Karthika Deepam: వంటలక్కను చంపేందుకు మోనిత పక్క ప్లాన్.. డ్రామాలు వేస్తుంటా అంటూ?

karthika deepam

Karthika Deepam: బుల్లితెరలో కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారింది. చనిపోయిందనుకున్న మోనిత మళ్ళీ కనిపించడంతో మళ్లీ వంటలక్కను ఏం చేస్తుందో తెగ టెన్షన్ పడుతున్నారు అభిమానులు.

  • Share this:
    karthika Deepam: బుల్లితెరలో కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారింది. చనిపోయిందనుకున్న మోనిత మళ్ళీ కనిపించడంతో మళ్లీ వంటలక్కను ఏం చేస్తుందో తెగ టెన్షన్ పడుతున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే కార్తీక్ ఫోటోను చూసుకుంటూ గతంలో తనపై కార్తీక్ కోపంగా ప్రవర్తించిన సీన్ గుర్తు చేసుకుంటుంది. కానీ గతంలో కార్తీక్ తనను చంపలేదనట్టు.. కేవలం తానే కార్తీక్ పై నిందలు వేయడానికి అలా చేసిందని బయటపడింది. ఆ ఫోటోని చూసుకుంటూ అలాగే మాట్లాడుతూ కార్తీక్ బయటికి వచ్చేలోపు దీపను పైకి పంపిస్తానని గట్టిగా అనుకుంటుంది.

    ఇక దీప పిల్లలను తీసుకొని కార్తీక్ దగ్గరికి వెళ్ళగానే.. పిల్లలు తన తండ్రిని చూసి తెగ ఏడుస్తుంటారు. ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటారు. మీరు ఏం తప్పు చేశారు అని వాదిస్తారు. వీటికి తాళాలు ఎందుకు వేశారు అని.. లోపల ఏమీ లేవా అని ప్రశ్నిస్తారు. కార్తీక్ పిల్లల్ని చూసి వాళ్లను పట్టుకొని కుమిలి పోతాడు. ఇక మా నాన్నను కాసేపు వదిలేయండి అంటూ అక్కడున్న పోలీసు వాళ్ళతో బ్రతిమాలుతుంది శౌర్య. ఇక రత్న సీత పిల్లల బాధలు చూడలేక డోర్ తీస్తుంది.

    ఇక పిల్లలతో కలిసి భోజనం చేస్తాడు కార్తీక్. అదే సమయంలో రోషిణి ఎంట్రీ ఇచ్చి వాళ్ళని చూసి రత్న సీతపై మండిపడుతుంది. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అంటూ కోపంతో రగిలిపోతుంది. అది చూసిన శౌర్య.. నేను అలాగే కావాలి అనుకుంటున్నాను నాన్న.. ఏం చదవాలి అనే సరికి.. ఐపీఎస్ అవ్వాలి అంటాడు. వెంటనే రోషిణి వైపు కోపంగా చూస్తూ నేను కూడా ఐపీఎస్ అవుతాను అంటుంది. రోషిణి అప్పుడు క్రిమినల్స్ కి,పెద్ద మనుషులకి తేడా తెలుస్తుంది అని సమాధానం ఇస్తుంది.

    అదే సమయంలో భాగ్యం దీపకి ఫోన్ చేసి కార్తీక్ గురించి గుడికి వెళ్దామని చెబుతుంది. దీప కూడా సరే అంటుంది. ఇక ఆ విషయాన్ని రత్న సీతా విని వెంటనే మోనితకు సమాచారం పంపుతుంది. మరోవైపు సౌందర్య, ఆనందరావు కార్తీక్ న్యాయం కోసం పై అధికారులతో మాట్లాడుతారు. ఇక మోనిత సోది చెప్పేదానిలా తయారయ్యి గన్ పట్టుకుని ఎక్కడికో బయల్దేరుతుంది. దీన్ని బట్టి చూస్తే దీప, భాగ్యం వెళ్లే గుడికి వెళుతుందని.. బహుశా దీపను చంపడానికి ప్లాన్ చేసిందేమో అని అనిపిస్తుంది. మరి దీప పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
    Published by:Navya Reddy
    First published: