Home /News /movies /

MONITHA IRRITATING VANTALAKKA AND DOCTOR BABU IN KARTHIKA DEEPAM SERIAL TODAYS EPISODE NR

Karthika Deepam: ఛీఛీ.. వంటలక్కకు చీర ఇచ్చిన మోనిత.. తలకొట్టుకుంటున్న డాక్టర్ బాబు!

Karthika Deepam

Karthika Deepam

Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ ట్విస్ట్ లతో సాగుతున్న తరుణంలో ఈ సీరియల్ పై అభిమానులు తెగ మండిపడుతున్నారు. వీలైనంత తొందరగా శుభం కార్డు పలికించమని కోరుతున్నారు.

    Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ ట్విస్ట్ లతో సాగుతున్న తరుణంలో ఈ సీరియల్ పై అభిమానులు తెగ మండిపడుతున్నారు. వీలైనంత తొందరగా శుభం కార్డు పలికించమని కోరుతున్నారు. పైగా రేటింగ్ కూడా దిగజారింది. ఇదిలా ఉంటే మోనితతో కార్తీక్ పెళ్లి అని మురళి కృష్ణ వచ్చి సౌందర్యతో మాట్లాడుతూ ఎమోషనల్ అవుతాడు. ఇక సౌందర్య కూడా ఏం చెప్పలేక తలదించుకుంటుంది. ఇక దీప, కార్తీక్, పిల్లలు కలిసి భోజనం చేస్తున్న సమయంలో పిల్లలు బయటికి వెళదామని అనడంతో దీప కూడా సరే అంటుంది. ఇక కార్తీక్ కూడా సంతోషపడగా.. అసలు ట్విస్ట్ ఇస్తుంది దీప. అది కూడా 25న నలుగురం కలిసి బయటికి వెళ్దాం అంటుంది. ఇక వెంటనే కార్తీక్ షాక్ అవుతాడు. పైగా దీప ఆ రోజు ఎటువంటి పనులు పెట్టుకోవద్దని చెప్పేసరికి కార్తీక్ మైండ్ బ్లాక్ అవుతుంది.

    మరోవైపు మౌనిత నిద్రలేస్తు కడుపు మీద చెయ్యి వేసుకుని నువ్వు కడుపులో పడిన మూడు నెలలకే పెళ్లి చేస్తున్నావ్.. నువ్వు గ్రేట్ బేటా అనుకుంటున్నా తెగ మురిసిపోతుంది. సౌందర్య దీప ఇంటికి వెళ్లగా దీప వెటకారపు మాటలతో మాట్లాడేసరికి అసలు విషయం తెలిసిందా అని భయపడుతుంది సౌందర్య. ఇక దీప మా ఆయనతో మోనిత పెళ్లి, ఈ దీపకు రాసినట్లే పిల్లలకు కూడా సవతి తల్లి పెంపకం రాసినట్లు ఉన్నాడు ఆ దేవుడు అంటూ పిల్లలకు ఎలాంటి చీడపట్టనివ్వను అంటూ ఆవేశపడుతుంది. తన బాధను మొత్తం సౌందర్య తో తెలుపుతుంది. మొత్తానికి 25 న రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి నిశ్చయించుకుని వచ్చారని సౌందర్య తో అంటుంది.

    ఇక కార్తీక్ అర్జెంట్ పని అని దీప, సౌందర్య ఆపిన కూడా వినకుండా వెళ్తాడు. వెంటనే దీప అక్కడేనేమో అనేసరికి సౌందర్య వాడికి ఏదైనా అర్జెంట్ పని ఉందేమో.. నీకేం తెలుసే అనగా.. మోనిత దీపకు వీడియో కాల్ చేస్తుంది. మోనిత పక్కన కార్తీక్ తల పట్టుకొని కూర్చొని ఉండగా.. ఇదిగో దీపా నీకు ఏ చీర నచ్చిందో కార్తీక్ అడగమన్నాడు అనేసరికి పక్కనున్న కార్తీక్, దీప, సౌందర్య లుషాక్ అవుతారు. ఇక దీప సౌందర్య వైపు కోపంగా చూస్తోంది. దీప కార్తీక్ ను చూసి ఓ రేంజ్ లో మండిపోతుంది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Doctor babu, Karthika Deepam serial, Nirupam paritala, Premi vishwanth, Telugu daily serial, Vantalakka

    తదుపరి వార్తలు