సూపర్ స్టార్ రజినీకాంత్ అస్వస్థతకు లోనవడంతో సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ మాత్రమే కాదు భారతీయ సినీ ప్రముఖులు అంతా సూపర్‌స్టార్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. దాంతో అంతా షాక్ అయ్యారు. బీపీ పెరగడంతో ఇబ్బంది పడ్డ ఆయనను వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ఎప్పటికప్పుడు రజినీ ఆరోగ్య స్థితిని అపోలో వైద్యులు గమనిస్తున్నారు. ఇదే విషయాన్ని హెల్త్ బులెటన్లో కూడా విడుదల చేసారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ ప్రాణ స్నేహితుడు మోహన్ బాబు ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నాడు. రజినీకి అత్యంత సన్నిహితుడు అయిన మోహన్ బాబు తన మిత్రుడి ఆరోగ్యం గురించి వాకబు చేసాడు. ప్రస్తుతం మోహన్‌బాబు తిరుపతిలో ఉన్నాడు. స్నేహితుడు అస్వస్థతతో హాస్పిటల్లో చేరారనే వార్త తెలుసుకున్న ఆయన ఆందోళనకు గురయ్యాడు.

రజినీకాంత్ మోహన్ బాబు (rajinikanth mohan babu)
వెంటనే ఆయన యోగక్షేమాలు తెలుసుకునేందుకు రజనీ భార్య లతకు, కుమార్తె ఐశ్వర్యకు, సోదరికి ఫోన్లు చేశాడు. రజనీ ఆరోగ్యం నిలకడగా ఉందనీ, ఎలాంటి ఆందోళనా పడాల్సిన అవసరం లేదనీ వాళ్లు చెప్పిన తర్వాత కానీ మోహన్ బాబు కుదుటపడలేదు. రజనీ మానసికంగా, శారీరకంగా దృఢమైన వ్యక్తి అని.. ఈ అస్వస్థత నుంచి ఆయన త్వరగా కోలుకుని ఎప్పటిలా తన పనులు మొదలు పెడతారని మోహన్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రజినీకాంత్ ప్రస్తుతం అన్నాత్తై సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లోనే ఉన్నాడు. ఈ షూటింగ్ సమయంలోనే అనారోగ్యం పాలయ్యాడు. మరోవైపు మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.
Published by:Praveen Kumar Vadla
First published:December 25, 2020, 22:26 IST