Karthika Deepam : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తి మారింది. చనిపోయిందనుకున్న మోనిత బ్రతికే ఉందని కార్తీక్, దీప లకు తెలిసిపోవడంతో మధ్య మధ్యలో ట్విస్ట్ లు ఎదురవుతున్నాయి. ఇక కార్తీక్ మోనిత బ్రతికే ఉందన్న విషయాన్నీ నేరుగా రోషిణి దగ్గరికి వచ్చి చెబుతాడు. కానీ రోషిణి కార్తీక్ ప్లాన్ చేస్తున్నాడని అనుకోవడంతో కార్తీక్ మాటలను నమ్మలేకపోతుంది. కొత్త కథ అల్లుతున్నావా మిస్టర్ కార్తీక్ అంటూ కోపం గా మాట్లాడుతుంది. అంతేకాకుండా గతంలో దీపను పదేళ్ళ పాటు దూరం పెట్టావ్ అటువంటిది ఇప్పుడు నిజం ఎలా చెబుతున్నావ్ అనుకోవాలి అనడంతో వెంటనే కార్తీక్ కోపం తో ఇలా కావడానికి కారణం ఆ మోనితే అంటాడు. మోనిత గురించి తెలియాలంటే నా ఫోన్ తెప్పిస్తే అందులో తెలుస్తుంది మేడమ్ అనేసరికి ఇదివరకే రోషిణి ఆ ఫోన్ లో ఉన్న వీడియో గురించే కదా నువ్వు అంటుంది అనడంతో కార్తీక్ ఏం మాట్లాడలేకపోతాడు. మోనిత క్రిమినలే కానీ ఆ క్రిమినల్ ను చంపే హక్కు మీకు లేదు అంటుంది. కానీ కార్తీక్ మాత్రం రోషిణి ని నమ్మించలేకపోవడంతో రోషిణి తో ఎమోషన్ గా మాట్లాడి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
ఆదిత్య తన ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతుండగా.. శ్రావ్య వచ్చి కాస్త వెటకారంగా మాట్లాడుతుంది. ఫోన్ లో మాట్లాడటానికి టైం ఉంటుంది కానీ మీ అన్నయ్యను చూడ్డానికి టైమ్ ఉండదా అంటూ నిలదీస్తుంది. ఇక ఆదిత్య వెంటనే తన బాధను మొత్తం బయటికి చెబుతాడు. మన వల్లే అన్నయ్యకు ఇలా జరిగింది అంటూ ఆవేశంగా మాట్లాడుతున్నాడు. దాంతో సౌందర్య, శ్రావ్య ఏమి అనలేక మౌనంగా ఉంటారు.
ఇక దీప వారణాసితో మోనిత ఇంటికి వెళ్తుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళని డాక్టర్ మోనిత ఎక్కడ ఉంది అని అడుగుతుంది. ఇక వాళ్ళు ఇంకెక్కడి మోనిత.. చంపేశారట.. ఆ పని మనిషి కూడా ఏమయిందో తెలియదు అంటూ దీపతో అనేసరికి.. పక్కనే వారణాసి డాక్టర్ బాబు కు శిక్ష పడటం పక్కనా అక్క అడుగుతాడు. ఇక దీప తనకు మోనిత కనిపించడం భ్రమ అని అనుకుంటుంది.
ఇది కూడా చదవండి: మోనిత వచ్చిందని తెలుసుకున్న డాక్టర్ బాబు.. వంటలక్కను చంపేస్తుందని భయపడి!
మరోవైపు సౌర్యకు జ్వరం రావడంతో సౌందర్య హాస్పిటల్ కి తీసుకు వెళ్దామని అనుకోగా నాన్న దగ్గరికి తీసుకెళ్ళు.. నాన్నను చూస్తేనే జ్వరం తగ్గుతుంది అని అంటుంది. ఇక దీపపై కోపాన్ని ప్రదర్శిస్తోంది. ఆవిడ ఏది అని అనేసరికి సౌందర్య ఎవరు అని అడుగుతుంది. వంటలక్క అని అనేసరికి సౌందర్య బాధపడుతూ దీప గురించి.. దీప పడుతున్న కష్టాల గురించి తెలుపుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Doctor babu, Karthika Deepam serial, Monitha, Nalla deepa, Nirupam paritala, Premi vishwanth, Rowdy durga, Vantalakka