Home /News /movies /

MOHANLAL DRISHYAM 2 MOVIE CREATES ANOTHER SENSATION RECORD HERE ARE THE DETAILS TA

Mohanlal - Drishyam 2: మోహన్‌లాల్ ‘దృశ్యం 2’ మరో అరుదైన రికార్డు..

మోహన్‌లాల్ ‘దృశ్యం2’ మరో అరుదైన రికార్డు (Twitter/Photo)

మోహన్‌లాల్ ‘దృశ్యం2’ మరో అరుదైన రికార్డు (Twitter/Photo)

Mohanlal - Drishyam 2: మోహన్‌లాల్ ‘దృశ్యం 2’ మరో అరుదైన రికార్డు సాధించింది. వివరాల్లోకి వెళితే.

    Mohanlal - Drishyam 2: మోహన్‌లాల్ ‘దృశ్యం 2’ మరో అరుదైన రికార్డు సాధించింది. వివరాల్లోకి వెళితే.. మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ హీరోగా జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘దృశ్యం 2’. ఆరేళ్ల  క్రితం వీరి కలయికలో మ‌ల‌యాళంలో విడుద‌లై సెన్సేష‌న‌ల్ హిట్ అయిన ‘దృశ్యం’కు ఇది సీక్వెల్‌. ఈ సినిమాను తెలుగులో వెంకటేష్.. అదే ‘దృశ్యం’ టైటిల్‌తో రీమేక్ చేసి మరో హిట్ అందుకున్నారు. అటు బాలీవుడ్‌లో కూడా అజయ్ దేవ్‌గణ్,  కన్నడలో రవిచంద్రన్ కూడా అదే రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు. మరోవైపు లోకనాయకుడు కమల్ హాసన్ ‘పాపనాశనం’టైటిల్‌తో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు. దాదాపు రీమేక్ అయిన అన్ని భాషల్లో హిట్టైన అతి కొద్ది సినిమాల్లో ‘దృశ్యం’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది.

    ఇపుడు ఆ సినిమాకు కొనసాగింపుగా.. అదే కాంబినేషన్‌లో ‘దృశ్యం 2’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను చూసి క్రిటిక్స్‌తో పాటు మిగతా భాషల దర్శకులు రాజమౌళి సహా చాలా మంది ఈ సినిమాను చూసి మెచ్చుకున్నారు. కోవిడ్ కారణంగా ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేసారు.

    మోహన్‌లాల్ ‘దృశ్యం 2’ అరుదైన రికార్డు (Twitter/Photo)


    ఇక తెలుగులో వెంకటేష్.. ఎలాంటి ఆలస్యం చేయకుండా.. వెంటనే.. అదే జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఈ సినిమాను షూటింగ్ స్టార్ట్ చేయడమే కాకుండా.. ఈ సినిమాను కంప్లీట్ చేసారు. ఈ సినిమాను కూడా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాత సురేష్ బాబు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక వివిధ భాషల్లో ‘దృశ్యం 2’ రీమేక్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. ఇక సంచలనాలకు వేదికగా నిలిచిన ‘దృశ్యం 2’ ఈ యేడాది ఇప్పటి వరకు విడుదలైన చిత్రాల్లో IMDB 8.8 రేటింగ్ వచ్చింది. 94% ప్రజలు ఈ సినిమాను లైక్ చేసారు. ముందు ముందు ఈ సినిమా రికార్డును వేరే వాళ్లు ఎవరైనా బీట్ చేస్తారా లేదా అనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Drishyam 2, Malluwood, Mohanlal, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు