MONITHA AKA SHOBA SHETTY NEW VIDEO ON VANTALAKKA AKA PREMI VISHWANATH HOME TOUR IN YOUTUBE NR
Vantalakka - Monitha: వంటలక్క ఇంటిని చూపించిన మోనిత.. ఇల్లు ఇంద్ర భవనం అయితే కాదు?
Vantalakka home tour
Vantalakka - Monitha: మన వంటలక్క పేరు వింటే చాలు బుల్లితెర ప్రేక్షకుల ముఖాల్లో ఆ ఆనందమే వేరు. కార్తీకదీపం సీరియల్ తో ప్రేక్షకుల హృదయాలను ఎంతలా దోచుకుందో చూస్తూనే ఉన్నాం
Vantalakka - Monitha: మన వంటలక్క పేరు వింటే చాలు బుల్లితెర ప్రేక్షకుల ముఖాల్లో ఆ ఆనందమే వేరు. కార్తీకదీపం సీరియల్ తో ప్రేక్షకుల హృదయాలను ఎంతలా దోచుకుందో చూస్తూనే ఉన్నాం. ఇందులో మన వంటలక్కకు ఏమైనా జరిగితే అసలు ఊరుకోరు అభిమానులు. వెంటనే కార్తీకదీపం డైరెక్టర్ పై ఓ రేంజ్ లో మండి పడుతుంటారు. ఇక ఆమె గురించి ఏ వార్త వచ్చిన చాలు ఏం జరిగిందా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా మన వంటలక్క హోమ్ టూర్ ను చూపించింది మోనిత.. ఇంకేంటి అభిమానులకు పండగే అనే చెప్పవచ్చు.
అదేంటి మన వంటలక్క, మోనిత బద్ద శత్రువులు కదా.. పైగా మన వంటలక్క భర్తనే కావాలని వెంట పడుతుంది కదా.. అలాంటిది వంటలక్క ఇల్లు ఆమె చూపించడం ఏంటి అనుకుంటున్నారా..? నిజానికి సీరియల్ వరకే వాళ్ళు అలా ఉంటారు. కానీ మిగతా సమయం మంచి స్నేహితులుగా ఉంటారు. అందుకే మన వంటలక్క ఇల్లుని చూపించడానికి ముందుకు వచ్చింది మోనిత. ఇక ఇల్లు అంటే మన వంటలక్క అసలైన ఇల్లు అని ఏవేవో ఊహించుకోకండి. నిజానికి ఆ ఇల్లు శ్రీరామ్ నగర్ బస్తీ లో ఉన్న ఇల్లు.
అదేనండి కార్తీకదీపంలో వంటలక్క వేరే ఇంట్లో ఉంటుంది కదా.. ఆ ఇల్లును చూపిస్తుంది మోనిత. ఇటీవలే మోనిత తన యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అందులో తనకు సంబంధించిన విషయాలను, కార్తీకదీపం సీరియల్ ముచ్చట్లను చూపిస్తుంది. ఇక తాజాగా మన వంటలక్క ఇల్లును హోమ్ టూర్ చేస్తూ.. అందులో డాక్టర్ బాబుని, వంటలక్కను కలిసి వాళ్లతో సరదాగా మాట్లాడుతూ కనిపించింది.
ఇక వంటలక్క ఇంటి బయట ఎలా ఉందో చూపించింది. నిజానికి ఆ ఇల్లు ఇంద్రభవనమేమి కాదనే చెప్పాలి. ఎందుకంటే వంటలక్క అక్కడ మధ్యతరగతి కుటుంబంలా బతుకుతుంది కాబట్టి ఆ ఇల్లు అలా ఉంది. ఇక అందులో మోనిత ఇల్లును చూపిస్తూ.. డాక్టర్ బాబు హాస్పిటల్ ను, తాను గోడపై గీసిన గీతలను, డైనింగ్ టేబుల్ ను అక్కడ హాలులో జరిగిన కొని సన్నివేశాలను చూపించింది. అంతేకాకుండా కొన్ని విషయాలు కూడా పంచుకుంది మోనిత. ప్రస్తుతం మన వంటలక్క ఇల్లును మీరు కూడా ఓసారి చూడవచ్చు. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారింది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.