హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: మోనిత వింత కోరికలు.. కార్తీకదీపంలో మళ్ళీ ఊహించని ట్విస్ట్?

Karthika Deepam: మోనిత వింత కోరికలు.. కార్తీకదీపంలో మళ్ళీ ఊహించని ట్విస్ట్?

karthika deepam

karthika deepam

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. రేటింగ్ కూడా మొదటి స్థానంలోనే దూసుకెళ్తుంది. ఇక దీప పోస్టర్ల గురించి అబద్ధం చెప్పడం తో సౌర్య కోపంతో రగిలిపోతుంది. దీప ఏం చెప్పలేక మౌనంగా ఉంటుంది.

ఇంకా చదవండి ...

    Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. రేటింగ్ కూడా మొదటి స్థానంలోనే దూసుకెళ్తుంది. ఇక దీప పోస్టర్ల గురించి అబద్ధం చెప్పడం తో సౌర్య కోపంతో రగిలిపోతుంది. దీప ఏం చెప్పలేక మౌనంగా ఉంటుంది. మరోవైపు పోలీస్ స్టేషన్ లో మోనితను కోర్టుకి తీసుకెళ్లడానికి రోషిణి రావడంతో.. రోషిణి తో తనకు ఒక కోరిక ఉందంటూ.. ఆ కోరిక తీర్చాలి అంటూ వేడుకుంటుంది మోనిత. ఏంటి ఆ కోరిక అని రోషిణి ప్రశ్నించగా.. కోర్టుకి మీ కారు లోనే వస్తాను అంటూ బ్రతిమాలుతుంది. వెంటనే రోషిణి కోపంగా నేను ఖైదీలను ఎక్కించుకోను అని గట్టిగా చెప్పిన కూడా మొత్తానికి రోషిణిని పట్టి పీడించి తన కారు ఎక్కేలా చేస్తుంది. ఇక పిల్లలు మెట్లపై కూర్చుని ఉంటారు. అందులో సౌజన్య కోపంతో బాగా రగిలిపోతుంది. తన తల్లి తనకు అబద్ధం చెప్పింది అంటూ మండిపోతుంది.

    అమ్మ నాన్నలను బయటికి వెళ్తున్నారని ఎక్కడికి వెళ్తున్నారో అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటుంది. ఇక అక్కడికి కార్తీక్, దీప రావడంతో ఎక్కడికి వెళ్తున్నారు.. మేము కూడా వస్తాం అని ప్రశ్నిస్తారు. కార్తీక్ బయటికి వెళ్తున్నామని నచ్చజెప్పి ఆపే ప్రయత్నం చేస్తాడు. సౌర్య మళ్లీ పెద్దపెద్ద మాటలు మొదలు పెట్టడంతో సౌందర్య వచ్చి వారికి దీప గురించి గట్టిగా చెప్పేసరికి హిమ వెళ్లి దీపను గట్టిగా పట్టుకుంటుంది. ఇక కార్తీక్ దీప వెళ్తుంటే సౌర్య భయపడుతూ మాట్లాడుతుంది.నువ్వు బయటికి వెళితే భయంగా ఉంది నాన్న అంటూ మళ్లీ తిరిగి వస్తావు కదా అని అనడంతో కార్తీక్ మళ్లీ వస్తాను అంటూ అక్కడి నుంచి బయలుదేరుతారు.

    ఇది కూడా చదవండి:పెళ్లి చేసుకోవద్దులే కార్తీక్ నాతో సహజీవనం చెయ్యు చాలు.. దిగజారిపోయిన మోనిత!

    ఇక మోనిత రోషిణి కారులో హుందాగా కూర్చొని ప్రయాణిస్తుంది. ఖాళీగా ఉండటం ఎందుకు అని నిద్రపోయిన పులిని లేపింది మోనిత. రోషిణికి రెండు బిస్కెట్లు వేస్తామని అనుకొని మాట్లాడగా.. వెంటనే రోషిణి ఇంకెన్ని బిస్కెట్లు తీసుకొచ్చావు అనేసరికి షాక్ అవుతుంది మోనిత. మోనితకు గట్టిగా క్లాస్ పీకింది. మోనిత ఓవర్ యాక్టింగ్ ను మొత్తం దించేసింది రోషిణి. సౌందర్య, కార్తీక్, దీప గురించి పొగిడే సరికి మోనితకు బాగా కోపం వస్తుంది. మొత్తానికి రోషిణి కారులో వెళ్లినందుకు మంచి గడ్డి పెట్టింది రోషిణి.

    ఇది కూడా చదవండి:జైలుకు వెళ్లిన మోనిత.. జాలిపడుతున్న సిగ్గులేని వంటలక్క.. జైల్లోను రత్నసీతతో ప్లాన్లు.. వామ్మో!

    నిజానికి మోనిత ఆ కారు నుండి దిగుతున్నప్పుడు కార్తీక్, దీప చూసి షాక్ అవ్వాలని ఎక్కింది. కోర్టులో సౌందర్య,దీప, కార్తీక్ మోనిత నిజస్వరూపం గురించి మాట్లాడతారు. అంతలోనే మోనిత వస్తుంది. సౌందర్య ను చూసి వెటకారంగా పలకరిస్తుంది. వెంటనే సౌందర్య కోపంతో చెయ్యి లేపేసరికి రోషిణి సౌందర్యను కూల్ చేస్తుంది. మోనిత దీప, కార్తీక్ లను ఉద్దేశించి మాట్లాడగా కార్తీక్ కూడా గడ్డి పెట్టేస్తాడు. వెంటనే రోషిణి నేను పెట్టిన గడ్డి సరిపోలేదా ఇక్కడ కూడా గడ్డి కావాలా అనేసరికి దీప, సౌందర్య, కార్తీక్ నవ్వుకుంటారు.

    Published by:Navya Reddy
    First published:

    Tags: Adithya, Archana ananth, Doctor babu, Hima, Karthika deepam, Monitha, Nirupam paritala, Premi Viswanath, Roshini, Shobashetty, Soundarya, Sourya, Sravya, Vantalakka

    ఉత్తమ కథలు