Home /News /movies /

MONAL GAJJAR QUOTED HUGE REMUNARATION TO DO A ITEM SONG IN ALLUDU ADHURS MHN

Monal Gajjar: మోనాల్‌ ఐటెమ్‌ సాంగ్‌.. షాకింగ్‌ రెమ్యునరేషన్

Monal Gajjar Quoted Huge Remunaration To Do A Item song In Alludu Adhurs

Monal Gajjar Quoted Huge Remunaration To Do A Item song In Alludu Adhurs

Monal Gajjar - Alludu Adhurs: బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా నటిస్తోన్న అల్లుడు అదుర్స్‌ సినిమాలో ఓ ఐటెమ్‌ సాంగ్ చేయడానికి మోనాల్‌ భారీ రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసిందట. ఎంతో తెలుసా..?

    బిగ్‌బాస్‌ సీజన్‌4లో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్నవారిలో హీరోయిన్‌ మోనాల్ గజ్జర్‌ ఒకరు. అప్పటి వరకు ఐదారు సినిమాల్లోనే నటించిన మోనాల్‌ గజ్జర్‌.. బిగ్‌బాస్‌ 4లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ముఖ్యంగా బిగ్‌బాస్‌ విన్నర్‌ అభిజీత్‌, రన్నరప్‌ అఖిల్‌తో మోనాల్‌ నడిపిన లవ్‌ట్రాక్‌ ఆమెకు కావాల్సినంత అటెన్షన్‌ను తెచ్చిపెట్టింది. ఈ కారణంగానే ఎప్పుడో బిగ్‌బాస్‌ హౌస్‌ నుండి బయటకు రావాల్సిన మోనాల్‌ గజ్జర్ ఫైనల్‌ ముందు వరకు హౌస్‌లోనే కొనసాగింది. ఏదైతేనేం బిగ్‌బాస్‌ 4 ముగిసింది. ఫైనల్‌ విజేతలకు, ఎక్కువ అభిమానుల దృష్టిని ఆకర్షించిన వారికి ఇటు సినిమాలు, ఇటు టీవీల్లో అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఆ కోవలో మోనాల్‌ గజ్జర్‌కు చాలా బాగానే అవకాశాలు వస్తున్నాయట. రీసెంట్‌గానే ఓంకార్‌ స్టార్ట్‌ చేసిన డాన్స్‌ ప్లస్‌ షోలో మోనాల్‌ భాగమైంది.

    కాగా.. లేటెస్ట్‌ సమాచారం మేరకు ఇప్పుడు మోనాల్‌ గజ్జర్‌ ఓ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌లో నటిస్తుంది. మూడు నిమిషాల పాటు సాగే ఆ పాటకు మోనాల్‌ కోట్‌ చేసిన రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా? అక్షరాల పదిహేను లక్షలు.. అంత ఇవ్వడానికి కూడా నిర్మాతలు ఓకే చెప్పారట. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు. బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా నటిస్తోన్న అల్లుడు అదుర్స్‌. సంతోశ్‌ శ్రీనివాస్‌ ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నాడు. సినిమాలో ఓ ఐటెమ్‌ సాంగ్‌ కోసం హీరోయిన్స్‌ను తీసుకుంటే వారికి ఎక్కువ రెమ్యునరేషన్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అదే రీసెంట్‌గా బిగ్‌బాస్‌ హౌస్‌ నుండి బయటకు వచ్చిన మోనాల్‌కు అయితే అంతే రేంజ్‌ క్రేజ్‌ ఉంది కాబట్టి ఆమె అడిగిన పదిహేను లక్షల మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అయ్యారట. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ జరుగుతుందని సినీ వర్గాల్లో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

    monal gajjar, bigg boss4, monal, bigg boss monal gajjar, monal gajjar in item song, telugu bigg boss, heroine monal gajjar, monal gajjar in alludu adhurs, bellamkonda srinivas alludu adhurs, అల్లుడు అదుర్స్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌, మోనాల్‌ గజ్జర్, మోనాల్‌ గజ్జర్‌ ఐటెమ్‌ సాంగ్
    Monal Gajjar Quoted Huge Remunaration To Do A Item song In Alludu Adhurs


    సాధారణంగా బెల్లంకొండ శ్రీనివాస్.. తన సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌లో హీరోయిన్స్‌ కలిసి డాన్స్‌ ఇరగదీస్తుంటాడు. ఈసారి కూడా హీరోయిన్‌తోనే డాన్స్‌ చేస్తున్నాడు కానీ.. బిగ్‌బాస్‌ ద్వారా ఫేమ్‌ సంపాదించుకున్న హీరోయిన్‌తో కలిసి డాన్స్‌ చేస్తున్నాడు. మొత్తానికి బిగ్‌బాస్‌ ద్వారా వచ్చిన క్రేజ్‌ను మోనాల్‌ బాగానే క్యాష్‌ చేసుకుంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్న అల్లుడు అదుర్స్‌లో మరోసారి మనం మోనాల్‌ హోయలు చేసేయవచ్చు మరి.
    Published by:Anil
    First published:

    Tags: Alludu Adhurs, Bellamkonda Sreenivas, Bigg Boss, Bigg Boss 4 Telugu, Monal gajjar, Sankranti

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు