• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • MONITHA PAKKA PLAN TO GET MARRIED KARTHIK IN TEN DAYS TODAYS KARTHIKA DEEPAM SERIAL EPISODE NR

Karthika Deepam: పదిరోజుల తర్వాత జరిగేది అదే.. పక్కన ప్లాన్ సిద్ధం చేసిన మోనిత!

Karthika Deepam

Karthika Deepam: ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ ఎంతలా ట్విస్ట్ ఇచ్చిందో చూస్తూనే ఉన్నాం. ఇక సామాన్యులు, సెలబ్రేటిలు ఈ సీరియల్ ను చూడకుండా అస్సలు వదలట్లేదు. పైగా కథ మరింత ఆసక్తి గా మారడంతో ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో అని ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే కార్తీక్ బయట కుర్చీలో పడుకోవడం చూసి దీప కాఫీ పెట్టుకొని రావడం,

  • Share this:
    Karthika Deepam: ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ ఎంతలా ట్విస్ట్ ఇచ్చిందో చూస్తూనే ఉన్నాం. ఇక సామాన్యులు, సెలబ్రేటిలు ఈ సీరియల్ ను చూడకుండా అస్సలు వదలట్లేదు. పైగా కథ మరింత ఆసక్తి గా మారడంతో ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో అని ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే కార్తీక్ బయట కుర్చీలో పడుకోవడం చూసి దీప కాఫీ పెట్టుకొని రావడం, ఇక రెడీ అయి ఉన్న దీప ని చూసి.. తను ఇక్కడే సెటిల్ అయిపోయాను అని దీప మళ్లీ ఎక్కడికైనా వెళుతుందేమోనని ఎటు వెళ్లిపోకు అని బ్రతిమాలుతాడు కార్తీక్. ఇక దీప ఎక్కడికి వెళ్ళనని బయట పని ఉందని వెళుతుంది. వెంటనే కార్తీక్ తన కార్ లో తీసుకెళ్తానని అనడంతో వద్దని ఆటోలో వెళ్తానని వెళుతుంది.

    ఇక మోనిత, ప్రియమణి మార్నింగ్ వాకింగ్ చేయగా.. అందులో మ్యూట్ వాయిస్ తో పది రోజుల తర్వాత జరిగే ప్లాన్ గురించి ప్రియమణికి చెబుతుంది. ఇక వెంటనే ప్రియమణి తనకు వచ్చిన డౌట్ లను ప్రశ్నించగా.. అంతలోనే దీప, సౌందర్య మాట్లాడుకుంటూ ఉండగా మోనిత కు కనిపిస్తారు. ఇక సౌందర్య కార్తీక్ గురించి దీపకు చెబుతుంది. మోనిత వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అనుకోని వాళ్ల దగ్గరికి వెళ్లి పలకరిస్తూ కొన్ని డైలాగులు వేస్తుంది. తన మాటలతో వారిని మరింత బాధ పడేలా చేస్తూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

    దీంతో సౌందర్య.. దీప తో బాధపడుతూ మాట్లాడుతుంది. అంతలోనే దీప కాస్త వెటకారంగా ప్రశ్నించినట్లు అనిపించడంతో సౌందర్య అక్కడినుండి బాధపడుతూ వెళ్ళిపోతుంటే దీప మిమ్మల్ని బాధ పెట్టడానికి నేను అలా అనలేదు అనడంతో నేనేం ఫీల్ కావడం లేదు లే అంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక కార్తీక్ ఇంటిదగ్గర మొక్కలకు నీళ్లు పడుతుండటం, పిల్లలకు టిఫిన్ చేసి రెడీ చేయడంతో పిల్లలు షాక్ అవుతారు. ఇక అంతలోనే దీప రావడంతో మీ నాన్న ఎక్కడ అని పిల్లలను ప్రశ్నించగా.. కార్తీక్ టిఫిన్ చేస్తూ కనిపించగా.. నీకు లేట్ అవుతుందేమో అని తింటున్నాను దీపా అని అంటాడు. నీకోసం హాట్ బాక్స్ లో తీసి పెట్టాను అనగా వెంటనే మరి నాకు అంటూ మోనిత ఎంట్రీ ఇస్తుంది. దీంతో వాళ్లంతా షాక్ అవుతారు.
    Published by:Navya Reddy
    First published: