Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలోనే నిలుస్తుంది. బుల్లితెరపై ఈ సీరియల్ కు మంచి అభిమానం ఉంది. దీప.. పిల్లలకు తమ తండ్రి కార్తీక్ గురించి చెప్పి వాళ్లను ఓదార్చుతుంది. మరుసటి రోజు ఉదయం కార్తీక్ న్యూస్ పేపర్ చూసి అందులో మోనిత ప్రచురింపబడిన వార్తను చూసి టెన్షన్ పడతాడు. ఇక దీపకు కూడా పేపర్ చూపించగా దీప టెన్షన్ పడుతుంది. అప్పుడే సౌర్య వచ్చి పేపర్ లాక్కొని అందులో ఉన్న మోనిత వార్తను చదివి ఇందులో ఉన్న వార్త నిజమేనా అంటూ నిలదీసినట్లు కార్తీక్ కు కల రావడంతో కార్తీక్ గట్టిగా అరుస్తాడు.
ఇక దీప ఏం జరిగింది అని కంగారు పడుతూ ఉండగా.. సౌర్య ఎక్కడ అంటూ కార్తీక్ వెతుకుతాడు. ఇక అదంతా నిజం కాదని తెలుసుకొని ఆ పేపర్ కింద పడేస్తాడు. అప్పుడే సౌందర్య వచ్చి ఆ పేపర్ ను తీసి చదివి టెన్షన్ పడుతుంది. పిల్లలకు కనిపించకుండా జాగ్రత్తగా ఉంచమని చెప్పగా.. వెంటనే కార్తీక్ ఆ పేపర్ ను కాల్చేయమని దీపతో అంటాడు. ఇక దీప ఇంట్లోకి వెళ్లి బెడ్ రూమ్ లో పేపర్ చదువుతూ ఏడుస్తుంది.
ఇది కూడా చదవండి:మళ్లీ మొదటికి వచ్చిన కార్తీకదీపం.. వంటలక్క కష్టాలు పగవాడికి కూడా రాకూడదు దేవుడా
మరోవైపు పోలీస్ స్టేషన్ లో మోనిత ఈ పేపర్ దీప చదివిందా లేదా అంటూ అక్కడ బాంబు బ్లాస్ట్ అయ్యిందా లేదా అని అనుకుంటుంది. ఇక ఆ పేపర్ తీసి అందులో నా గురించి వచ్చిన వార్త చదివి మురిసిపోతుంది. మరోవైపు దీప పేపర్ చదువుతూ బాగా ఏడుస్తుంది. ఇక మోనిత తనకు కార్తీక్ ను చూడాలని ఉందని ఎలాగైనా సోడా సుకన్య సహాయం తీసుకోవాలని అనుకుంటుంది.
ఇది కూడా చదవండి:జైల్లో మోనితకు మరో సపోర్ట్.. మళ్ళీ అవమానల్లో నలిగిపోతున్న వంటలక్క కుటుంబం!
దీప పేపర్ చదువుతున్న సమయంలో సౌర్య వచ్చి డోర్ కొట్టడంతో పేపర్ ను వెంటనే బెడ్ కింద పెడుతుంది. ఇక సౌర్య ఏమైందని అడుగుతూ.. నానమ్మ వ్రతానికి తయారవ్వమని చెప్పింది అని చెబుతుంది. మొత్తానికి ఇంట్లో కార్తీక్, దీప లతో సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తవ్వగా.. అదే సమయంలో ఇద్దరూ పిల్లలు వచ్చి అమ్మమ్మ, తాతయ్య అని సౌందర్య, ఆనందరావు దగ్గరికి వచ్చి పట్టుకుంటారు. ఇక ఇంట్లో వాళ్ళందరూ ఎవరా అని ఆశ్చర్యపోతారు. తరువాయి భాగంలో ఆ పేపర్ సౌర్య, హిమలు చూసి షాక్ అవుతారు. పేపర్ లో అన్నట్లు మోనిత ఆంటీ ని డాడీ మోసం చేశాడా అంటూ ఏడుస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Archana ananth, Doctor babu, Karthika deepam, Monitha, Nirupam paritala, Premi Viswanath, Shobashetty, Soundarya, Vantalakka