హోమ్ /వార్తలు /సినిమా /

Hitler Gari Pellam: ఆ సీరియల్‌లో డాక్టర్ బాబును టార్చర్ చేస్తున్న మోనిత.. మరి ఇంత కక్ష ఎందుకో?

Hitler Gari Pellam: ఆ సీరియల్‌లో డాక్టర్ బాబును టార్చర్ చేస్తున్న మోనిత.. మరి ఇంత కక్ష ఎందుకో?

karthika deepam

karthika deepam

Hitler Gari Pellam: బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఇందులో సాగుతున్న కథ, నటించే నటుల పాత్రలు కూడా బాగా ఆకట్టుకోగా..

Hitler Gari Pellam: బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఇందులో సాగుతున్న కథ, నటించే నటుల పాత్రలు కూడా బాగా ఆకట్టుకోగా.. అందులో దీప, కార్తీక్, మోనిత, సౌందర్యల పాత్రలు ప్రేక్షకులను బాగా మెప్పిస్తుంటాయి. ఇక ప్రస్తుతం కథ ఎలా నడుస్తుందో చూస్తూనే ఉన్నాం. కార్తీక్ కోసం మోనిత ఎంతలా టార్చర్ చేస్తుందో చూస్తున్నాం. కానీ దీప మాత్రం కార్తీక్ ను మోనిత నుండి కాపాడుకోవడానికి తన ప్రయత్నం చేసుకుంటూ పోతుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే మోనిత టార్చర్ కార్తీకదీపం లోనే తట్టుకోలేకపోతుంటే.. మళ్లీ వేరే సీరియల్ లో కూడా తన టార్చర్ మొదలుపెట్టింది.

అదేంటి మోనిత మళ్లీ వేరే సీరియల్ లో డాక్టర్ బాబుని టార్చర్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారా..! మీరు అనుకుంటుంది నిజమే. ఎందుకంటే మోనిత మరో సీరియల్ లో ఎంట్రీ ఇచ్చిన కూడా తన పాత్రను మాత్రం మార్చుకోలేదు. ఇంతకీ ఆ సీరియల్ ఏదో కాదు మన కార్తీక్ బాబు నటిస్తున్న హిట్లర్ గారి పెళ్ళాం. ఈ సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. పైగా రేటింగ్ విషయంలో కూడా టాప్ ఫైవ్ లో ఉంది. ఇక తాజాగా ఈ సీరియల్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలయింది.

ఇక ఈ ప్రోమోలో తమ కుటుంబం మొత్తం గుడిలో శివయ్యకు అభిషేకం చేయడం కోసం కనిపించగా.. అందులో మోనిత పూజారికి ఏదో సైగల్ చేస్తూ కనిపించింది. ఇక పూజారి అమ్మాయి తరపు పెద్దలు శివయ్య కి అభిషేకం చేయాలని 108 బిందెలతో అభిషేకం చేయాలని అంటాడు. ఇక వెంటనే మోనిత మధ్యలో మాట్లాడుతూ ఇద్దరు పెళ్లికి పెద్దలుగా నిలబడ్డారు కాబట్టి ఇద్దరు కలిసి చేయాలి అని కార్తీక్ ను ఈ సీరియల్ లో కూడా టార్చర్ చేస్తుంది. దీంతో ఈ ప్రోమోని చూసిన కార్తీకదీపం అభిమానులు.. కార్తీకదీపంలోనే కాకుండా ఇక్కడ కూడా మా డాక్టర్ బాబును టార్చర్ చేయడానికి తిష్ట వేసావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

First published:

Tags: Hitler gari pellam, Karthika deepam, Nirupam paritala, Shoba shetty

ఉత్తమ కథలు