• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • MOHAN LAL AND MAMMOOTTY AND OTHER MOLLYWOOD ACTORS TEAM UP FOR A RECORD DETAILS HERE MHN

Mohan Lal - Mammotty: ఒక సినిమా.. 140 మంది స్టార్స్.. రికార్డ్ దిశగా అడుగులు

Mohan Lal - Mammotty: ఒక సినిమా.. 140 మంది స్టార్స్.. రికార్డ్ దిశగా అడుగులు

Mohan Lal and Mammootty and other mollywood actors team up for a record details here

Mohan Lal - Mammotty: ఒక సినిమాలో ఓ స్టార్‌ ఉంటే అభిమానులకు పండగే..! ఇది కాదనలేని విషయం. అలాంటిది తాము అభిమానించే 140 మంది స్టార్స్‌ అందరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తుంటే అభిమానులకు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి అద్భుతం త్వరలోనే వెండితెరపై చూడబోతున్నాం..

  • Share this:
    ఒక సినిమాలో ఓ స్టార్‌ ఉంటే అభిమానులకు పండగే..! ఇది కాదనలేని విషయం. అలాంటిది తాము అభిమానించే 140 మంది స్టార్స్‌ అందరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తుంటే అభిమానులకు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మాలీవుడ్ సినీ అభిమానులకు అలాంటి గొప్ప ఛాన్స్‌ దక్కుతుంది. ఇంతకీ అంత మంది స్టార్స్ నటించే సినిమా ఏదీ, ఎందుకు అంత మంది కలిసి నటిస్తున్నారు అనే సందేహం కూడా రాక మానదు. అసలు విషయంలోకి వెళితే.. మలయాళంలో అగ్ర హీరోలైన మోహన్‌లాల్, మమ్ముట్టి ప్రధాన పాత్రధారులుగా ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో మిగిలిన స్టార్స్‌ అందరూ కలిసి నటిస్తున్నారు. ఇంత మంది కలిసి నటిస్తున్నారుగా. ఇదేదో ఫ్యామిలీ సబ్జెక్ట్‌ అని అందరూ అనుకోవచ్చు. కానీ.. ఆసక్తికరమైన విషయమేమంటే ఇంత మంది తారలు కలిసి నటిస్తోన్న చిత్రం ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌. ఇంత మంది స్టార్స్‌ కలిసి నటించే క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంటుందోననే ఆసక్తి రాక మానదు.

    అయితే ఇంతకీ ఇంత మంది కలిసి క్రైమ్‌ థ్రిల్లర్‌లో ఎందుకు నటిస్తున్నారు? అంటే.. కోవిడ్‌ సమయంలో బాగా ఇబ్బందులు ఎదుర్కొన్న సినీ పరిశ్రమల్లో మూవీ ఇండస్ట్రీ ఒకటి. లాక్‌ డౌన్‌ సమయంలో పనులు లేకపోవడంతో అందరూ తిండి లేకుండా ఇబ్బందులు పడ్డారు. సినీ కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారు. వారికి ఇతర స్టార్స్‌ సపోర్ట్‌ చేసినా ఆర్థిక సమస్యలు వారిని వీడలేదు. ఇప్పుడు సినీ పరిశ్రమ కోలుకుంటోంది. ఇలాంటి తరుణంలో సినీ కార్మికులను ఆదుకోవాలని కేరళ సినీ నటుల సంఘం అమ్మ భావించింది. అందులో భాగంగా ఓసినిమాను తెరకెక్కించనున్నట్లు అమ్మ అధ్యక్షుడైన మోహన్‌లాల్‌ తెలిపారు.

    ఈ సినిమా కోసం పనిచేసే సినీ కార్మికులకు పని కల్పించడంతో పాటు.. సినిమా థియేట్రికల్‌ రైట్స్‌, రన్‌, ఇతర రైట్స్‌ ద్వారా వచ్చే డబ్బులను సినీ కార్మికులకు అందించాలని అమ్మ భావించింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను తెలియజేస్తామని మోహన్‌లాల్‌ తెలిపారు. మరి ఇంత మంది స్టార్స్‌ కలిసి నటిస్తోన్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే ఇంత మంది స్టార్స్‌ కలిసి నటించే సినిమా రూపొందితే మాత్రం ఓ రికార్డ్‌ అనే చెప్పాలి.
    Published by:Anil
    First published: