Home /News /movies /

Mohanlal - Marakkar : మోహన్‌లాల్ ‘మరక్కార్’ ట్రైలర్ విడుదల.. వెండితెరపై మరో విజువల్ వండర్‌..

Mohanlal - Marakkar : మోహన్‌లాల్ ‘మరక్కార్’ ట్రైలర్ విడుదల.. వెండితెరపై మరో విజువల్ వండర్‌..

మోహన్‌లాల్ ‘మరక్కార్’ మూవీ ట్రైలర్ విడుదల (Twitter/Photo)

మోహన్‌లాల్ ‘మరక్కార్’ మూవీ ట్రైలర్ విడుదల (Twitter/Photo)

Mohanlal - Marakkar Release Date | భారతదేశం గర్వించదగ్గ నటుల్లో మోహన్ లాల్‌కు సెపరేట్ ప్లేస్ వుంది. ఆయన నటించిన చిత్రం ‘మరక్కార్’. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

    Mohanlal - Marakkar Release Date | భారతదేశం గర్వించదగ్గ నటుల్లో మోహన్ లాల్‌కు సెపరేట్ ప్లేస్ వుంది. ఒక వైపు ఆయన సొంత భాషలో కమర్షియల్ సినిమాల్లో యాక్ట్ చేస్తూనే...మరోవైపు కళాత్మక సినిమాలతో ఆయనలో ఉన్న నటున్ని ఎలివేట్ చేసుకుంటూ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా ఎదిగారు. మోహన్‌లాల్ యాక్టింగ్ టాలెంట్ ఒక్క మలయాళ భాషకే పరిమితం కాలేదు. తమిళం, కన్నడ,తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ ఆయా భాషల్లో ఉన్న ప్రేక్షకుల మనసులు దోచారు.  ఈయన హీరోగా నటించిన చారిత్రక సినిమా ‘మరక్కర్’.  మోహన్‌లాల్.. హీరోగా నటించిన ఈ సినిమా రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. అంతేకాదు ఈ సినిమాలో ఆద్యంతం భారీ గ్రాఫిక్స్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలవనున్నాయి.

    తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ మొత్తం విజువల్ వండర్‌గా ఉన్నాయి. ఈ సినిమాలో కుంజాలి మరక్కార్ IV (మహమ్మద్) పాత్రలో నటించారు. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, సునీల్ శెట్టి, ప్రభు, సిద్దిక్, కీర్తి సురేష్, మంజు వారియర్, కళ్యాణి ప్రియదర్శన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను మోహన్‌లాల్ ప్రాణ మిత్రుడు ప్రియదర్శన్ డైరెక్ట్ చేసారు.


    ఈ సినిమా విడుదలకు ముందే 67వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో  జాతీయ ఉత్తమ చిత్రంతో పాటు బెస్ట్ కాస్ట్యూమ్స్ డిజైన్స్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నేషనల్ అవార్డ్స్ వరించాయి. దాంతో పాటు 50వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్‌లో భాగంగా బెస్ట్ కొరియోగ్రాఫీ, బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో స్పెషల్ జ్యూరీ అవార్డు కైవసం చేసుకుంది.

    ఇద్దరం కలిసి అది తాగుదాం.. సీతారామశాస్త్రికి రామ్ గోపాల్ వర్మ విభిన్న నివాళి..

    ఈ సినిమాలో మోహన్‌లాల్‌తో పాటు ఆయన తనయుడు ప్రణవ్ మోహన్‌లాల్ నటించారు. ‘మరక్కర్’ అరేబియా సముద్ర సింహం సినిమాను డిసెంబర్ 2న విడుదల చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. తెలుగులో మాత్రం డిసెంబర్ 3న రిలీజైవుతోంది.  ముందుగా ఈ చిత్రాన్ని 2020 మార్చిలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అపుడు కరోనా విజృంభనతో ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. ఆ తర్వాత ఈ యేడాది ఆగష్టు 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.కానీ కుదరలేదు.

    సీతారామశాస్త్రి మరణంపై ఉప రాష్ట్రపతి, ప్రధాని సహా రాజకీయ, సినీ ప్రముఖులు నివాళి..

    తాజాగా ఇపుడు డిసెంబర్ 2న ఈ సినిమా థియేటర్స్‌లో ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల  కానుంది. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి తెరకెక్కించిన ‘మరక్కార్’ అరేబియా సముద్ర సింహం సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Action King Arjun, Malluwood, Marakkar, Mohanlal, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు