సంతోషపడుతూ జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ భారతికి తెలుపుతాడు.

ఇక క్యారేజ్ తీసుకొని వస్తున్నా ఆదిత్య ని చూసి మీ వదిన స్పృహలోకి వచ్చింది అనగా.. వెంటనే ఆదిత్య కూడా సంతోషపడుతాడు. ఇక కార్తీక దీప రూమ్ లోకి వెళ్లి తన తలని నిమురుతూ మనసులో తన గురించి పూర్తిగా కోలుకోవాలి అంటూ, ఎన్నో ఆనంద క్షణాలు గడపాలని అనుకుంటాడు. ఇక దీప చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని తను పడిన బాధల గురించి తలుచుకొని ఇకపై అలాగ చేయను అంటూ క్షమాపణ చెప్పుకోవాలని అంటూ ఏడుస్తూ చేతిని ముద్దాడుతాడు. కార్తీక్ స్పర్శకు స్పృహ లోకి వచ్చిన దీప బతికే ఉన్నానా అంటూ తన బాధలను పంచుకుంటుంది. కుటుంబ సభ్యులను అడుగుతుంది. ఇక దీపతో మాట్లాడుతూ ఏమి ఆలోచించకుండా పడుకోమని, మన ఇంటికి వెళ్లి వచ్చా నీ బుగ్గ మీద తట్టి అక్కడి నుండి వెళ్ళాడు.ఈ స్పర్శకు దీప ఇది మత్తా, నిజమా అనుకుంటుంది.

ఇక మోనిత టాబ్లెట్స్ వేసుకొని.. ఎదురుగా ఉన్న ప్రియమణితో కార్తీక్ మంచి వాడా చెడ్డవాడా అని ప్రశ్నిస్తుంది. ఇక ప్రియమణి కార్తీక్ ఓ తండ్రిగా, తో కొడుకుగా, ఓ భర్త గా బాగా చూసుకుంటాడని సమాధానం చెబుతుంది. ఇక మోనిత ప్రియుడి గా అనేసరికి చెడ్డోడు అమ్మా అంటూ.. భయపడి సమాధానం ఇస్తుంది. అంతే కాకుండా మిమ్మల్ని కరివేపాకులా చూస్తాడు కదా అంటూ సమాధానమిస్తుంది ప్రియమణి. ఇక ప్రియమణి చెప్పిన మాటలు తలుచుకుంటూ మోనిత మళ్లీ తన మనసులో గట్టిగానే ఆలోచిస్తుంది. ఇక హాస్పిటల్లో కార్తీక్ అలాగే నిద్రపోతుంటే ఆదిత్య వచ్చి లేపుతాడు. ఈరోజు దీప డిశ్చార్జ్ అని అనుకుంటూ అలాగే పడుకున్నానని కంగారు పడతాడు. ఇక సౌందర్య దేవుడికి దండం పెడతా పిల్లలను స్నానాలు చేసి రెడీ అయి ఉండమని చెబుతుంది. ఇక దీప కార్తీక్ లు సంతోషంగా ఉండాలి అంటూ దేవుడికి థాంక్స్ చెబుతుంది. ఇక కార్తీక్ దీపని భార్య స్థానంలో ఇంటికి తీసుకు రావడంలో మరింత ఆసక్తిగా కనిపిస్తుంది.

First published:

Tags: Anandh rao, Doctor babu, Hima, Karthika deepam, Monitha, Premi vishwanth, Soundarya, Sourya, Vantalakka

ఉత్తమ కథలు