హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: నువ్వు చచ్చిపో వంటలక్క.. నీ భర్తను నాకు ఇచ్చేసి పో అంటూ మోనిత రాక్షసత్వం?

Karthika Deepam: నువ్వు చచ్చిపో వంటలక్క.. నీ భర్తను నాకు ఇచ్చేసి పో అంటూ మోనిత రాక్షసత్వం?

Karthika Deepam

Karthika Deepam

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకి మరింత ఆసక్తిగా మారుతుంది. ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో అని ప్రేక్షకులు బాగా ఎదురుచూస్తున్నారు. ఇక రేటింగ్ కూడా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే మోనిత ని చూసిన దీప.. ఎలాగైనా మోనితను పట్టుకోవాలని వెంటాడుతుంది.

ఇంకా చదవండి ...

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకి మరింత ఆసక్తిగా మారుతుంది. ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో అని ప్రేక్షకులు బాగా ఎదురుచూస్తున్నారు. ఇక రేటింగ్ కూడా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే మోనిత ని చూసిన దీప.. ఎలాగైనా మోనితను పట్టుకోవాలని వెంటాడుతుంది. హాస్పిటలో దీప కనిపించకపోయేసరికి.. దీప మోనిత చూసిందేమో అని కంగారు పడుతూ ఉంటాడు. దీప కోసం వెతుకుతుండగా పోలీసులు ఆపుతారు. దీప కనిపించిందా, డాక్టర్ రీనా కనిపించిందా అంటూ కంగారుగా ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. మోనిత రత్నసీతకు ఫోన్ చేసి కార్తీక్ ఏం చేస్తున్నాడని అనేసరికి దీప కోసం చూస్తున్నాడు అంటుంది.

దీప ఏమయింది అని అడిగేసరికి నా చేతుల్లో చనిపోబోతుంది అంటూ షాక్ ఇస్తుంది. దీప కూడా డాక్టర్ బాబు కాపాడుకోవడానికి మోనితను పట్టుకోవాలని గట్టిగా పోరాడుతుంది. ఇక వారణాసి కారులో పెట్రోల్ అయిపోవడానికి వచ్చిందని అంటాడు. ఇక కార్తీక్ ఎలాగోలా బయటకు వెళ్లాలని ప్రయత్నించగా పోలీసులు మళ్లీ అడ్డు ఆపుతారు. మొత్తానికి రోషిణి కూడా వచ్చేస్తుంది.దీప కనిపించడం లేదని చెబుతున్నప్పుడు బాగా ఎమోషనల్ గా అనిపిస్తుంది. మోనితే దీపను ఏమో చేసింది అనేసరికి.. కోర్టుకు వెళ్లే ముందు కొత్త కథలు చెప్పద్దు అంటూ వార్నింగ్ ఇస్తుంది రోషిణి. టీ అమ్మాయిగా వచ్చింది మోనితే అంటూ మోనిత బ్రతికే ఉందంటూ గట్టిగా.. డాక్టర్ రీనాగా కూడా వచ్చింది అంటూ ఎంత చెప్పినా నమ్మలేకపోతుంది రోషిణి. సాక్ష్యం చూపించమంటూ కార్తీక్ ను బాధ పెడుతుంది. మోనిత నుండి నా కుటుంబంను కాపాడాలి అంటూ బాధపడతాడు.

ఇది కూడా చదవండి:మోనితను పట్టేసుకున్న వంటలక్క.. ఒక్కసారిగా నేలకేసి కొట్టి షాక్ ఇచ్చిన దీప

కార్తీక్ ఎమోషనల్ గా ఉన్న నిజం చెప్పిన కూడా నమ్మలేకపోయేసరికి.. ఇదంతా ముందే ఎందుకు చెప్పలేదు అంటూ రోషిణి ప్రశ్నిస్తుంది. కానీ నా భార్యను బతికించండి అంటూ దీప కోసం ఆరాటపడుతుంటాడు. కానీ రోషిణి అసలు వినకుండా అక్కడినుంచి కార్తీక్ ను కోర్టుకు తీసుకెళ్తుంది. మోనిత ఓ చోట దిగి కార్ డ్రైవర్ కు వాళ్లతో తన గురించి చెప్పద్దు అంటూ అమాయకంగా నాటకం ఆడుతుంది. మధ్యలో దీప కారు ఆగిపోవడంతో.. అక్కడే పోలీసులకు అప్పగించి ఉంటే బాగుండేదని ఆలోచనలో పడుతుంది.

ఇది కూడా చదవండి:చెప్పినట్టుగానే కార్తీక్ కుటుంబంపై కుట్ర చేసిన మోనిత.. ఆదిత్యకు ఘోర రోడ్డు ప్రమాదం?

కార్తీక్ ను పెళ్లి చేసుకునే సమయంలో దీపకు దొరికిపోయాను అంటూ కోపంతో రగిలిపోతుంది. మరోవైపు దీపకు కార్తీక్ వెళ్తున్న కారు కనిపించగా ఎంత పిలిచినా వాళ్ళు వినిపించుకోరు. మోనితకు కూడా కార్లు ఎదురవడంతో తన ముఖాన్ని అడ్డుగా పెట్టుకుంటుంది. కార్తీక్ ను చూసి ఎమోషనల్ అవుతుంది. దీపను దూరం నుండి చూస్తూ గన్ తీస్తుంది. కోర్టు దగ్గర తల్లిదండ్రులను చూసి ఎమోషన్ అవుతాడు కార్తీక్. ఆనందరావుకు గుండెలో భారం అవడంతో టాబ్లెట్స్ కోసం మెసేజ్ చేస్తాడు. దీప మోనిత పట్టుకోడానికి వెళ్ళిందని చెబుతాడు. దీపను గన్ తో బెదిరిస్తూ కారులో తీసుకెళ్తుంది మోనిత.

First published:

Tags: Archana ananth, Deepa, Doctor babu, Karthika deepam, Monitha, Nirupam paritala, Premi Viswanath, Rathna Seetha, Roshini, Shobashetty, Soundarya, Vantalakka, Varanasi

ఉత్తమ కథలు