హోమ్ /వార్తలు /సినిమా /

Mohan Babu Vs Chiranjeevi : చిరంజీవి అలా చేసుండాల్సింది కాదు.. నేనైతే అలా ఎన్నటికీ చేయను .. చిరుపై మోహన్ బాబు వ్యాఖ్యలు..

Mohan Babu Vs Chiranjeevi : చిరంజీవి అలా చేసుండాల్సింది కాదు.. నేనైతే అలా ఎన్నటికీ చేయను .. చిరుపై మోహన్ బాబు వ్యాఖ్యలు..

మూడో రోజు కేవలం 14 వేలతోనే సరిపెట్టుకుంది ఈ చిత్రం. ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల్లో ఈ సినిమాకు షేర్ రాలేదు సరికదా నష్టాలే మిగిలాయి అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మంచు విష్ణు ఈ సినిమాను తన 24 ఫిల్మ్ ఫ్యాక్టరీపై నిర్మించాడు. అన్నట్లు ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చాడు.

మూడో రోజు కేవలం 14 వేలతోనే సరిపెట్టుకుంది ఈ చిత్రం. ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల్లో ఈ సినిమాకు షేర్ రాలేదు సరికదా నష్టాలే మిగిలాయి అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మంచు విష్ణు ఈ సినిమాను తన 24 ఫిల్మ్ ఫ్యాక్టరీపై నిర్మించాడు. అన్నట్లు ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చాడు.

Mohan Babu Vs Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి అలా చేసుండాల్సింది కాదు.. నేనైతే అలా ఎన్నటికీ చేయను .. తాజాగా మోహన్ బాబు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరుపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే..

  Mohan Babu Vs Chiranjeevi : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబు, చిరంజీవిలది ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబు, చిరంజీవిది టామ్ అండ్ జెర్రీ కాంబినేషన్ అనే చెప్పాలి. ఎపుడు కలిసినట్టే ఉంటారు. ఇంతలోనే ఎవరివారే యమునా తీరే అన్నట్టు ఉంటుంది వీరి వ్యవహారం. అసలు కడుపులు కత్తుల పెట్టుకొని పైకి పొత్తు ఉన్నట్టు ఉంటుంది చూసే వాళ్లకు వీరి వ్యవహారం. తాజాగా మా ఎలక్షన్స్ నేపథ్యంలో ఓ తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్వరలో జరగనున్న ‘మా’ ఎలక్షన్స్ నేపథ్యంల  మోహన్ బాబు.. చిరంజీవితో పాటు ఆయన ఫ్యామిలీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి ఇండస్ట్రీలో 24 గంటలుగా చాలా చర్చ జరుగుతుంది.

  ముఖ్యంగా గత రెండు పర్యాయాలుగా చూస్తే ఆ సంప్రదాయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్లు కనిపిస్తోంది. ఇవి కూడా మెయిన్ ఎలక్షన్స్ అయిపోయాయి. అందులోనూ ఒకరినొకరు తిట్టుకోవడాలు.. అరుచుకోవడాలు చేస్తున్నారు. కుదిర్తితే కొట్టుకునేలా కూడా కనిపిస్తున్నారు. అంతగా రచ్చ జరుగుతుంది. అంటే అంతా కలిసికట్టుగా ఉండి ఒకర్ని అధ్యక్షుడిగా ఎన్నకునేవాళ్లు. లేదంటే పెద్దలు చెప్పిన వాళ్లకే ఓటేసేవాళ్లు. కానీ మూడు నాలుగేళ్లుగా పరిస్థితులు మారిపోయాయి.

  Bollywood 2022 Release Movies : ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సహా బాలీవుడ్‌లో విడుదల కాబోతున్న టాలీవుడ్ హీరోల ప్యాన్ ఇండియా మూవీస్ ఇవే..

  ఈ సారి ఏకంగా చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు జరిగేలా కనిపిస్తుంది. ఇండస్ట్రీకి పెద్దగా దాస‌రి నారాయణరావు ఉన్న‌ప్పుడు ఆయ‌న మాట చెల్లుబాటు అయింది. అప్పుడు ‘మా’లో లుకలుకలు లేకుండా ఎన్నిక‌లు ఏక‌గ్రీవంగానే సాగాయి. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి. అయితే ఈ మధ్యే చిరంజీవి, మోహన్‌ బాబు, కృష్ణంరాజు లాంటి వాళ్లంతా కలిసి తామంతా ఒక్కటే అని చెప్పుకున్నారు. ఇప్పటికైనా సమస్య సమసిపోతుందని అనుకున్నారంతా. మరోవైపు దాసరి తర్వాత చిరంజీవిని తాను ఇండస్ట్రీ పెద్దగా భావించడం లేదున్నారు. దాసరితోనే అదంతా పోయిందన్నారు. ఈ నెల 10న మా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

  Mohan Babu: నట ప్రపూర్ణ మోహన్‌బాబును కలెక్షన్ కింగ్ చేసింది ఎవరో తెలుసా..

  ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. ఒక వేళ ‘మా’ అధ్యక్ష బరిలో  చిరంజీవి కుటుంబ సభ్యుల్లో ఆయన కుమారుడు రామ్ చరణ్, తమ్ముడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ లేకుంటే అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్.. మా అధ్యక్షుడిగా పోటీలో ఉంటే.. తాను బేషరుతుగా మద్ధుతు ఇచ్చే వాడినని కుండబద్దలు  కొట్టారు. కానీ చిరంజీవి ఫ్యామిలీ మాత్రం.. తన తనయుడు పోటీలో ఉన్న కావాలనే ప్రకాష్ రాజ్ ప్యానెల్‌కు సపోర్ట్ చేస్తున్నారు. ఆయన అలా చేసుండాల్సింది కాదు.. నేనైతే అలా ఎన్నటికీ చేయను .. చిరుపై మోహన్ బాబు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

  Nayanthara - Anushka: అనుష్క టూ నయనతార.. ఆ తరహా పాత్రలో ఇరగదీసిన భామలు..

  అంతేకాదు ‘మా’ ఎన్నికల్లో తన తనయుడు మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నిక అవ్వడం ఖాయం అంటూ ఘంటాపథంగా చెప్పారు. అంతేకాదు విష్ణు గెలిచాకా.. తన సొంత డబ్బులతో ‘మా’ అధ్యక్ష భవనం కడతారని చెప్పారు. ఈ సారి పోటీలో చివరకు మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మాత్రమే మిగిలారు.  ఇక  చిరంజీవి, మోహన్ బాబు వీళ్లిద్దరు ఎన్నోసినిమాల్లో కలిసి నటించారు. కొన్ని సినిమాల్లో వీళ్లిద్దరు హీరోలుగా నటిస్తే.. మరికొన్ని సినిమాల్లో చిరు హీరోగా నటిస్తే.. మోహన్ బాబు విలన్‌గా యాక్ట్ చేసారు. ఇక మోహన్ బాబు, చిరంజీవి కూడా హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత పలు సినిమాల్లో విలన్‌గా నటించారు. ఇక చిరంజీవి మాత్రం అగ్ర హీరోగా తెలుగులో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు.

  Ashwini Dutt - Chiranjeevi : వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

  ఇక మోహన్ బాబు మాత్రం కాస్తా లేటుగా మళ్లీ హీరోగా బ్రెేక్ లభించింది. హీరోగా మోహన్ బాబు నటించిన చాలా చిత్రాలను ఆయనే నిర్మాతగా వ్యవహరించడం విశేషం. మోహన్ బాబు పూర్తి స్థాయి హీరోగా మారిన తర్వాత వీళ్లిద్దరు కలిసి నటించలేదు. వీళ్లిద్దరు మొదటి సారి ‘శ్రీరామబంటు’ సినిమాలో కలిసి నటించారు. చివరగా ‘కొదమ సింహం’లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Chiranjeevi, MAA Elections, Mohan Babu, Tollywood

  ఉత్తమ కథలు