Monal Akhil: బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ 4 సమరం ముగిసింది. అందరి అంచనాలను నిజం చేస్తూ అభిజీత్ ఈ సీజన్ విన్నర్‌గా నిలిచారు. 25లక్షలతో పాటు బిగ్‌బాస్ 4 ట్రోఫీని సొంతం చేసుకున్నారు. ఇది పక్కనపెడితే ప్రతి సీజన్‌లాగానే ఈ సీజన్ కూడా బిగ్‌బాస్ హౌజ్‌లో ప్రేమాయణాలు జరిగాయి. హౌజ్‌లోకి వెళ్లిన ప్రారంభంలోనే అఖిల్, అభిజీత్, మోనాల్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ మొదలైంది. వీరి రిలేషన్‌పై అప్పట్లో సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ కూడా వచ్చాయి. అయితే మోనాల్ మైండ్‌సెట్ పెద్దగా నచ్చని అభిజీత్.. ఆ తరువాత తరువాత ఆమెకు దూరం అవుతూ వచ్చాడు. కానీ మోనాల్, అఖల్ల మధ్య మాత్రం రిలేషన్ కంటిన్యూ అయ్యింది.
ఇక ఫినాలే వారానికి ముందు వారం మోనాల్ ఎలిమినేట్ అవ్వగా.. హౌజ్‌లో అఖిల్ కూడా ఢీలా పడ్డాడు. మరోవైపు బయటకు వచ్చిన మోనాల్, అఖిల్ కోసం ప్రమోషన్ కూడా చేసింది. అఖిల్ గెలవాలంటూ తన మనసులోని మాటను కూడా చెప్పేసింది. అంతేకాదు బయటికి వచ్చిన తరువాత అఖిల్‌తో ప్రెండ్షిఫ్ కొనసాగాస్తారా..? అన్న ప్రశ్నకు కచ్చితంగా చేస్తాను. అఖిల్ బ్రేక్ అవ్వాలనుకున్నా. నేను అవ్వనివ్వను అంటూ చెప్పేసింది.
అఖిల్, మోనాల్
కాగా బిగ్‌బాస్ 4 హడావిడి ముగిసిన తరువాత మోనాల్, అఖిల్‌తో వీడియో కాల్లో మాట్లాడింది. ఈ సందర్భంగా ఈ ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఆ వీడియో కాల్లో అఖిల్‌పై తన ఇష్టాన్ని చూపించింది మోనాల్. నువ్వు నవ్వితే ఎంత క్యూట్‌గా ఉంటావో అంటూ అఖిల్‌పై ప్రేమను బయటపెట్టింది. దానికి నువ్వు ఈ కథలు ఆపు అంటూ అఖిల్ కూడా సిగ్గుపడ్డాడు.
అఖిల్ మోనాల్ బిగ్ బాస్
ఇక అఖిల్ అన్న పిల్లలు లైవ్‌లో వచ్చి.. మా ఇంటికి ఎప్పుడు వస్తావు అని అడిగారు. దాంతో మీ ఇంటికి వచ్చేందుకు నాకు అడ్రస్ ఎందుకు ఇవ్వలేదు అని మోనాల్, అఖిల్‌ని అడగ్గా.. నువ్వు నన్ను అడగలేదుగా అంటూ సమాధానమిచ్చాడు. ఇక తామిద్దరిని అందరూ గుజరాత్ అమ్మాయి- తెలుగు అబ్బాయి జంట బావుంది అని అంటున్నారని అఖిల్‌కి మోనాల్ చెప్పింది. మొత్తానికి వీరిద్దరి ప్రేమ బిగ్‌బాస్ ముగిసిన తరువాత కూడా కంటిన్యూ అవుతున్నట్లు అర్థమవుతోంది.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.