రాజ‌కీయాల్లోకి మోహ‌న్ లాల్.. సూప‌ర్ స్టార్ దుమ్ము లేపేస్తున్నాడుగా..

స్టార్ హీరోలంతా ఇప్పుడు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు. ఓ వైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్.. మ‌రోవైపు ర‌జినీకాంత్.. ఇంకోవైపు క‌మ‌ల్ హాస‌న్ ఇలా అంతా ఇప్పుడు రాజ‌కీయాల్లోనే ఉన్నారు. ఇక ఇప్పుడు మోహ‌న్ లాల్ కూడా రాజ‌కీయాలు చేస్తున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 5, 2019, 3:05 PM IST
రాజ‌కీయాల్లోకి మోహ‌న్ లాల్.. సూప‌ర్ స్టార్ దుమ్ము లేపేస్తున్నాడుగా..
మోహన్ లాల్ (ఫైల్ ఫోటో)
  • Share this:
స్టార్ హీరోలంతా ఇప్పుడు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు. ఓ వైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్.. మ‌రోవైపు ర‌జినీకాంత్.. ఇంకోవైపు క‌మ‌ల్ హాస‌న్ ఇలా అంతా ఇప్పుడు రాజ‌కీయాల్లోనే ఉన్నారు. ఇక ఇప్పుడు మోహ‌న్ లాల్ కూడా రాజ‌కీయాలు చేస్తున్నాడు. కాక‌పోతే వాళ్లంతా రియ‌ల్ లైఫ్ రాజ‌కీయాలు చేస్తుంటే ఈయ‌న మాత్రం రీల్ లైఫ్ రాజ‌కీయాలు చేస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది హీరోలు పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలే ఎక్కువ‌గా చేస్తున్నారు. ఇప్పుడు మోహ‌న్ లాల్ కూడా ఇదే చేసాడు. ఈయ‌న న‌టించిన లూసీఫ‌ర్ ఇప్పుడు కేర‌ళ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అద్భుతాలు చేస్తుంది.

Mohanlal blockbuster malayalam movie Lucifer to release in telugu and Trailer impressive pk.. స్టార్ హీరోలంతా ఇప్పుడు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు. ఓ వైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్.. మ‌రోవైపు ర‌జినీకాంత్.. ఇంకోవైపు క‌మ‌ల్ హాస‌న్ ఇలా అంతా ఇప్పుడు రాజ‌కీయాల్లోనే ఉన్నారు. ఇక ఇప్పుడు మోహ‌న్ లాల్ కూడా రాజ‌కీయాలు చేస్తున్నాడు. lucifer movie review,lucifer movie collections,lucifer movie mohanlal,lucifer telugu trailer,lucifer blockbuster,lucifer mohanlal politics,mohanlal politics,telugu cinema,మోహన్ లాల్,మోహన్ లాల్ లూసిఫర్,మోహన్ లాల్ పొలిటికల్ సినిమా,మోహన్ లాల్ రాజకీయాలు,తెలుగు సినిమా
మోహన్ లాల్ ఫైల్ ఫోటో


వారం రోజుల కింద విడుద‌లైన ఈ చిత్రం అక్క‌డ రికార్డులు తిర‌గ‌రాస్తుంది. పృథ్విరాజ్ సుకుమార‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో కూడా విడుద‌ల చేయ‌బోతున్నారు. తాజాగా ట్రైల‌ర్ విడుద‌లైంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ తెలుగులో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తుండ‌టం విశేషం. జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత వ‌ర‌స‌గా మోహ‌న్ లాల్ సినిమాలు తెలుగులో వ‌స్తున్నాయి. మ‌న్యం పులి లాంటి సినిమాలు ఇక్క‌డ విజ‌యం కూడా సాధించాయి. దాంతో వ‌ర‌స సినిమాలు వ‌స్తూనే ఉన్నాయి.. ఇంకా వ‌స్తుంటాయి కూడా.
ఇక ఇప్పుడు లూసీఫ‌ర్ కూడా పూర్తిగా రాజ‌కీయ నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమా. చెడుకు చెడుకు మ‌ధ్య జ‌రిగే పోరాట‌మే ఈ చిత్రం. ఓ పార్టీ అధినేత చ‌నిపోయిన త‌ర్వాత వార‌స‌త్వం కోసం పోటీ ప‌డే వార‌సుల క‌థే ఈ చిత్రం. మ‌ళ‌యాలంలో సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో తెలుగులో కూడా ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. పైగా ట్రైల‌ర్ కూడా ఆసక్తిక‌రంగానే ఉంది. మ‌రి మోహ‌న్ లాల్ రాజ‌కీయాలు తెలుగులో ఎంత‌వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతాయో చూడాలి.
First published: April 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>