• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • MOHANLAL MARAKKAR LION OF THE ARABIAN SEA RELEASE DATE 12 AUGUST 2021 A GRAND EPIC OF INDIAN HISTORY TA

Mohanlal: మాట మీద నిలబడ్డ మోహన్‌లాల్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..

మోహన్‌లాల్ ‘మరక్కర్’ మూవీ (Twitter/Photo)

Mohanlal: మాట మీద నిలబడ్డ మోహన్‌లాల్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్ వివరాల్లోకి వెళితే..

  • Share this:
    Mohanlal: మాట మీద నిలబడ్డ మోహన్‌లాల్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్ వివరాల్లోకి వెళితే.. కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘మరక్కర్’ మూవినీ ముందుగా చెప్పినట్టే ఆగష్టు 12న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మోహన్‌లాల్.. హీరోగా నటించిన ఈ సినిమా రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. అంతేకాదు ఈ సినిమాలో ఆద్యంతం భారీ గ్రాఫిక్స్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలవనున్నాయి. ఈ సినిమాలో మోహన్‌లాల్‌తో పాటు ఆయన తనయుడు ప్రణవ్ మోహన్‌లాల్ నటిస్తున్నారు. మరోవైపు యాక్షన్ కింగ్ అర్జున్, సునీల్ శెట్టి, ప్రభు, సిద్దిక్, కీర్తి సురేష్, మంజు వారియర్, కళ్యాణి ప్రియదర్శన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మోహన్‌లాల్ ప్రాణ మిత్రుడు ప్రియదర్శన్ డైరెక్ట్ చేసారు.

    ఈ సినిమా విడుదలకు ముందే 67వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ చిత్రంతో పాటు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్‌తో పాటు స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డులు కొల్లగొట్టి సంచలనం రేపింది. మోహన్‌లాల్ చివరగా ‘దృశ్యం 2’ సినిమాతో పలకరించారు. ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా డైరెక్ట్‌గా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేసారు. అక్కడ సూపర్ హిట్ రావడంతో ఈ సినిమాను ఇపుడు పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘మరక్కర్’ సినిమా విషయానికొస్తే.. అరేబియన్ సముద్రానికి లయన్‌గా పిలవబడే మరక్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాపై మలయాళ ప్రేక్షకులతో పాటు ప్యాన్ ఇండియా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


    ఆగష్టు 12న ’మరక్కార్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించినా.. కరోనా కారణంగా ఈ సినిమా విడుదలపై అనుమానాలు ఉండే. అయితే.. కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇపుడు ముందుగా పర్కటించినా.. ఆగష్టు 12న విడుదల చేస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: