Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ లో ప్రస్తుతం కథ మొత్తం అడ్డం తిరగటంతో ప్రేక్షకులనుండి మళ్లీ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇక ఈ జన్మకి దీప, కార్తీక్ లు ఇక కలుసుకోరని ఫిక్స్ అయిపోయారు ప్రేక్షకులు. ఇదిలా ఉంటే కార్తీక్.. దీప కోసం భోజనం తీసుకువచ్చి పెడుతూ.. తన మనసులోని మాటలను తనతో పంచుకుంటాడు.ఇక పిల్లలిద్దరూ కార్తీక్ మాటలు విని సంతోష పడతారు. ఇక దీప మాత్రం కార్తీక్ మాటలకు వెటకారంగా స్పందిస్తుంది. కార్తీక్.. దీపని ఏదైనా మాట్లాడమని బతిమాలుతూ ఉంటాడు. అంతలోనే దీప నోరు తెరిచి ఒక మాట అడుగుతుంది. ఇక దాంతో కార్తీక్ రియాక్షన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. లక్ష్మణ్ కు హార్ట్ కు సంబంధించిన ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతుంది.
కార్తీక్ అప్ సెట్ అయి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతాడు. ఇంట్లో సౌందర్య కార్తీక్, పిల్లల కోసం నిద్రపోకుండా ఎదురుచూస్తూ ఉంటుంది. కార్తీక్ పిల్లలని నిద్రలేపి ఎక్కడుంటారు అని అడగగా అమ్మ నాన్న ఎక్కడ ఉంటే అక్కడే ఉంటామని అనడంతో సరే మీ బట్టలు తెస్తాను అని అంటాడు. ఇక పిల్లలు నువ్వు ఎక్కడ ఉంటావు అని ప్రశ్నించగా మౌనంగా తలదించుకుంటాడు. ఉదయాన్నే నిద్రలో ఉన్న హిమకు మెలుకువ రాగా కిచెన్ లోకి వెళ్లి చూసింది. ఇక దీప బయట బాధగా కూర్చొని ఉండగా ఎందుకిలా ఉన్నావ్ అని ప్రశ్నిస్తుంది.
మురళి కృష్ణ ఏడుస్తుండగా వెంటనే భాగ్యం వచ్చి సౌందర్య తో దీప కాపురం గురించి మాట్లాడమని సలహా ఇస్తుంది. ఇక తర్వాత దీప డైనింగ్ టేబుల్ దగ్గర ఉండగా కార్తీక్ మళ్లీ బతిమాలుతుంటాడు. అంతలోనే మోనిత వారి దగ్గరికి వచ్చి దీపల వెయిట్ చేసే ఓపిక లేదంటూ.. నీకు పది రోజుల టైం ఇస్తున్నానని గోడమీద 10 గీతలు గీసి.. సరిగ్గా పది రోజుల్లోగా తనకు సమాధానం చెప్పమని, న్యాయం జరిగే న్యాయం రాకపోతే మొత్తం మీ ఫ్యామిలీ గడగడా వణికి పోయేలా చేస్తాను.. బీ రెడీ అంటుంది మోనిత. మోనిత మాటలకూ కార్తీక్ షాక్ అవుతాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Deepa, Doctor babu, Karthika deepam, Monitha, Nalla deepa, Premi Vishwanath, Vantalakka