Home /News /movies /

Mollywood Controversy: సినిమా టైటిల్స్ తెచ్చిన వివాదం.. మాలీవుడ్ సినిమాల్లో మతం ప్రస్తావన లేదా? ఆందోళన చేస్తుంది ఎవరు?

Mollywood Controversy: సినిమా టైటిల్స్ తెచ్చిన వివాదం.. మాలీవుడ్ సినిమాల్లో మతం ప్రస్తావన లేదా? ఆందోళన చేస్తుంది ఎవరు?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

నాదిర్‍షా తన సినిమాకి ఈషో అనే టైటిల్ తో పాటు "బైబిల్ నుంచి వచ్చిన కథ కాదు" అని ట్యాగ్‌లైన్‌ను జోడించారు. దీంతో తాము ఆరాధించే క్రీస్తు పేరును సినిమా టైటిల్‌గా పెట్టి తమ మనోభావాలను దెబ్బతీస్తున్నారని కేరళ క్రైస్తవుల్లోని ఒక వర్గం వారు దర్శకుడిపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇంకా చదవండి ...
మలయాళ సినిమా ఇండస్ట్రీ అయిన మాలీవుడ్‌లో ప్రస్తుతం సినిమా టైటిల్స్‌పై వివాదాలు వార్తల్లో నిలుస్తున్నాయి. 'అమర్, అక్బర్, ఆంటోనీ', 'మేరా నామ్ షాజీ' వంటి సినిమాలు తెరకెక్కించి మంచి గుర్తింపు దక్కించుకున్న ప్రముఖ డైరెక్టర్ నాదిర్‍షా ఈ వివాదాలకు కేంద్ర బింధువుగా ఉన్నారు. ఆయన తెరకెక్కిస్తున్న రెండు మలయాళ సినిమాల పేర్లు కాంట్రవర్సికి కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. క్రైస్తవుల్లోని ఒక వర్గం ప్రజలు ఈ సినిమాల టైటిల్స్ తమ మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నాదిర్‍షా తన సినిమాకి ఈషో అనే టైటిల్ తో పాటు "బైబిల్ నుంచి వచ్చిన కథ కాదు" అని ట్యాగ్‌లైన్‌ను జోడించారు. దీంతో తాము ఆరాధించే క్రీస్తు పేరును సినిమా టైటిల్‌గా పెట్టి తమ మనోభావాలను దెబ్బతీస్తున్నారని కేరళ క్రైస్తవుల్లోని ఒక వర్గం వారు దర్శకుడిపై విమర్శలు గుప్పిస్తున్నారు. నాదిర్‍షా తీస్తున్న మరొక సినిమా 'కేషు ఈ వీడింటే నాథన్' టైటిల్ కూడా వివాదానికి దారితీసింది. దీనిపై కేరళలోని సిరో మలబార్‌ కాథలిక్కుల సంఘమైన ఆల్ కేరళ కాథలిక్ కాంగ్రెస్ (ఏకేసీసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. మూవీ టైటిల్ పట్ల నిరసనను తెలియజేయడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ కి పిలుపునిచ్చింది. క్రైస్తవులకు 'ఈషో' అనే ఒకేఒక దేవుడు ఉన్నాడని.. ఆ పేరుతో సినిమా తీయడం అంగీకరించదగిన విషయం కాదని ఏకేసీసీ హెచ్చరించింది.

క్రైస్తవులు వారి ఇంటి గుమ్మాల వద్ద 'యేసు ఈ వీడింటే నాథన్' అనే పేరుతో బిల్‌బోర్డ్‌లు పెడతారని.. ఈ పేరులో కేషు అనే పదం జోడించి సినిమా టైటిల్ గా పెట్టడం ఏమాత్రం బాగోలేదని ఏకేసీసీ కమిటీ మెంబర్ జోసెఫ్ అన్నారు. సినిమాలో మంచి కంటెంట్ ఉన్నప్పటికీ, 'ఈషో' అనే పేరును ఉపయోగించరాదని ఏకేసీసీ నాయకులు సూచించారు. కేరళ మాజీ ఎమ్మెల్యే పి.సి.జార్జ్ కూడా 'ఈషో' అనే మూవీ టైటిల్ ని తప్పుపట్టారు. నాదిర్‍షా లాంటి వ్యక్తి ఇలా చేయడం బాధ కలిగిస్తోందని ఆయన అన్నారు. ఇది ఈనాటి సమస్య కాదని.. కొందరు చిత్రనిర్మాతలు పనిగట్టుకొని మరీ క్రైస్తవ సమాజాన్ని అవమానించాలనే తాపత్రయంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారని చెప్పారు.

అయితే విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ నాదిర్‍షాకు ఆర్థోడాక్స్ చర్చి నుంచి మద్దతు లభించింది. త్రిసూర్ డియోసెస్ మెట్రోపాలిటన్ యుహనాన్ మార్ మెలేటియస్ చెందిన చర్చి ఫేస్‌బుక్ పోస్ట్‌లో నాదిర్‍షాకు మద్దతు పలికింది. "సినిమాకి 'ఈషో' అని పేరు పెట్టడంలో తప్పేముంది? నా బంధువుతో సహా సెంట్రల్ ట్రావెన్‌కోర్‌లో చాలా మందికి ఈషో అని పేర్లు ఉన్నాయి. ఇప్పటివరకు వారెవరినీ పేరు మార్చుకోమని చెప్పలేదు. కొందరు క్రైస్తవులు జీసెస్‌ను 'ఈషో' అని పిలుస్తారు. ఇతరులు 'యేసు' అని పిలుస్తారు. ఈ పేరు మరెక్కడా రాకూడదని ఎవరైనా చెబుతారా?" అని విమర్శకులను సూటిగా ప్రశ్నించింది.

ఇకపోతే లిజో జోస్ పెల్లిస్సేరి తెరకెక్కించిన 'ఈ.మా.యౌ' టైటిల్ లో కూడా ఈషో అనే పేరు వాడారు. పెల్లిస్సేరి ఎంచుకున్న ఈ 'ఈశో.మరియం. ఔస్సెఫ్' సినిమా పేరుకు.. జీసెస్, మేరీ, జోసెఫ్‌లకు మలయాళంలో చెప్పే గౌరవనీయమైన అభివందనం అని అర్థం. అయితే ఈ సినిమా టైటిల్ పై ఎటువంటి వివాదాలు రేకెత్తలేదు.
Published by:Krishna Adithya
First published:

Tags: Malayalam

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు