Karthika Deepam: పోలీస్‌లను ఆశ్రయించిన మోనిత.. గుక్క‌తిప్పుకోకుండా ఏడుస్తున్న ప్రియమణి!

Karthika Deepam

Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం ఆసక్తి గా మారడంతో బుల్లితెర ప్రేక్షకులు ఈ సీరియల్ ను చూడకుండా ఉండట్లేరు. పైగా కార్తీక్ దీప కు మరింత దగ్గర అవడంతో మోనిత నుండి కాపాడటానికి దీప కూడా ప్రయత్నం చేస్తుంది.

  • Share this:
    Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం ఆసక్తి గా మారడంతో బుల్లితెర ప్రేక్షకులు ఈ సీరియల్ ను చూడకుండా ఉండట్లేరు. పైగా కార్తీక్ దీప కు మరింత దగ్గర అవడంతో మోనిత నుండి కాపాడటానికి దీప కూడా ప్రయత్నం చేస్తుంది. ఇక మోనిత కార్తీక్ మాటల గురించి ఆలోచిస్తూ.. ఇంత జరుగుతున్నా కూల్ గా ఉండటంతో అలుసు అయ్యాను అనుకుంటూ పైగా ప్రియమణి ఎంక్వయిరీ చేశాడంటే ఇక ఆగకూడదని మోనిత వాయిస్ తో పాటు ఇంకో తెలివైన పదునైన వాయిస్ కావాలి అని గట్టిగా నిర్ణయించుకుంటుంది. ఇక కార్తీక్ భాగ్యం ఇంటికి వెళ్లిన విషయాలను శ్రావ్య సంతోషంగా ఆదిత్య తో చెప్పగా ఆదిత్య సంతోషపడతాడు.

    ఇక దీప, కార్తీక్ లు మాట్లాడుకుంటారు. ఆ గోడపై గీతాలు చెడిపినందుకు దీపకు థాంక్స్ చెబుతాడు. అంతే కాకుండా తన తలరాత కూడా మార్చమని దీపను కోరుతాడు. ఇక తనను అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉందని చెబుతాడు. ఇక దీప ఒకప్పుడు తనపై వేసిన నిందలో కడుపులో పెరిగే బిడ్డకు తండ్రిని నేను కాదని గట్టిగా ఎలా చెప్పావో.. అదే మాట మోనిత తో ఎందుకు చెప్పట్లేవని ప్రశ్నిస్తుంది. సవతిని తెచ్చిపెడితే తట్టుకోలేను అనడంతో అలాంటి పరిస్థితి రానివ్వను అంటూ కార్తీక్ చెబుతాడు. ఇక దీప కూడా కార్తీక్ ను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ వీటన్నిటికీ సమాధానం చెప్పే సమయం దగ్గరగా ఉందని ఇకనైనా పిల్లలతో సంతోషంగా గడపండి అంటుంది. ప్రియమణి ఎంత బ్రతిమాలినా కాఫీ తాగను అనేసరికి వెంటనే మోనితను హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. కార్తీక్ పిల్లల్ని తీసుకొని సౌందర్య ఇంటికి సంతోషంగా వెళ్తాడు. దీప మోనితను చూసి తలుపులు తీసి ఉంచితే వీధికుక్కలు లోపలికి వస్తాయని అంటుంది. గోడ మీద చెరిపేసిన గీతలు చూసిన మోనిత తన మాటలతో దీపకు షాక్ ఇవ్వాలనుకుంటుంది.

    కానీ దీప మాత్రం గట్టిగా మాట్లాడుతూ మోనితను భయపడేలా చేస్తుంది.మోనిత కూర్చోబోతుంటే కుర్చుని తన్ని మా ఇంట్లో కూర్చోడానికి అర్హత లేని దానివి ఇంటి కోడలిగా వస్తే ఎలా ఊరుకుంటాను అంటూ.. పట్టపగలు నక్షత్రాలు కనిపిస్తాయి అంటూ కార్తీక్ సపోర్ట్ చేసే విధంగా గట్టిగా మాట్లాడుతుంది. ఇక మోనిత కార్తీక్ తప్పు చేయలేదు నమ్ముతున్నావా అనడంతో వెంటనే దీప తనదైన శైలిలో సమాధానం చెబుతుంది. ఆయన గురించి నాకు తెలుసు.. అందని ఆకాశానికి నిచ్చెన వేయకు.. అందని దానికోసం శీలాన్ని త్యాగం చేయకు అంటూ మంచి ట్రీట్మెంట్ ఇస్తుంది దీప.
    Published by:Navya Reddy
    First published: