Home /News /movies /

MONAL SLAMS NETIZEN WHO WISH AKHIL WILL NOT BECOME AS BIGG BOSS 4 WINNER MNJ

Monal Gajjar: అఖిల్ గెలవడు.. నువ్వెవడు డిసైడ్ చేయడానికి అంటూ మోనాల్ ఫైర్

అఖిల్ మోనాల్

అఖిల్ మోనాల్

ఈ సారి బిగ్‌బాస్(Bigg Boss 4) హౌజ్‌లోని జంట ప‌క్షుల్లో అఖిల్(Akhil), మోనాల్(Monal) ఒక‌రు. షోలోకి వెళ్లిన మొద‌ట్లో ఇటు అభిజీత్(Abijeet), అటు అఖిల్ ఇద్ద‌రితో మోనాల్ క్లోజ్‌గా ఉండేది. ఈ ముగ్గురి మ‌ధ్య ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ న‌డిచింది

ఇంకా చదవండి ...
    Monal Gajjar: ఈ సారి బిగ్‌బాస్ హౌజ్‌లోని జంట ప‌క్షుల్లో అఖిల్, మోనాల్ ఒక‌రు. షోలోకి వెళ్లిన మొద‌ట్లో ఇటు అభిజీత్, అటు అఖిల్ ఇద్ద‌రితో మోనాల్ క్లోజ్‌గా ఉండేది. ఈ ముగ్గురి మ‌ధ్య ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ న‌డిచింది. ఈ క్ర‌మంలో మోనాల్ విష‌యంలో అభి, అఖిల్ మధ్య చాలాసార్లు గొడ‌వ‌లు జ‌రిగాయి. ఇక దివి అయితే ఈ విష‌యంలో మోనాల్‌ని ఏకిపారేసింది. ఇద్ద‌రితో ఆడుకోవ‌డం మంచిది కాదంటూ హిత‌వు కూడా ప‌లికింది. అయితే మోనాల్ మాత్రం ఇద్ద‌రితో క్లోజ్‌గా ఉండేది. కానీ ఆ త‌రువాత‌ ఆమె ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌క అభి దూరంగా వెళ్లాడు. అయితే మోనాల్, అఖిల్‌లు మాత్రం చాలా క్లోజ్‌గా ఉండేవారు. (మోనాల్, అఖిల్ రిలేష‌న్‌ని క్యాష్ చేసేందుకే చాలాసార్లు బిగ్‌బాస్ ఆమెను సేవ్ చేశాడ‌నే వార్త‌లు కూడా ఉన్నాయి అది వేరే విష‌యం).

    ఇక మూడు రోజుల క్రితం ఎలిమినేట్ అయిన మోనాల్ బ‌యటికి వ‌చ్చేసింది. దీంతో హౌజ్‌లో అఖిల్ కూడా కాస్త డీలా ప‌డ్డ‌ట్లు క‌నిపిస్తున్నాడు. ఇది ప‌క్క‌న‌పెడితే ఇటీవ‌ల‌ సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో చాట్ చేసింది మోనాల్. ఈ సంద‌ర్భంగా వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆమె స‌మాధానాలు చెప్పింది. అయితే ఆ స‌మ‌యంలో ఓ నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు ఆమె ఫైర్ అయ్యింది. బిగ్‌బాస్ 4 అభిజిత్ విన్ అవ్వాలి. అఖిల్ వ‌ద్దంటూ కామెంట్ పెట్టిన ఓ నెటిజ‌న్‌కి స్పందించిన మోనాల్.. ఎందుకు అలా మాట్లాడుతున్నారు.

    జ‌నాలు డిసైడ్ చేస్తారు క‌దా. సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ ఎందుకు.. ఎవ‌రు విన్ అయినా మంచిదేగా అని స‌మాధానం ఇచ్చింది. ఇక బిగ్‌బాస్ త‌రువాత అఖిల్‌తో ఫ్రెండ్‌షిప్‌ని కంటిన్యూ చేస్తారా అన్న ప్ర‌శ్న‌కు.. క‌చ్చితంగా అత‌డు వ‌దులుకోవాల‌నుకున్నా, నేను వ‌దులుకోను అని వెల్ల‌డించింది. అలాగే అఖిల్ ప్ర‌పోజ్ చేస్తే మీరు ఒప్పుకుంటారా అన్న ప్ర‌శ్న‌కు అంత సినిమా లేద‌ని వివ‌రించింది. ఇక బిగ్‌బాస్ త‌రువాత అఖిల్, తాను క‌లిసి ఒక‌సారి లైవ్‌కి వ‌స్తామ‌ని ఆమె వివ‌రించింది.
    Published by:Manjula S
    First published:

    Tags: Bigg Boss 4 Telugu, Monal gajjar, Tollywood, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు