Karthika Deepam: బయటపడ్డ మోనిత గుట్టు.. వంటలక్క గురించి తెలుసుకున్న డాక్టర్ బాబు.. కథలో కీలక మలుపు?

Karthika Deepam

Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం ఆసక్తిగా మారింది. న్యాయం కోసం దీప, మోనిత లు బాగా పోరాడటంతో కథ మొత్తం బాగా రసవత్తరంగా మారింది. ప్రేక్షకులు కూడా చివరి క్షణంలో ఏం జరుగుతుందోనని ఎదురుచూస్తున్నారు.

  • Share this:
    Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం ఆసక్తిగా మారింది. న్యాయం కోసం దీప, మోనిత లు బాగా పోరాడటంతో కథ మొత్తం బాగా రసవత్తరంగా మారింది. ప్రేక్షకులు కూడా చివరి క్షణంలో ఏం జరుగుతుందోనని ఎదురుచూస్తున్నారు. ఇక అందరూ భోజనం చేస్తున్న సమయంలో కార్తీక్ కి మోనిత నుండి ఫోన్ రావడంతో భోజనం మధ్యలో నుండి పరుగు తీశాడు. ఇక దీప ఏం జరిగింది అని ప్రశ్నిస్తుంది. వెంటనే మోనిత ఇంటికి వెళ్లేసరికి బెడ్ పై ఉన్న మోనితకు భారతి ట్రీట్మెంట్ చేస్తుంది. ప్రియమణి తెగ ఏడుస్తుంది. ఇక భారతి కార్తీక్ ను ఓ నాలుగు మాటలు అంటుంది. వెంటనే ప్రియమణి ఏడుస్తూ మత్తులో ఉంది కదమ్మా.. ఆ కడుపు ఏదో తీసేయండి గొడవ వదిలిపోతుందని నాటకంగా మాట్లాడుతుండగా వెంటనే ప్రియమణి చెప్పినట్లు చెయ్యండి. ఏ సమస్య ఉండదు కదా కార్తీక్ అంటూ ఎంట్రీ ఇస్తుంది రోషిణి.

    ఇక కార్తీక్ ని బయటకు పిలిపించి రాయల్ ఫ్యామిలీ అని ఇలా చేయడం కరెక్ట్ కాదని అంటూ మోనితను పెళ్లి చేసుకోవడం నిజమేనా అని ప్రశ్నిస్తుంది. ఇక కార్తీక్ గతంలో దీపను అపార్థం చేసుకునే సమయంలో అలా చేశాను అంటాడు. కానీ మనసు, మోజు లాంటివి పడలేదని చెప్పేస్తాడు. తనని ఫ్రెండ్ గా చూశాను. ఈ తప్పు మాత్రం.. అనగా వెంటనే రోషిణి తన మాటతో కలుపుతూ తాగిన మైకంలో.. అని అనడంతో అలా మోనిత చెబుతుంది. ఆమె చెప్పే వరకు తెలియదని కార్తీక్ అంటాడు. ఇక ఇదంతా బెడ్ పై ఉన్న మోనిత వింటూ తనకు కావాల్సింది ఇదే అంటూ.. వీళ్ళందర్నీ సాక్ష్యం కోసం ఆడిన నాటకం అనుకుంటూ నవ్వుకుంటుంది మనసులో.

    కార్తీక్ ని బయటికి పిలిపించి తప్పు చేయని దీపను అనుమానించారని, దీప మాత్రం మీరు తప్పు చేసిన అనుమానించడం లేదు అని ఇదే ప్రేమ అంటుంది రోషిణి. అంతేకానీ చేయి కోసుకోవడం, అందని రప్పించడం వంటివి కాదని మాట్లాడి వెళ్ళిపోతుంది. ఇక ఆనందరావుకు ఇంట్లో మార్పులతో తనలో ఆలోచనలు మొదలవుతాయి. మురళి కృష్ణ బాధపడుతుంటే భాగ్యం ఓదార్చుతుంది. ఇక దీప.. కారు దగ్గర కార్తీక్ నా కర్మ నన్ను ఎలా నడిపిస్తే చూడు అంటూ.. మోనిత సూసైడ్ వీడియోను తలుచుకుంటూ.. ఇదంతా నాటకమని అనుకుంటుంది. రివర్స్ లో డాక్టర్ బాబుని అరెస్టు చేస్తారేమో అని కంగారు పడుతుంది. ఇక కార్తీక్ కారులో జరిగింది గుర్తు చేసుకొని మోనిత అలా చేయడం వీళ్ళందర్నీ పిలిపించడం నాటకమని అనుకుంటాడు కార్తీక్. ఇక చాలా ప్లాన్ గా పామును కదుపుతుంది అనుకుంటూ చాలా కేర్ఫుల్ గా ఉండాలి అంటూ.. అప్పుడే మమ్మీ, దీప మాటలకు మేల్కోవల్సింది అనుకుంటూ మదన పడతాడు.
    Published by:Navya Reddy
    First published: