MONITHA GIVES ULTIMATES SHOCK TO KARTHIK FAMILY IN KARTHIKA DEEPAM SERIAL TODAYS EPISODE NR
Karthika Deepam: ఇది ఇంట్రవెల్ మాత్రమే 'క్లైమాక్స్'లో చుక్కలు చూపిస్తానంటున్నా ఖైదీ మోనిత
Karthika Deepam
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకి ట్విస్ట్ లతోనే సాగుతుంది. ఒకటే కథను మలుపులు తిప్పుతూ మళ్లీ మొదటికే వచ్చినట్లు అనిపిస్తుంది. ఇక లాయర్ మోనితను నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరు అని ప్రశ్నించగా కార్తీక్ అని గట్టిగా చెప్పేస్తుంది. కార్తీక్ నేను కాదు అంటూ అరుస్తాడు.
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకి ట్విస్ట్ లతోనే సాగుతుంది. ఒకటే కథను మలుపులు తిప్పుతూ మళ్లీ మొదటికే వచ్చినట్లు అనిపిస్తుంది. ఇక లాయర్ మోనితను నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరు అని ప్రశ్నించగా కార్తీక్ అని గట్టిగా చెప్పేస్తుంది. కార్తీక్ నేను కాదు అంటూ అరుస్తాడు. మోనిత మాత్రం నా బిడ్డ మీద ఒట్టేసి చెబుతున్నాను ఈ బిడ్డకు తండ్రి కార్తీక్ అంటూ గట్టిగా చెబుతుంది. ఆ బిడ్డకి తండ్రిని ఎలా అయ్యాను అని కార్తీక్ లాయర్ ను ప్రశ్నించమని కోరగా వెంటనే లాయర్ పెళ్లికి ముందే అతడు తండ్రి ఎలా అవుతాడని ప్రశ్నిస్తాడు. తను ఆర్టిఫిషియల్ గా గర్భందాల్చిన విషయాన్ని బయట పెడుతుంది. ఆమె అలా చేయడం అనైతిక చర్య అంటూ లాయర్ అంటాడు.
తన అనుమతి లేకుండా నన్ను తండ్రిని చేయాలని చూస్తుంది మోనిత అంటూ.. ఎప్పటికీ ఆ బిడ్డకు తండ్రిని అని ఒప్పుకోను అంటూ గట్టిగా చెప్పేస్తాడు. మోనిత ఈ విషయం గురించి కార్తీక్ చెప్పలేదు అంటూ.. కార్తీక్ తో పిల్లలను కనడం ఇష్టం అనడంతో అక్కడున్న వాళ్ళందరూ తెగ నవ్వుకుంటారు. ఈ విషయాన్ని కార్తీక్ తో పెళ్లి చేసుకున్నాక ఫస్ట్ నైట్ రోజు చెప్పాలని అనుకున్నాను అనేసరికి మళ్ళీ నవ్వుకుంటారు. తప్పలేదు అంటూ కార్తీక్ కోసం ఎదురు చూసి సహనం నశించిపోయింది అంటూ అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అని చెబుతోంది.
దీపను పెళ్లి చేసుకోక ముందుకే కార్తీక్ ను ఇష్టపడ్డాను అంటూ కానీ కార్తీక్ మాత్రం తనను కాదని దీపను పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. ఆయన నాలో ఏం తక్కువ అంటూ అందం, ఆస్తి అన్నీ ఉన్నాయి అంటూ తెగేసి మాట్లాడుతుంది. పదే పదే తన ఇంటికి వస్తాడు అంటూ ఇంటి చుట్టు పక్కన వాళ్ళు తనకు కార్తీక్ మధ్య ఏదో ఉందని అనుకున్నారని అందుకే ఇల్లు కూడా మార్చాల్సి వచ్చింది అంటూ మళ్లీ అక్కడి కూడా వచ్చాడు అని చెబుతుండగానే.. మధ్యలో దీప కలుగజేసుకొని రావద్దు అని గట్టిగా చెప్పేస్తే వచ్చేవాడు కాదు కదా అని గట్టిగా బదులిస్తుంది.
ఇక కార్తీక్ కూడా మోనిత చనిపోయిన నాటకం గురించి, తన భార్యను దూరం పెట్టడానికి ఈమెనే కారణమంటూ, మళ్లీ వేధించడానికి కొన్ని గెటప్ లు వేసుకొని తిరిగింది అంటూ చాలా బాధ పెట్టింది అంటూ అనేసరికి జడ్జి చివరగా విచారించి తీర్పు చెబుతాడు. మోనిత సంవత్సరన్నర శిక్ష విధించడంతో పాటు పరువు పరిహారం చెల్లించాలని తీర్పు ఇస్తాడు. మోనితను జైలుకు తీసుకొని వెళ్తున్న సమయంలో మీడియా వాళ్ళు వచ్చి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. ఇంటర్వెల్ మాత్రమే క్లైమాక్స్ ఉంది అప్పుడు నేను ఏంటో చెబుతాను అంటూ గట్టిగా మాట్లాడుతుంది. ఇక మీడియా ముందు కార్తీక్ కుటుంబాన్ని ఇరికించాలి అని అనుకోగా దీప, సౌందర్య మాత్రం మోనిత మాటలకు లొంగిపోకుండా ధైర్యంగా ఉంటారు.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.