MONITHA PLANS TO ACCIDENT DOCTOR BABU BROTHER ADITHYA IN TODAYS KARTHIKA DEEPAM SERIAL EPISODE NR
Karthika Deepam : చెప్పినట్టుగానే కార్తీక్ కుటుంబంపై కుట్ర చేసిన మోనిత.. ఆదిత్యకు ఘోర రోడ్డు ప్రమాదం?
karthika deepam
Karthika Deepam : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం కథ మొత్తం బాగా ఆసక్తిగా మారింది. మోనిత కొత్త గెటప్ లో ఎంట్రీ ఇచ్చి కార్తీక్ ను బ్లాక్ మెయిల్ చేయడంతో కథ మొత్తం మళ్లీ మొదటికి వచ్చినట్లు అనిపిస్తుంది.
Karthika Deepam : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం కథ మొత్తం బాగా ఆసక్తిగా మారింది. మోనిత కొత్త గెటప్ లో ఎంట్రీ ఇచ్చి కార్తీక్ ను బ్లాక్ మెయిల్ చేయడంతో కథ మొత్తం మళ్లీ మొదటికి వచ్చినట్లు అనిపిస్తుంది. హాస్పిటల్ లో ఉన్న కార్తీక్ మోనిత మాటలను తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఆ మోనిత పని ఎలాగైనా చేయాలి అనుకుంటూ దీపకు అన్యాయం చేయకూడదు అని గట్టిగా అనుకుంటాడు. ఇక రత్న సీత.. మోనితతో మాట్లాడుతుంది. ఇన్ని రోజులు కార్తీక్ లేకుండా ఎలా ఉన్నారో.. ఇకపై కూడా అలాగే ఉండొచ్చు కదా అని సలహా ఇవ్వడంతో.. వెంటనే రత్న సీత పై ఫైర్ అవుతుంది. అలాంటి ఆలోచనలు రావద్దు అంటూ తన జీవితం మొత్తం కార్తీక్ కే అంటూ మాట్లాడుతుంది. కార్తీక్ కుటుంబాన్ని అడ్డుపెట్టుకొని కార్తీక్ ను నా వైపు లాకుంటాను అంటూ రత్న సీతతో చెబుతుంది. మరోవైపు భాగ్యం దేవుడి ముందు దీప కార్తీక్ ల జీవితం చక్క బడాలని వేడుకుంటుంది.
హాస్పిటల్ లో కార్తీక్ మోనితను గుర్తు చేసుకుంటాడు. అంతలోనే దీప కార్తీక్ కు టాబ్లెట్లు ఇస్తుంది. ఇక దీప ఎందుకు భయపడుతున్నారు అని కార్తీక్ ను అడుగుతుంది. ఏం లేదు అంటూ కార్తీక్ దిగులుగా మాట్లాడుతాడు. మనసులో మోనిత గురించి చెబితే ఏం జరుగుతుందో అని ఆలోచిస్తాడు.ఇక కార్తీక్ దీపకు.. నీకు సోదమ్మ వేషంలో మోనిత కనిపించింది. నాకు టీ ఇచ్చే అమ్మాయి రూపం లో మోనిత కనిపించిందని అంటాడు.
ఇక దీప వెంటనే షాక్ అవుతుంది. మోనిత బ్రతికే ఉందని నాకు అనిపిస్తుందని తెలుపుతుంది. ఇక డాక్టర్ రూపంలో కూడా వస్తుందని నీకు ఎలా చెప్పాలి అని మనసులో అనుకుంటాడు కార్తీక్.శ్రావ్య ఆదిత్య కోసం ఎదురు చూడగా ఆనందరావు వచ్చి ఏమైంది అని మాట్లాడుతాడు. ఇక శ్రావ్య ఆదిత్య గురించి కార్తీక్ గురించి మాట్లాడుతుంది. మరోవైపు ఆదిత్య బైక్ పై వస్తుండగా యాక్సిడెంట్ జరుగుతుంది. పైగా అది ప్లాన్ తో జరిగినట్లు కనిపిస్తోంది.
అదే సమయంలో కార్తీక్ కూడా ఏదో ప్రమాదం జరిగినట్లు ఉలిక్కిపడి లేస్తాడు. నర్స్ బాయ్ వచ్చి ఫోన్ ఇస్తాడు. మోనిత మాట్లాడుతూ ఆదిత్యకు ప్రమాదం జరిగిందని ఆలోచించుకో అంటూ వార్నింగ్ ఇవ్వడంతో కార్తీక్ ఇంట్లో వాళ్ల గురించి టెన్షన్ పడుతూ ఉంటాడు. అంతలోనే సౌర్య దీపకు ఫోన్ చేసి బాబాయ్ కి ఆక్సిడెంట్ అయిందని చెబుతుంది. ఆ విషయాన్ని కార్తీక్ కూడా చెప్పేసరికి కార్తీక్ కోపం, బాధతో రగిలిపోతాడు. ఇంట్లో ఆదిత్య పరిస్థితి చూసి అందరూ బాధపడుతుంటారు. దీప వచ్చి ఏంటిదని బాధపడుతుంది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.