హోమ్ /వార్తలు /సినిమా /

Drishyam - Mohanlal: ఇంటర్నేషనల్ లాంగ్వెజెస్‌లో మోహన్‌లాల్ ‘దృశ్యం’ సినిమాలు..

Drishyam - Mohanlal: ఇంటర్నేషనల్ లాంగ్వెజెస్‌లో మోహన్‌లాల్ ‘దృశ్యం’ సినిమాలు..

ఇంటర్నేషనల్ భాషల్లో  మోహన్‌లాల్ ‘దృశ్యం’ మూవీ (Twitter/Photo)

ఇంటర్నేషనల్ భాషల్లో మోహన్‌లాల్ ‘దృశ్యం’ మూవీ (Twitter/Photo)

Mohanlal - Drishyam Movies in : మోహన్‌లాల్, మీనా హీరో, హీరోయిన్లుగా నటించిన ‘దృశ్యం’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలుసు కదా. భారతీయ భాషల్లో హిట్టైన ఈ సినిమాను ఇంటర్నేషనల్ లెవల్లో వివిధ భాషల్లో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Mohanlal - Drishyam Movies in : మోహన్‌లాల్, మీనా (Meena) హీరో, హీరోయిన్లుగా నటించిన ‘దృశ్యం’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలుసు కదా. ఆ తర్వాత దృశ్యం సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, హిందీల రీమేక్ చేస్తే అక్కడ ఈ సినిమా సక్సెస్ సాధించింది. ఎనిమిదేళ్ల  క్రితం మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెప్ (Jeethu Joseph) కలయికలో మ‌ల‌యాళంలో విడుద‌లై సెన్సేష‌న‌ల్ హిట్ అయిన ‘దృశ్యం’.  ఈ సినిమాను తెలుగులో వెంకటేష్ (Venkatesh).. అదే ‘దృశ్యం’ టైటిల్‌తో రీమేక్ చేసి మరో హిట్ అందుకున్నారు. అటు బాలీవుడ్‌లో కూడా అజయ్ దేవ్‌గణ్ (Ajay Devgn),  కన్నడలో రవిచంద్రన్ (Ravi Chandran) కూడా అదే రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు. మరోవైపు లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ‘పాపనాశనం’టైటిల్‌తో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు. దాదాపు రీమేక్ అయిన అన్ని భాషల్లో హిట్టైన అతి కొద్ది సినిమాల్లో ‘దృశ్యం’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది.

ఇపుడు ఆ సినిమాకు కొనసాగింపుగా.. అదే కాంబినేషన్‌లో ‘దృశ్యం 2’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను చూసి క్రిటిక్స్‌తో పాటు మిగతా భాషల దర్శకులు రాజమౌళి సహా చాలా మంది ఈ సినిమాను చూసి మెచ్చుకున్నారు. కోవిడ్ కారణంగా ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేసారు. తెలుగులో వెంకటేష్ కూడా ఇదే ‘దృశ్యం 2’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక హిందీలో అజయ్ దేవ్‌గణ్, శ్రియ (Shirya) హీరో, హీరోయిన్లుగా దృశ్యం 2 సినిమాను హిందీలో థియేట్రికల్‌గా రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడ ఈ సినిమా దాదాపు రూ. 300 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ సినిమాను మిగిలిన భారతీయ భాషల్లో రీమేక్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు పనోరమా వాళ్లు అధికారిక ప్రకటన చేశారు. దృశ్యం సినిమాలను ఇంగ్లీష్‌తో పాటు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్‌లో రీమేక్ చేయనున్నట్టు చెప్పారు.

చైనీస్(Chinese), కొరియన్(Koriyan), జపాన్‌ (Japan) భాషలకు సంబంధించిన చర్చలు జరుపుతున్నాం. అనుకోకుండా ఓ హత్య చుట్టు సాగే కుటుంబ నేపథ్యంలో దృశ్యం చిత్రాలు తెరకెక్కాయి. దాదాపు భారతీయ భాషల్లో హిట్టైన ఈ సినిమాలు ఇంటర్నేషనల్ లెవల్లో ఏ మేరకు సత్తాచూపిస్తాయనేది చూడాలి.

First published:

Tags: Ajay Devgn, Bollywood news, Malluwood, Mohanlal, Tollywood, Venkatesh

ఉత్తమ కథలు