Home /News /movies /

Mohanlal - Marakkar : మోహన్‌లాల్ ‘మరక్కార్’ విడుదల తేది ఖరారు.. ఓటీటీలో కాకుండా నేరుగా థియేటర్స్‌లో వస్తోన్న అరేబియా సముద్ర సింహం..

Mohanlal - Marakkar : మోహన్‌లాల్ ‘మరక్కార్’ విడుదల తేది ఖరారు.. ఓటీటీలో కాకుండా నేరుగా థియేటర్స్‌లో వస్తోన్న అరేబియా సముద్ర సింహం..

మోహన్‌లాల్ ‘మరక్కర్’ విడుదల తేది ఖరారు (Twitte/Photo)

మోహన్‌లాల్ ‘మరక్కర్’ విడుదల తేది ఖరారు (Twitte/Photo)

Mohanlal - Marakkar Release Date | భారతదేశం గర్వించదగ్గ నటుల్లో మోహన్ లాల్‌కు సెపరేట్ ప్లేస్ వుంది. తాజాగా మోహన్‌లాల్ నటించిన భారీ పీరియాడికల్ మూవీ జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘మరక్కర్’ చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇంకా చదవండి ...
    Mohanlal - Marakkar Release Date | భారతదేశం గర్వించదగ్గ నటుల్లో మోహన్ లాల్‌కు సెపరేట్ ప్లేస్ వుంది. ఒక వైపు ఆయన సొంత భాషలో కమర్షియల్ సినిమాల్లో యాక్ట్ చేస్తూనే...మరోవైపు కళాత్మక సినిమాలతో ఆయనలో ఉన్న నటున్ని ఎలివేట్ చేసుకుంటూ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా ఎదిగారు. మోహన్‌లాల్ యాక్టింగ్ టాలెంట్ ఒక్క మలయాళ భాషకే పరిమితం కాలేదు. తమిళం, కన్నడ,తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ ఆయా భాషల్లో ఉన్న ప్రేక్షకుల మనసులు దోచారు.  ఈయన హీరోగా నటించిన చారిత్రక సినిమా ‘మరక్కర్’.  మోహన్‌లాల్.. హీరోగా నటించిన ఈ సినిమా రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. అంతేకాదు ఈ సినిమాలో ఆద్యంతం భారీ గ్రాఫిక్స్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలవనున్నాయి.

    ఈ సినిమాలో మోహన్‌లాల్‌తో పాటు ఆయన తనయుడు ప్రణవ్ మోహన్‌లాల్ నటిస్తున్నారు. మరోవైపు యాక్షన్ కింగ్ అర్జున్, సునీల్ శెట్టి, ప్రభు, సిద్దిక్, కీర్తి సురేష్, మంజు వారియర్, కళ్యాణి ప్రియదర్శన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మోహన్‌లాల్ ప్రాణ మిత్రుడు ప్రియదర్శన్ డైరెక్ట్ చేసారు.

    BalaKrishna - Nani : నందమూరి బాలకృష్ణకు నాని మధ్య ఉన్న ఈ అనుబంధం తెలుసా..

    ఈ సినిమా విడుదలకు ముందే 67వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ చిత్రంతో పాటు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్‌తో పాటు స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డులు కొల్లగొట్టి సంచలనం రేపింది. మోహన్‌లాల్ చివరగా ‘దృశ్యం 2’ సినిమాతో పలకరించారు. ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా డైరెక్ట్‌గా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేసారు.

    Chiranjeevi : చిరంజీవితో సాయి ధరమ్ తేజ్ వాళ్ల నాన్న నిర్మించిన ఈ సినిమా తెలుసా..

    అక్కడ సూపర్ హిట్ రావడంతో ఈ సినిమాను ఇపుడు పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘మరక్కర్’ సినిమా విషయానికొస్తే.. అరేబియన్ సముద్రానికి లయన్‌గా పిలవబడే మరక్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాపై మలయాళ ప్రేక్షకులతో పాటు ప్యాన్ ఇండియా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    NTR - Raghavendra Rao: అన్న ఎన్టీఆర్, రాఘవేంద్రరావు టాలీవుడ్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్..


    ఈ సినిమాను ముందుగా థియేటర్స్‌లో కాకుండా నేరుగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ తాజాగా ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో నేరుగా థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించడమే కాదు.. విడుదల తేదిని ప్రకటించారు.



    ‘మరక్కర్’ అరేబియా సముద్ర సింహం సినిమాను డిసెంబర్ 2న విడుదల చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. ముందుగా ఈ చిత్రాన్ని 2020 మార్చిలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అపుడు కరోనా విజృంభనతో ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. ఆ తర్వాత ఈ యేడాది ఆగష్టు 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

    Chiranjeevi - Bhola Shankar : భోళా శంకర్ విషయంలో తమన్నాకు బిగ్ షాక్ ఇచ్చిన చిరంజీవి.. అంతా కీర్తి సురేష్ వల్లే..


    కానీ కుదరలేదు. తాజాగా ఇపుడు డిసెంబర్ 2న ఈ సినిమా థియేటర్స్‌లో ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల  కానుంది. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి తెరకెక్కించిన ‘మరక్కర్’ అరేబియా సముద్ర సింహం సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Malluwood, Marakkar, Mohanlal, Priyadarshan, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు