‘ఒడియన్’ టీజర్ టాక్.. మోహన్ లాల్ మాస్ అవతారం..

మన హీరోలు పక్క ఇండస్ట్రీలను పెద్దగా పట్టించుకోరు కానీ అక్కడి వాళ్లు మాత్రం టాలీవుడ్‌పై దండయాత్ర చేస్తూనే ఉంటారు. ఒక్క హిట్ కానీ వచ్చిందంటే దాన్ని యూజ్ చేసుకుంటూ వరస సినిమాలు చేస్తూనే ఉంటారు.. ఇక్కడ విడుదల చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మోహన్ లాల్ కూడా ఇదే చేస్తున్నాడు. తాజాగా ఈయన నటిస్తున్న ‘ఒడియన్’ తెలుగు టీజర్ విడుదలైంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 8, 2018, 6:37 PM IST
‘ఒడియన్’ టీజర్ టాక్.. మోహన్ లాల్ మాస్ అవతారం..
ఒడియన్ టీజర్
  • Share this:
మన హీరోలు పక్క ఇండస్ట్రీలను పెద్దగా పట్టించుకోరు కానీ అక్కడి వాళ్లు మాత్రం టాలీవుడ్‌పై దండయాత్ర చేస్తూనే ఉంటారు. ఒక్క హిట్ కానీ వచ్చిందంటే దాన్ని యూజ్ చేసుకుంటూ వరస సినిమాలు చేస్తూనే ఉంటారు.. ఇక్కడ విడుదల చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మోహన్ లాల్ కూడా ఇదే చేస్తున్నాడు. ఈయన కూడా ఇప్పుడు వరసగా తెలుగులో తన సినిమాలను తీసుకొస్తున్నాడు. ఒకవైపు సొంత భాష మాళయాలంలో కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు అప్పుడప్పుడూ ప్రయోగాలు కూడా చేస్తున్నాడు. పాతికేళ్ళ తర్వాత తెలుగులో కూడా ‘మనమంతా’, ‘జనతా గ్యారేజ్’ లాంటి సినిమాలు చేసాడు మోహన్ లాల్.
Mohan Lals Odiyan Movie telugu Teaser Released..  మన హీరోలు పక్క ఇండస్ట్రీలను పెద్దగా పట్టించుకోరు కానీ అక్కడి వాళ్లు మాత్రం టాలీవుడ్‌పై దండయాత్ర చేస్తూనే ఉంటారు. ఒక్క హిట్ కానీ వచ్చిందంటే దాన్ని యూజ్ చేసుకుంటూ వరస సినిమాలు చేస్తూనే ఉంటారు.. ఇక్కడ విడుదల చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మోహన్ లాల్ కూడా ఇదే చేస్తున్నాడు. తాజాగా ఈయన నటిస్తున్న ‘ఒడియన్’ తెలుగు టీజర్ విడుదలైంది. MohanLal odiyan movie teaser,mohanlal movies,mohanlal telugu movies,mohanlal malayalam movies,mohanlal janatha garage, Odiyan Movie,ఒడియన్ మోహన్ లాల్,మోహన్ లాల్ జనతా గ్యారేజ్,మోహన్ లాల్ మనమంతా,మోహన్ లాల్ తెలుగు సినిమా,తెలుగు డబ్బింగ్ వెర్షన్
ఒడియన్ టీజర్


‘జనతా గ్యారేజ్’ తర్వాత మలయాళంలో ఇండస్ట్రీ హిట్ అయిన ‘ఫులి మురుగగన్’ సినిమాను తెలుగులో ‘మన్యం పులి’గా తీసుకొచ్చి ఇక్కడా హిట్ కొట్టాడు మోహన్ లాల్. దాంతో వరసగా తన సినిమాలను ఇక్కడ విడుదల చేయడం అలవాటు చేసుకున్నాడు ఈ హీరో. ప్రస్తుతం ఈయన నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఒడియన్’లో నటిస్తున్నాడు.ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మలయాళ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తెలుగు టీజర్ విడుదలైంది. పూర్తిగా మాస్ అవతారంలో రప్ఫాడించాడు మోహన్ లాల్. ఈ చిత్రం కోసం మోహన్ లాల్ 25 కిలోల బరువు తగ్గాడు.

భారీ విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రెండు భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు మోహన్ లాల్. కేరళలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని మలయాళం, తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో 3డి టెక్నాలజీతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 14న విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని దగ్గుపాటి క్రియేషన్స్ సంస్థలో అభిరామ్ దగ్గుపాటి విడుదల చేస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని మోహన్ లాల్ సొంత నిర్మాణ సంస్థలో వస్తుంది. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒడియన్ చిత్రంలో మంజు వారియర్, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
First published: December 8, 2018, 6:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading