news18-telugu
Updated: February 19, 2020, 11:43 AM IST
మేజర్ చంద్రకాంత్ మూవీలో మోహన్ బాబు,ఎన్టీఆర్(Twitter/Photo)
తెలుగు చలన చిత్రసీమలో అగ్రనటుడిగా ఓ వెలుగు వెలిగిన తర్వాత.. రాజకీయాల్లో ప్రవేశించి సంచలనం సృష్టించారు ఎన్టీఆర్. అంతేకాదు అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఖంగు తినిపించి ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన జీవిత చరిత్రపై ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ.. ఎన్టీఆర్ జీవిత కథపై ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు గా రెండు పార్టులుగా సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఇక ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా బాలయ్య తన తండ్రి జీవితంలో చూపించని భాగాన్ని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’గా తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా అనుకున్నంత రేంజ్లో మెప్పించలేకపోయింది. తాజాగా అన్న ఎన్టీఆర్‌తో ఎంతో అనుబంధం ఉన్న మోహన్ బాబు అన్నగారి జీవిత కథపై ఒక వెబ్ సిరీస్ నిర్మించబోతున్నట్టు సమాచారం. ఈ వెబ్ సిరీస్‌ను మంచు విష్ణు నిర్మించనున్నాడు. ‘చదరంగం’ పేరుతో తెరకెక్కబోతున్న ఈ బయోపిక్‌లో శ్రీకాంత్‌తో పాటు మోహన్ బాబు అన్నగారి పాత్రలో కనిపించనున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను ఎన్టీఆర్ జీవితంలా కాకుండా.. సినిమాల నుండి రాజకీయాలకు వచ్చిన ఒక పొలిటిషన్ జీవిత కథ అనే కోణంలో కాస్త కల్పితంగా తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. రీసెంట్గా జయలలిత జీవితంపై రమ్యకృష్ణ ముఖ్యపాత్రలో ‘క్వీన్’ వెబ్ సిరీస్ తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. అదే తరహాలో ఎన్టీఆర్ బయోపిక్‌ను వెబ్ సిరీస్‌గా తెరకెక్కిస్తున్నారు.

ఎన్టీఆర్ పాత్రలో మోహన్ బాబు (Twitter/Photo)
ఒక మోహన్ బాబు కూడా బాలకృష్ణలా ఎన్టీఆర్‌కు చంద్రబాబు దింపేసి ముఖ్యమంత్రి కావడం, లక్ష్మీ పార్వతి ఎపిపోడ్ వంటివి ఇందులో చూపెడతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి వెండితెరపై వర్కౌట్ కానీ ఎన్టీఆర్ జీవితంపై స్మాల్ స్క్రీన్ పై హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
February 19, 2020, 11:43 AM IST