హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: పెళ్లి చేసుకోవద్దులే కార్తీక్ నాతో సహజీవనం చెయ్యు చాలు.. దిగజారిపోయిన మోనిత!

Karthika Deepam: పెళ్లి చేసుకోవద్దులే కార్తీక్ నాతో సహజీవనం చెయ్యు చాలు.. దిగజారిపోయిన మోనిత!

karthika deepam

karthika deepam

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు ట్విస్టులతో బాగా సాగుతుంది. కథ శుభం కార్డు పలుకుతుందనే అనుకోనేలోపు మరింత ట్విస్ట్ తో సాగితుంది. ఇక రత్న సీత కార్తీక్ వాళ్ళ ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే.

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు ట్విస్టులతో బాగా సాగుతుంది. కథ శుభం కార్డు పలుకుతుందనే అనుకోనేలోపు మరింత ట్విస్ట్ తో సాగితుంది. ఇక రత్న సీత కార్తీక్ వాళ్ళ ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ కాసేపు పరామర్శించి వెళ్ళిపోయే ముందు మోనిత ఇచ్చిన బ్యాగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. అందులో ఏముందో అని ఇంకా వేధిస్తూనే ఉంటుందని జైల్లో ఉన్న కూడా తన పంతం తగ్గట్లేదు అని కార్తీక్ అంటుంటాడు. ఇక సౌందర్య కూడా మోనిత విషయంలో టెన్షన్ పడుతూ దీపను ఆ బ్యాగు తెరిచి చూడమంటుంది. ఆ బ్యాగులో చిన్నపిల్లల పోస్టర్లతో పాటు మోనిత రాసిచ్చిన లెటర్ ఉంటుంది.ఆ పోస్టర్లను చూసి ఇంట్లో వాళ్లు షాక్ అవుతారు. కార్తీక ఆ లెటర్ తీసి చదువుతాడు. అందులో మోనిత మన పుట్టబోయే బిడ్డ అంటూ కార్తీక్ ను రెచ్చగొట్టే మాటలను రాసి పంపిస్తుంది. అదే సమయంలో పిల్లలు రావడంతో పోస్టర్లను చూసి తెగ మురిసిపోతారు.

ఎవరు తీసుకొచ్చారు అమ్మా అని అనడంతో బాబాయ్ తీసుకొచ్చాడు అని చెప్పి తప్పించుకుంటుంది. దీపు కోసం టాయ్స్ పట్టుకొస్తారు కానీ ఈ పోస్టర్స్ ఎందుకు అని నవ్వుకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోతారు. ఇక కార్తీక్, సౌందర్య, దీప, ఆనందరావు లు ఆ పోస్టర్లు చూసి అర్థంకాని పరిస్థితుల కనిపిస్తారు. ఇక కార్తీక్ మోనిత ఇక వదలదు అంటూ బాగా కోపమవుతాడు. పైగా పుట్టబోయే బిడ్డకి నాన్న పేరు ఆనంద్ అని కూడా పెట్టింది అంటూ బాగా ఫైర్ అవుతాడు.ఇక ఆనందరావు తర్వాత జరిగే విషయం గురించి ఆలోచించకండి అంటూ ధైర్యం ఇస్తాడు.

ఇది కూడా చదవండి:జైలుకు వెళ్లిన మోనిత.. జాలిపడుతున్న సిగ్గులేని వంటలక్క.. జైల్లోను రత్నసీతతో ప్లాన్లు.. వామ్మో!

ఇక కార్తీక్ కోపంతో అది జైల్లో ఉన్న కూడా ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు అంటూ కోపంతో రగిలిపోతాడు. ఇక సౌందర్య కూడా కార్తీక్, దీప లను ధైర్యంగా ఉండమని సలహా ఇస్తుంది. ఎప్పటికైనా మోనిత వెంటాడుతూనే ఉంటుందని మళ్లీ మీ మధ్య గొడవలు పెట్టడానికైనా సిద్ధంగా ఉంటుంది అంటూ కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తుంది. మరోవైపు పోలీస్ స్టేషన్ లో రోషిణి మోనిత డీటెయిల్స్ తీసుకుంటున్న సమయంలో మోనిత తన పేరును మోనిత కార్తీక్ అని అడ్రస్ కూడా కార్తీక్ అడ్రస్ చెప్పడంతో రోషిణి బాగా కోపమవుతుంది. అయినా కూడా మోనిత తన పంతాన్ని తగ్గించుకోదు. ఎవరు లేని సమయం చూసి రత్న సీత మోనిత దగ్గరికి వెళ్లి కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్లిన సంగతి వివరిస్తుంది. మోనిత మాత్రం కార్తీక్ ఎలా ఉన్నాడు అంటూ తెగ పొంగిపోతుంది.

ఇది కూడా చదవండి:జైల్లో మోనిత... నిర్దోషిగా బయటపడ్డ డాక్టర్ బాబు.. సీరియల్‌కు శుభం కార్డు?

ఇక పిల్లలు ఆడుకుంటున్న సమయంలో తన బాబాయ్ ని చూసి నవ్వగా ఏమైందని ఆదిత్య ప్రశ్నించే సరికి టాయ్స్ కాకుండా పోస్టర్లు ఎందుకు తెచ్చావ్ బాబాయ్ అంటూ నవ్వుతారు. వెంటనే నేను తేలేదు అనేసరికి పిల్లలు షాక్ అవుతారు. అమ్మ మళ్ళీ అబద్ధం చెప్పిందని సౌర్య కోపంతో రగిలిపోతుంది. మరోవైపు మోనితను గంట సేపట్లో కోర్టుకి తీసుకెళ్తారు అనగా కార్తీక్ వస్తాడు అనే విషయం తెలియడంతో గంట ఎప్పుడు గడుస్తుందని తెగ ఆతృతతో మురిసిపోతుంది. కార్తీక్ కు కూడా కోర్టుకు రమ్మని పిలుపు రావడంతో అక్కడే ఉన్న దీప, ఆదిత్య లకు చెబుతాడు. ఇంకా శిక్ష పడాలని ఆదిత్య తన భార్య అనడంతో దీప మాత్రం మోనితకు శిక్ష పడుతుందా అన్నట్లు బాధగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక శౌర్య దీప అబద్ధం చెప్పినందుకు బాగా కోపమవుతుంది.

First published:

Tags: Adithya, Archana ananth, Doctor babu, Hima, Karthika deepam, Monitha, Nirupam paritala, Premi Viswanath, Rathna Seetha, Roshini, Shobashetty, Soundarya, Sourya, Vantalakka

ఉత్తమ కథలు