Sai Dharam Tej Accident: టాలీవుడ్ యంగ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రస్తుతం వార్తలు బాగా వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 10 శుక్రవారం రోజున హైదరాబాద్ నగరంలోని కేబుల్ బ్రిడ్జ్ - ఐకియా సమీపంలో తన స్పోర్ట్స్ బైక్ పై ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు అవ్వడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. వెంటనే నగరంలో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లగా ఆయనకు చికిత్స అందించారు. ఇక ప్రస్తుతం సాయి తేజ్ హాస్పిటల్ లో ఉంటూ చికిత్స పొందుతున్నాడు.
ఇక ప్రమాదం జరిగిన రోజు నుంచి ఈ ప్రమాదం ఎలా జరిగిందో అని తెగ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సాయి ధరమ్ తేజ్ వేగంతో రావడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని కొందరు అనగా.. లేదు రోడ్డుపై ఇసుక ఉండటం వల్ల జారిపడ్డాడు అంటూ మరికొందరు అంటున్నారు. ఇక ఈ విషయాలతో పాటు మరో విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది. సాయి ధరమ్ తేజ్ కు ప్రమాదం జరిగిన రోజు అక్కడ మహమ్మద్ ఫర్హాన్ అనే యువకుడు ఉండటంతో సాయి ధరమ్ తేజ్ ను కాపాడడానికి ముందుకు వచ్చాడు.
ఇటీవలే మహమ్మద్ ఓ మీడియాకు ప్రమాదం జరిగిన రోజు ఏం జరిగిందో పూర్తిగా వివరించాడు. ఆ సమయంలో సాయి ధరమ్ తేజ్ ఫోన్ తీసి చూశానని కానీ లాక్ ఉండటంతో ఎవరికీ ఫోన్ చేయలేకపోయా అంటూ వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేశానని తెలిపాడు. దీంతో మహమ్మద్ చేసిన సహాయానికి నెటిజన్లు ఆయనను పొగుడుతున్నారు. ఇక మరోవైపు మరో వార్త వైరల్ గా మారింది.
అందులో మెగా ఫ్యామిలీ ఆయనను అభినందించింది అంటూ అంతేకాకుండా ఆయనకు మెగా హీరో రామ్ చరణ్ తన బావ సాయి తేజ్ ను కాపాడినందుకు ఒక ఖరీదైన కారును స్వయంగా తన చేతుల మీదనే బహుమతిగా ఇచ్చాడు అంటూ బాగా పుకార్లు వినిపించాయి. దీంతో ఈ విషయం గురించి మహమ్మద్ మాట్లాడుతూ.. ఇందులో ఎటువంటి నిజం లేదని.. ఎవరు నాకు ఎటువంటి బహుమతి ఇవ్వలేదు అంటూ తెలిపాడు. అంతేకాకుండా మెగా ఫ్యామిలీ నుండి తనకు ఎవరు ఫోన్ చేయలేదని.. కేవలం సాటి వ్యక్తి గా ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడాను.. కానీ ఎటువంటిది ఆశించలేదు అంటూ ఇటువంటి తప్పుడు వార్తలతో తమ కుటుంబం ఇబ్బందులు పడుతుందని.. దయచేసి ఇటువంటి పుకార్లను సృష్టించవద్దు అని తెలిపాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mohmad farhan, Ram charan gifts car, Sai Dharam Tej, Social Media, Tollywood