హోమ్ /వార్తలు /సినిమా /

Ram Charan: చరణ్ సినిమాలో నటించనన్న స్టార్ హీరో.. కారణం తెలిస్తే షాక్ ?

Ram Charan: చరణ్ సినిమాలో నటించనన్న స్టార్ హీరో.. కారణం తెలిస్తే షాక్ ?

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో సినిమా వస్తున్నవిషయం తెలిసిందే. ఈ మూవీని ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే 30 శాతం షూటింగ్ కూడా పూర్తయ్యింది.

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో సినిమా వస్తున్నవిషయం తెలిసిందే. ఈ మూవీని ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే 30 శాతం షూటింగ్ కూడా పూర్తయ్యింది.

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో సినిమా వస్తున్నవిషయం తెలిసిందే. ఈ మూవీని ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే 30 శాతం షూటింగ్ కూడా పూర్తయ్యింది.

  ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ( Ram Charan) పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సక్సెస్‌తో రామ్ చరణ్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వరుసగా లైన్‌లో ఉన్న సినిమాలన్నీ చేసుకుంటూ పోతున్నాడు. ఇక ప్రముఖ డైరెక్టర్‌ శంకర్‌( Shankar), మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో పాన్‌ ఇండియా మూవీ తెరకెక్కతున్న విషయం తెలిసిందే. ఇటివల సెట్స్‌పైకి వచ్చిన ఈ మూవీ 30 శాతం షూటింగ్‌ను జరుపుకుంది. ఈ మూవీని RC15 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ప్రారంభించారు. ఇందులో చరణ్‌కు జోడిగా కియారా అద్వానీ నటిస్తోంది. ఇదిలా ఉంటే RC15 సెట్స్‌పైకి వచ్చినప్పటి నుంచి ఈ మూవీకి సంబంధించి రోజుకో అప్‌డేట్‌ బయటకు వస్తోంది.

  అయితే స్టార్ డైరెక్టర్, మెగా పవర్ స్టార్ ఉన్న ఈ సినిమాలో ఓ అదిరిపోయే ఆఫర్ వస్తే.. ఎవరూ వదులుకోరు. అలాంటిది.. ఓ స్టార్ హీరో మాత్రం ఈ సినిమాలో నటించే అవకాశం వస్తే వద్దన్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఈ సినిమాలో శంకర్ ఓ ప్రత్యేక పాత్రను డిజైన్ చేశాడట. అయితే ఇందులో కొంతమేర నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. దీంతో ఈ రోల్ ప్లే చేయాలని కోరుతూ శంకర్ అండ్ టీమ్ మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్(Mohan Lal) వద్దకు వెళ్లారట. అయితే మోహన్ లాల్ మాత్రం ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదని సమాచారం. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కావడంతో ఆయన ఈ సినిమాలో చేయనంటూ సున్నితంగా ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.

  చరణ్ శంకర్ కాంబోలో వస్తున్న ఈ సినిమాలో అవినీతికి పాల్పడే ఓ బడా రాజకీయ నాయకుడిగా విలన్‌ పాత్ర ఉండనుందని సమాచారం. ఈ రోల్‌ కోసమే మోహన్ లాల్‌తో టీం సంప్రదింపులు జరిపింది. ఈ పాత్రకు ఆయన అంతగా ఆసక్తి చూపలేదని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇటీవల మోహన్‌ లాల్‌ నటించి బ్రో డాడీ ( Bro Daddy) చిత్రం ఓటీటీలో విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది. అయితే మోహన్ లాల్ (Mohan Lal)ఆఫర్‌ను రిజక్ట్ చేసేసరికి దీంతో శంకర్ అండ్ టీమ్ ఒక్కసారిగా షాక్ తిన్నారు. అయితే సినిమాలో ఈ రోల్ చాలా కీలకం కావడంతో మరో స్టార్ యాక్టర్ కోసం శంకర్ టీం వెతుకులాటలో పడింది.

  మరో తమిళ ప్రముఖ నటుడు అరవింద్ స్వామిని (Arvind Swamy) ఈ పాత్ర చేయాల్సిందిగా శంకర్ టీం కోరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అరవింద్ స్వామి ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదని టాక్ వినిపిస్తోంది. గతంలో రామ్ చరణ్ ధృవ సినిమాలో కూడా అరవింద్ స్వామి నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే శంకర్ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ చరణ్ పక్కన హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు( Dil Raju) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందా అని అప్పుడే సినీ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

  First published:

  Tags: Mohan Lal, Ram Charan, Shankar

  ఉత్తమ కథలు