Monal Gajjar: మోనాల్ గజ్జర్.. కొద్ది రోజుల ముందు వరకు పెద్దగా తెలియని పేరు. అంతేందుకు అసలు ఈ పేరుతో ఓ హీరోయిన్ ఉందని కూడా చాలా మందికి తెలియదు. ఈమె అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘సుడిగాడు’, ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన రాని గుర్తింపు .. బిగ్‌బాస్ 4 తెలుగుతో పాపులర్ అయింది. ఎప్పుడైతే బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టిందో.. ఇక అప్పటినుండి టాస్కులకంటే కూడా తన అంద చందాలతోనే ఎక్కువగా అలరించింది. ముఖ్యంగా మోనాల్ ముందుగా అభిజిత్‌తో సన్నిహితంగా ఉండటం.. ఆ తర్వాత అఖిల్‌తో క్లోజ్‌గా మూవ్ కావడం వల్లే అఖిల్, అభిజిత్ గొడవ పడ్డారు. ఈ సీజన్‌కు హైలెట్‌గా నిలిచాయి. బిగ్‌బాస్ 4వ సీజన్‌లో ఎక్కవ ఎపిసోడ్లు ఈ ముగ్గురి మధ్యే జరిగింది. ముఖ్యంగా బిగ్‌బాస్ హౌస్‌లో అఖిల్, మోనాల్‌ల మధ్య రిలేషన్ ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేసింది.
ఇక హౌస్ నుండి బయటకు వెళ్లిన తర్వాత ఈ బ్యూటీ వరుసగా క్రేజీ ఆఫర్స్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే ‘అల్లుడు అదుర్స్‌లో ఐటెం సాంగ్‌తో అదరగొట్టింది. అంతేకాదు ఓంకార్ నిర్వహించే డాన్స్‌కు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ భామ అహ్మదబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఈమెకు ఊహించని షాక్ తగిలిందట. ఎయిర్‌పోర్ట్‌లో మోనాల్‌ను చూసి కొంత మంది అఖిల్ ఎలా ఉన్నాడని గట్టిగా అరచరట. అలా కొంత మంది తనను చూసి అరవడంతో తాను ఎంతో ఇబ్బందిగా ఫీలైనట్టు చెప్పుకొచ్చింది. తాజాగా ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ.. ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది.
మరోవైపు హైదరబాద్‌కు అహ్మదాబాద్‌కు వచ్చినపుడు ఎయిర్‌పోర్ట్‌లో తనను చూసి ప్రజలు గుర్తు పట్టడాన్ని మాత్రం హ్యాపీగా ఉందన్నారు. కానీ చాలా మంది మాత్రం నన్ను అఖిల్ గురించి అడుగుతున్నారు. అది మాత్రమే తనను ఎక్కువ బాధిస్తోందని చెప్పింది. మేమిద్దరం హౌస్‌లో కొంచెం క్లోజ్‌గా ఉన్నాము. అఖిల్ వాళ్ల ఇంట్లో ఉంటాడు. నాతో ఎందుకు ఉంటాడు. ఇంకోసారి ఎవరు అఖిల్ విషయం తన దగ్గర అడగొద్దని తన మనసులోని బాధను బయటపెట్టింది. అయితే.. మోనాల్‌కు వరుసగా అవకాశాలు రావడంతో ఈమె ఇక్కడే ఇళ్లు కొనుక్కొని సెటిల్ కావాలనే ఆలోచనలో ఉంది. ఇప్పటికే ఈమె ఓ ఇంటిని కూడా కొనుగోలు కూడా చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg Boss 4 Telugu, Monal gajjar, Tollywood