Karthika Deepam:స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీక దీపం సీరియల్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రలో ప్రేక్షకులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా ఈ సీరియల్ కు అలవాటు పడిపోయారు. ప్రస్తుతం ఈ సీరియల్ మరింత ఆసక్తిగా మారడంతో రెప్పపాటు సమయంలో కూడా వదలట్లేదు ప్రేక్షకులు. ఇదిలా ఉంటే మొత్తానికి దీప తన అనారోగ్య సమస్య నుండి బయట పడుతుంది. కార్తీక కు దీప అమ్మ తనం గురించి నిజం తెలిసింది. ఇదిలా ఉంటే ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ దీప కలిసిపోవడంతో మోనిత కుమిలిపోతుంది. ఇక ఆ సమయంలో ప్రియమణి వచ్చి కొన్ని మాటలతో ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. కానీ మోనిత మాత్రం తన శక్తిని కోల్పోకుండా అంతే గట్టిగా మాట్లాడుతుంది. అతి త్వరలోనే వాళ్లపై దెబ్బ కొడతా అంటూ నవ్వుతుంది. ఇక దీప రాకకోసం ఇంటిదగ్గర అందరూ సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటారు.
సౌందర్యకు అదే సమయంలో మోనిత ఫోన్ చేస్తూ సౌందర్య మూడ్ మొత్తం పాడు చేస్తుంది. దీన్నిబట్టి మోనిత మరో ప్లాన్ కి రెడీ అవుతుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే మొత్తానికి దీప ఇంటికి చేరుకోగానే తనకు హారతి ఇస్తూ ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఇక ఆ సమయంలో కార్తీక్ దీప క్షమాపణలు చెప్పాలని అనుకుంటాడు. ఆ విషయాన్ని అందరి ముందు చెప్పాలని నిర్ణయించుకుంటాడు కార్తీక్. కానీ సౌందర్య ఇప్పుడు వద్దని భాగ్యం వ్రతం చేపిస్తాను అని అన్నదంటూ ఆ వ్రతం ఇక్కడే చేద్దామని ఆ సమయంలో నీ మనసులో మాట చెప్పేసేయని కార్తీక్ తో అంటుంది సౌందర్య.
ఇక కార్తీక్ కూడా అదే సమయంలో చెప్పాలని అనుకుంటాను. కానీ దీప మాత్రం ఇప్పుడే చెప్పండి డాక్టర్ బాబు అనగా లేదు దేవుడు ముందే చెబుతాను అంటాడు. తాను చెప్పబోయే విషయం చిన్నది కాదని పదేళ్ళ ప్రాయశ్చిత్తం అనుకుంటూ చెప్పడానికి క్షమాపణ అడగడానికి ధైర్యం చాలట్లేదని తప్పు చేశానని అనుకుంటాడు. అంతేకాకుండా నన్ను క్షమించు దీపా అని సులువుగా అడిగేది కాదంటూ, క్షమాపణ అడగడానికి చాలా శక్తి కావాలి.. అది నేను కూడతీసుకోవాలి, అందరి ముందు క్షమాపణ కోరి తనపై ఉన్న అనుమానాన్ని దింపేయాలి అనుకుంటాడు కార్తీక్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anandh rao, Doctor babu, Hima, Karthika deepam, Monitha, Premi vishwanth, Soundarya, Sourya, Vantalakka